'జన గణ మన' పాడి.. ప్రధాని మోదీ పాదాలను తాకిన సింగర్ మేరీ మిల్‌బెన్...

Published : Jun 24, 2023, 12:40 PM ISTUpdated : Jun 24, 2023, 12:45 PM IST

ప్రధాని మోడీ కోసం భారత జాతీయ గీతాన్ని ప్రదర్శించడం తనకు ఎంతో గౌరవంగా ఉందని మిల్‌బెన్ అన్నారు.

PREV
18
'జన గణ మన' పాడి.. ప్రధాని మోదీ పాదాలను తాకిన సింగర్ మేరీ మిల్‌బెన్...

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. ఆ తరువాత ఆమె ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

28

38 ఏళ్ల మిల్‌బెన్, వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (యూఎస్ఐసీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఆహ్వానం మేరకు.. ఈ కార్యక్రమంలో భారత జాతీయ గీతాన్ని ఆలపించారు.

38
Mary Millben

ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని మేరీ మిల్‌బెన్. ఆమె జాతీయ గీతం జన్ గణ మన, ఓం జై జగదీశే హరే పాటలు పాడడంతో మన దేశప్రజలకు సుపరిచితురాలు. 

48

ఈ కార్యక్రమానికి ముందు, మిల్‌బెన్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ కోసం భారత జాతీయ గీతాన్ని పాడడం తనకు చాలా గౌరవంగా ఉందని అన్నారు.

58

“వరుసగా నలుగురు అమెరికా అధ్యక్షుల ముందు అమెరికన్ జాతీయ గీతం, దేశభక్తి సంగీతాన్ని ఆలపించాను. ఇప్పుడు ప్రధాని మోదీ ముందు భారత జాతీయ గీతాన్ని ప్రదర్శించడం ఎంతో గౌరవంగా ఉంది. దేశం,ప్రజల గౌరవార్థం నేను నా కుటుంబాన్ని పిలవడానికి వచ్చాను” అని గాయని ఒక ప్రకటనలో చెప్పారు. 

68

"అమెరికన్, భారతీయ గీతాలు రెండూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, ఆదర్శాలను తెలుపుతాయి. ఇది యుఎస్-ఇండియా సంబంధాల నిజమైన సారాంశం. దేశంస్వేచ్ఛా.. స్వేచ్ఛా ప్రజలచే మాత్రమే నిర్వచించబడుతుంది" అని ఆమె అన్నారు.

78

ప్రధాని మోదీ శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రకాశాన్ని, భారతీయ విలువలు, సంస్కృతిలో పాతుకుపోయిన తీరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం పొందింది. గత నెలలో, ప్రధాని మోదీ పపువా న్యూ గినియా పర్యటన సందర్భంగా, పసిఫిక్ ద్వీప దేశపు ప్రధాని గౌరవ సూచకంగా ప్రధాని మోదీ పాదాలను తాకారు. 

88

ప్రధాని బయలుదేరేముందు కూడా ఇదే విధమైన సంజ్ఞ కనిపించింది, ఒక మహిళ, ఒక వ్యక్తి ప్రధాని ముందు తలలు వంచి నేలను తాకించినట్టుగా విమానాశ్రయం నుండి విజువల్స్ కనిపించాయి. పిఎం మోడీ వెంటనే చేతులు జోడించి నమస్కరించడం ద్వారా వారికి ప్రతిస్పందించారు.

click me!

Recommended Stories