టీఎంసీ ర్యాలీలో పిడుగుపాటు.. ఓ కార్యకర్త మృతి, 25 మందికి గాయాలు, ఏడుగురి పరిస్థితి విషమం...

Published : May 01, 2023, 11:53 AM IST

ఇండాస్‌లో తృణమూల్ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఓ కార్యకర్త మృతి చెందగా, 25మంది గాయపడ్డారు. 

PREV
16
టీఎంసీ ర్యాలీలో పిడుగుపాటు.. ఓ కార్యకర్త మృతి, 25 మందికి గాయాలు, ఏడుగురి పరిస్థితి విషమం...

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపాటుకు 40 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మరణించాడని, కనీసం 25 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇండాస్‌లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రసంగిస్తున్న ర్యాలీలో ఈ సంఘటన జరిగింది.

26

సాబెర్ మల్లిక్ అనే ఆ కార్యకర్త ఆదివారం ర్యాలీలో పాల్గొన్నాడు. ఆ సమయంలో వేదిక సమీపంలోని చెట్టుపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు అతను తీవ్రంగా గాయాలపాలయ్యాడు. అది గమనించిన వారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు.

36

"ఆదివారం ర్యాలీ సమయంలో కుండపోత వర్షం మొదలయ్యింది. దీంతో కొందరు తృణమూల్ కార్యకర్తలు చెట్టు కింద ఆశ్రయం పొందారు. ఆ సయమంలో ఓ చెట్టు మీద పిడుగుపడడంతో మల్లిక్ మరణించాడు. దాదాపు 25 మంది గాయపడ్డారు" అని అధికారి తెలిపారు. గాయపడిన 25 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.

46

"ఇండాస్‌లో పార్టీ ర్యాలీ సమయంలో పిడుగుపాటు ఘటనలో మృతి చెందిన గాయపడిన బాధితులైన వారందరికీ మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం. వారిని ఆదుకోవడానికి మా వంతు కృషి చేస్తాం. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. వైద్య సహాయం అందించడానికి స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నాం" అని పార్టీ ట్విట్టర్‌లో తెలిపింది.

56

ఘటన జరిగినప్పుడు ర్యాలీలో ప్రసంగిస్తున్న టీఎంసీ యువనేత దేబాంగ్షు భట్టాచార్య ఆ తరువాత వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. "ఈ ఘటనతో మేమంతా షాక్‌లో అయ్యాం. క్షతగాత్రులకు, మృతుల కుటుంబ సభ్యులకు సహాయం చేయాలని మా నాయకుడు అభిషేక్ బెనర్జీ ఆదేశించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులన్నీ మేమే భరిస్తాం" అని ఆయన తెలిపారు.

66

పంచాయితీ ఎన్నికలకు ముందు బెనర్జీ చేపట్టిన 'తృణమూల్ నబజోవర్' (తృణమూల్‌లో కొత్త వేవ్) పార్టీ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండాస్ వద్ద ర్యాలీ జరిగింది.

click me!

Recommended Stories