ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీ ప్రయాగరాజ్ కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబసమేతంగా కుంభమేళాకు వచ్చిన ఆయన గంగా నదిలో స్నానం ఆచరించిన తర్వాత హనుమాన్ దర్శనం చేసుకున్నారు. ఇలా కుంభమేళాకు వచ్చిన అదానీ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండియాలోనే అత్యంత ధనికుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదులుకలిసే త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఆయన కుటుంబంతో కలిసి బడే హనుమాన్ మందిరాన్ని సందర్శించారు. హనుమంతున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు అంబానీ కుటుంబసభ్యులు.
25
Gautam Adani Attends Maha Kumbh
గౌతమ్ అదానీ హనుమాన్ మందిరంలో దర్శనం చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మందిరంలోకి ప్రవేశించి పూజలు చేస్తున్న దృశ్యాలు ఈ ఫోటోల్లో కనిపిస్తున్నాయి.
35
Gautam Adani Attends Maha Kumbh
ప్రయాగరాజ్ లోకి హనుమాన్ ఆలయాన్ని సందర్శించడమే కాదు స్వయంగా పూజలు చేసారు గౌతమ్ అదానీ. స్వామివారికి ఆయన హారతి ఇస్తున్న వీడియో బైటకు వచ్చింది. హనుమంతుడికి అదానీతో ప్రత్యేక పూజలు చేయించిన అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.
45
Gautam Adani Attends Maha Kumbh
గౌతమ్ అదానీ దర్శనం సమయంలో హనుమాన్ ఆలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతను పర్యవేక్షించారు.
55
Gautam Adani Attends Maha Kumbh
ఈ సందర్భంగా గౌతమ్ అదానీ ప్రజలను కలిశారు. సరదాగా ముచ్చటించారు. కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానం, హనుమాన్ దర్శనం చాాలా ప్రత్యేకమైనవని... ఇది తనకు దక్కిన అదృష్టంగా అదానీ పేర్కొన్నారు.