వివాహేతర సంబంధం : ప్రియురాలి కొడుకును వేడి నీటి బకెట్లో ముంచి.. చిత్రహింసలు.. చివరికి..

Published : Apr 25, 2023, 09:18 AM IST

వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పెళ్లికి ఒప్పుకోలేదని.. ఆమె కొడుకును వేడినీటి బకెట్లో ముంచి చంపాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన ముంబైలో వెలుగు చూసింది. 

PREV
17
వివాహేతర సంబంధం : ప్రియురాలి కొడుకును వేడి నీటి బకెట్లో ముంచి.. చిత్రహింసలు.. చివరికి..

ముంబై : వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న నేరాల్లో మరో దారుణం ఈ ఘటన. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమారుడిని ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. అత్యంత కర్కశంగా చిన్నారి అని కూడా కనికరం లేకుండా.. ఆ బాలుడిని వేడి వేడి నీళ్లు ఉన్న బకెట్లో ముంచాడు. 
 

27

దీంతో ఆ వేడికి తట్టుకోలేని ఆ చిన్నారి తీవ్ర గాయాల పాలయ్యాడు.  అతడిని ఆసుపత్రికి తరలించగా.. 15 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడాడు. చివరకు ఆ నరకం భరించలేక తుదిశ్వాస విడిచాడు.

37
\

ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు విక్రమ్ శరద్ కోలేకర్. మహారాష్ట్రలోని ఖేడ్ లో ఉంటాడు. చాలాకాలంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ మహిళ భర్తతో విడిపోయి తన కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటుంది. ఆమె కూడా ఖేడ్ లోనే ఉంటోంది. 
 

47

ఏప్రిల్ 6న ఉదయం పూట విక్రమ్ శరద్ కోలేకర్  ఆ మహిళ ఇంటికి వెళ్ళాడు. అప్పటికి మామూలుగానే ఉన్నాడు. ఆమె తన పిల్లాడిని అతనికి అప్పగించి బయటికి వెళ్ళింది. అంతే,  ఏమైందో తెలియదు కానీ.. విక్రమ్ శరద్ కోలేకర్ ఆ చిన్నారిని వేడి వేడి నీటి బకెట్లో ముంచాడు. ఆ బాధలకు తాళలేక చిన్నారి గట్టిగా కేకలు వేస్తూ ఏడ్చాడు.

57

కాసేపటికి ఇంటికొచ్చి చూసిన తల్లి.. చిన్నారి కాలిన గాయాలతో విలవిల్లాడుతుండడం గమనించింది..  వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లింది. 15 రోజులు చికిత్స తర్వాత ఆ చిన్నారి మృతి చెందాడు.

67

విక్రమ్ శరద్ కోలేకర్ మీద ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  తనను పెళ్లి చేసుకోమని చాలా రోజులుగా విక్రమ్ శరద్ కోలేకర్ అడుగుతున్నాడని తెలిపింది. అయితే, దీనికి తాను ఒప్పుకోలేదు అని చెప్పింది. దీంతో తన మీద కోపంతోనే కుమారుడిని చంపాడని మహిళా ఆరోపించింది. 

77

మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్రమ్ శరద్ కోలేకర్ అరెస్టు చేశారు. ఇదే కారణమా లేక చిన్నారిని హత్య చేయడానికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!

Recommended Stories