దళిత మైనారిటీ ఓటుబ్యాంకు టివికే వైపే..
ఈసారి మైనారిటీలు ఎక్కువగా నివసించే నియోజకవర్గాల్లో టీవీకే ఆధిక్యం కనబరుస్తోంది. క్రిస్టియన్లు అధికంగా ఉండే నాగర్‌కోయిల్, విళవంకోడ్, కుళచల్ వంటి నియోజకవర్గాల్లో టీవీకే ముందంజలో ఉంది. చెన్నైలోని మైలాపూర్, పెరంబూర్, ఆలందూర్, తాంబరం వంటి క్రిస్టియన్లు నివసించే ప్రాంతాల్లోనూ టీవీకే ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతేకాదు తిరునల్వేలి, పాళయంకోట్టై, రాధాపురంలలో కూడా టీవీకే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. త్రిచీ తూర్పు నియోజకవర్గంలో విజయ్ స్వయంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు.
ఇక ఇస్లామిక్ ఓటర్లు ఎక్కువగా ఉండే వేలూరు జిల్లాలోని వాణియంబాడి, ఆంబూర్, వేలూరు, గుడియాత్తంలలో కూడా టీవీకే హవా నడుస్తోంది. చెన్నైలోని చేపాక్-తిరువల్లిక్కేని, హార్బర్, విల్లివాక్కంలలో డీఎంకే ఓటు బ్యాంకును టీవీకే చీల్చేసింది. ఇలా డిఎంకే దళితులు, ముస్లిం మైనారిటీ ఓట్లను తమవైపు తిప్పుకోవడంతో విజయ్ టివికే విజయం సాధించింది.