International Women’s Day: మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు... భార‌త్ లోని కొంత‌మంది సూప‌ర్ ఉమెన్‌లు !

Published : Mar 08, 2022, 03:32 PM ISTUpdated : Mar 08, 2022, 03:33 PM IST

International Women’s Day: ఏ రంగంలోనూ తీసిపోని విధంగా నేడు మ‌హిళ‌లు దూసుకుపోతున్నారు. అనేక రంగాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని కైవ‌సం చేసుకుంటున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌హిళా శ‌క్తిని గుర్తుచేసుకుంటూ నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని యావ‌త్ ప్ర‌పంచం జ‌రుపుకుంటున్న‌ది. ఈ క్ర‌మంలోనే భార‌త్ లో మ‌హిళా శ‌క్తిని చాటుతూ.. వివిధ రంగాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుని.. ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్న కొంత మంది భార‌త సూప‌ర్ ఉమెన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. !  

PREV
17
International Women’s Day: మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు... భార‌త్ లోని కొంత‌మంది సూప‌ర్ ఉమెన్‌లు !

దీపికా పదుకొనే: భార‌త సినీ రంగంలో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేకత‌ను సంపాదించుకున్న న‌టీన‌టుల్లో పిదికా ప‌దుకొనె ఒక‌రు. బాలీవుడ‌ట్ లో  అత్యధిక పారితోషికం తీసుకుంటూ.. విజ‌య‌వంత‌మైన కెరీర్‌ను ఆమె కొన‌సాగిస్తూ.. ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఆమె 'ఓం శాంతి ఓం' సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 'బాజీరావ్ మస్తానీ', 'పికూ', 'రామ్ లీలా', 'పద్మావతి' వంటి  విజ‌య‌వంత‌మైన సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రాజెక్ట్‌ల కోసం దాదాపు రూ. 30 కోట్లు పారితోషికం తీసుకుంటున్న‌ద‌ని స‌మాచారం. అలాగే, అనేక బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్ గా కొన‌సాగుతున్నారు. దేశ‌విదేశాల్లో పెద్ద ఎత్తును ఆమెకు అభిమానులు ఉన్నారు. 

27
रितु कुमार

రీతూ కుమార్ : ప్రముఖ డిజైనర్ రీతూ కుమార్ ఫ్యాషన్ పరిశ్రమను మ‌రింత ఉన్న‌త స్థాయికి తీసుకెళ్లింది. భారతదేశంలోని మొట్టమొదటి డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఫ్యాషన్, ఇల్లు & జీవనం వంటి విభాగాలలో భారతీయ వస్త్రాల రంగంలో రాణిస్తూ.. నేటి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఆమె డిజైన్‌లను దివంగత వేల్స్ యువరాణి డయానా, అలాగే ప్రియాంక చోప్రా, లారా దత్తా, దీపికా పదుకొనే, మాధురీ దీక్షిత్, జెమీమా గోల్డ్‌స్మిత్ వంటి ప్రముఖులు కూడా ధరించారు.

37
Aishwarya Sridhar

ఐశ్వర్య శ్రీధర్ : ప్ర‌పంచంలోని గొప్ప ఫొటో గ్రాఫ‌ర్ ల‌లో ఒక‌రిగా పేరు సంపాదించిన ఈమె తెలియ‌ని భార‌తీయులు లేర‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి కాదు. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్‌గా గౌరవించబడిన మొదటి భారతీయ మహిళ. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల నుండి వచ్చిన 50,000 సమర్పణల నుండి 'లైట్స్ ఆఫ్ ప్యాషన్' పేరుతో ఐశ్వ‌ర్య శ్రీ‌ధ‌ర్ చిత్రం ఎంపిక చేయబడింది.
 

47

ఫల్గుణి నాయర్ : మహిళా నాయకుల విషయానికి వస్తే Nykaa వ్యవస్థాపకురాలు మ‌రియు CEO అయిన ఫల్గుణి నాయర్ నిస్సందేహంగా అంద‌రికి ఆద‌ర్శంగా నిలిచే నారీ శ‌క్తి. Nykaa  ఇటీవలి స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్  చేయ‌డంలో ఫాల్గుణి నాయ‌ర్ పేరు పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఐపీవో ఎంట్రీ ఇచ్చిన కంపెనీ వ్య‌వస్థాప‌క మ‌హిళ‌ల్లో టాప్ 24 మంది మహిళ‌ల్లో ఆమె ఒక‌రు. నాయర్  వ్యవస్థాపక ప్రయాణం 2012లో ప్రారంభమైంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా తన ఉద్యోగాన్ని వదిలి ఆన్‌లైన్ బ్యూటీ పరిశ్రమలో వృత్తిని కొనసాగించాలని నాయర్ నిర్ణయించుకున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత, Nykaaను ఐపీవో వ‌ర‌కు తీసుకువ‌చ్చి రికార్డు లిస్టింగ్ సాధించారు. 
 

57

అరుంధతీ భట్టాచార్య : ఆమె భారతదేశంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి మహిళ మాత్రమే కాదు, ఫోర్బ్స్ ఆమెను ప్రపంచంలోని 25వ అత్యంత శక్తివంతమైన మహిళగా పేర్కొంది. 22 సంవత్సరాల వయస్సులో, ఆమె 1977లో SBIలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)గా చేరారు. మహిళలు ఈ రంగంలో పని చేయడం సులభతరం చేయడానికి ఆమె కొన్ని అద్భుతమైన చొరవలను తీసుకుంది. పిల్లలు లేదా వృద్ధుల సంరక్షణ కోసం మహిళా ఉద్యోగుల కోసం ఆమె రెండేళ్ల విశ్రాంతి విధానాన్ని ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు, ఆమె తన మహిళా ఉద్యోగులందరికీ ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ అందించాలని నిర్ణయించుకుంది.
 

67
భారత చెస్ క్రీడాకారిణి, చెస్ ప్రెసెంటర్, కామెంటేటర్ తానియా సచ్‌దేవ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

తానియా సచ్‌దేవ్ : తానియా భారతదేశపు అత్యంత ప్రముఖ మహిళా చెస్ క్రీడాకారిణి అని, ఆమె పేరుకు అనేక బిరుదులు ఉన్నాయని కొద్ది మందికి మాత్రమే తెలుసు. సచ్‌దేవ్ ఆరేళ్ల  వయసులో చెస్ ఆడటం ప్రారంభించారు.  ఇంటర్నేషనల్ మాస్టర్ మరియు ఉమెన్ గ్రాండ్‌మాస్టర్ బిరుదులను గుర్తింపు పొందారు. ప్ర‌స్తుతం ఆమె  చెస్ ప్రెజెంటర్‌గా మరియు వ్యాఖ్యాతగా పనిచేస్తుంది.

77
Punita Arora

పునీతా అరోరా : ఆమె లాహోరుకు చెందిన పంజాబీ కుటుంబంలో జన్మించారు. 12 సంవత్సరాల ప్రాయంలో ఆమె కుటుంబం భారత దేశానికి వచ్చింది. భారత దేశ విభజన వల్ల వారు లాహోరు నుండి వచ్చి ఉత్తర ప్రదేశ్ లోని సహారాన్‌పూర్ లో స్థిరపడ్డారు. లెప్టినెంట్ జనరల్ పునీతా అరోరా భారతదేశంలో రెండవ ఉన్నత ర్యాంకు సాధించిన మొదటి మహిళ. 
 

Read more Photos on
click me!

Recommended Stories