ఇలాంటి పరిస్థితుల్లో ఏడాదికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడవచ్చు? ఎక్కువగా వాడితే సబ్సిడి లభించదా? అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. అయితే కొన్ని కంపనీలు ఏడాదికి 15 కంటే ఎక్కువ సిలిండర్లను వాడేవారికి షాక్ ఇస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఏడాదికి 15 సిలిండర్లు వాడిన వాళ్లు ఆ తర్వాత సిలిండర్ కోసం రిజిస్టర్ చేసుకుందామంటే కుదరడం లేదట.''ప్రియమైన కస్టమర్... మీ వంట గ్యాస్ సిలిండర్ రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు... ఎందుకంటే మీరు ఇప్పటికే ఏడాది కోటా 213 కిలోలు వాడేశారు'' అని మెసేజ్ లు వస్తున్నాయట.
ఇందులో నిజం ఎంతో తెలియదుగానీ గ్యాస్ ను ఎక్కువగా ఉపయోగించేవారికి ఈ ప్రచారం భయపెడుతోంది. గ్యాస్ కంపనీలే ఈ ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలి.