Rekha Gupta Assets : డిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులెంతో తెలుసా? కేవలం రూ.4 లక్షల కారు వాడతారా?

Published : Feb 20, 2025, 11:17 AM ISTUpdated : Feb 20, 2025, 11:49 AM IST

డిల్లీ ముఖ్యమంత్రి రేసులో అనూహ్యంగా రేఖా గుప్తా పేరు చేరింది... హేమాహేమీ నాయకులను కాదని మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకే డిల్లీ పీఠమెక్కే అవకాశం దక్కింది. ఈ క్రమంలో రేఖా గుప్తా ఆస్తిపాస్తుల గురించి తెలుసుకుందాం... 

PREV
14
Rekha Gupta Assets : డిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులెంతో తెలుసా? కేవలం రూ.4 లక్షల కారు వాడతారా?
Delhi CM Rekha Gupta Assets

Rekha Gupta : ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు రేఖా గుప్తా. బిజెపి అదిష్టానం డిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె పేరు ప్రకటించగానే ఒక్కసారిగా ఎవరీ రేఖా గుప్తా? అనే ప్రశ్న ప్రజల్లో మొదలయ్యింది. అప్పటివరకూ కేవలం నియోజకవర్గ ప్రజలకే రేఖా గుప్తా పరిచయం... డిల్లీలో కూడా చాలామందికి ఆమె ఎవరో తెలియదు. అలాంటిది ఒక్కసారిగా డిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరు యావత్ దేశానికి పరిచయం అయ్యింది. ప్రస్తుతం రేఖా గుప్తా గురించి తెలుసుకునేందుకు దేశ ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు... దీంతో గూగుల్ లో ఈమె ట్రెండింగ్ గా మారిపోయారు.

రేఖా గుప్తా రాజకీయ ప్రస్థానంతో పాటు ఆమె వ్యక్తిగత వివరాల గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె స్వస్థలం ఏది? విద్యార్హతలు ఏమిటి? భర్త, పిల్లల వివరాలు, ఆస్తిపాస్తులు... ఇలా రేఖా గుప్తాకు సంబంధించిన ప్రతి విషయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా డిల్లీ సీఎం రేఖా గుప్తా ఓవర్ నైట్ దేశ రాజకీయాల్లో కీలక నాయకురాలిగా మారిపోయాయి. 

ముఖ్యంగా రేఖాగుప్తా భర్త, వారి కుటుంబ ఆస్తిపాస్తుల గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. డిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేఖా గుప్తా ఈసికి అందజేసిన అఫిడవిట్ ప్రకారం ఆస్తిపాస్తులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ వివరాలను ఓసారి పరిశీలిద్దాం.  
 

24
Rekha Gupta Assets

రేఖా గుప్తా ఆస్తిపాస్తులు : 

డిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇప్పటివరకు చాలా సాధారణ జీవితం గడిపారు. ఆమె గత దశాబ్దకాలంగా డిల్లీ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు... ఇప్పటి పలు పదవుల్లో పనిచేసారు. కానీ ఆమెవద్ద ఇప్పటికీ సొంత కారు లేదు... భర్త మనీష్ గుప్తా పేరుతో ఉన్న కారునే వాడుతున్నారు. అదికూడా కేవలం 4 లక్షల విలువచేసే మారుతి XL6 కారు. 

రేఖా గుప్తా ఆస్తిపాస్తుల విషయానికి వస్తే స్థిరచరాస్తుల విలువు రూ.5.31 కోట్లు. ఆస్తులే కాదు అప్పులు కూడా బాగానే ఉన్నాయి. ఈమెకు రూ.1.20 కోట్ల అప్పులు ఉంటాయి. ఇన్ కమ్ ట్యాక్స్ కు సమర్పించిన వివరాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈమె ఆదాయం కేవలం రూ.6.92 లక్షలు 

స్థిరాస్తులు:

రూ. 5.31 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.

చరాస్తులు:

రూ. 1,48,000 నగదు.

రూ. 72.94 లక్షల బ్యాంకు డిపాజిట్లు.

వివిధ కంపెనీలలో వాటాలు.

రూ. 53 లక్షల విలువైన ఎల్ఐసీ పెట్టుబడులు.

ఆభరణాలు:

225 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువ రూ. 18 లక్షలు.

135 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువ రూ. 11 లక్షలు. (భర్త మనీష్ గుప్తాకు చెందినవి)

34
Rekha Gupta Husband Manish Gupta

రేఖా గుప్తా భర్త ఆదాయం :

ఇక రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా కొటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆండ్ బిజినెస్ లో ఏజన్సీ అసోసియేట్ గా పనిచేస్తున్నారు. అలాగే నికుంజ్ ఎంటర్ ప్రైజెన్ పేరిట వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇతడు కూడా బాగానే సంపాదిస్తున్నాడు. 

ఇన్ కమ్ ట్యాక్స్ కు సమర్పించిన సమాచారం ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇతడు రూ.97.33 లక్షలు సంపాదించాడు. అంటే మనీష్ గుప్తా ఏడాది ఆదాయం దాదాపు కోటి రూపాయలుఉందన్నమాట. రేఖా గుప్తా ఆదాయం కంటే ఇది చాలా ఎక్కువనే చెప్పాలి. 
 

44
Rekha Gupta Personal and Political Life

రేఖా గుప్తా వ్యక్తిగత, రాజకీయ జీవితం : 

రేఖా గుప్తా హర్యానాలోని జింద్ జిల్లాలో 1974 లో జన్మించారు. ఆ జిల్లాలోని నంద్ గడ్ గ్రామం ఆమె స్వస్థలం. ఆమె చిన్నపుడే తండ్రికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం రావడంతో కుటుంబంమొత్తం డిల్లీకి షిప్ట్ అయ్యారు. అక్కడే రేఖాగుప్తా విద్యాభ్యాసం సాగింది. 

డిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్ రామ్ కాలేజీలో బీకాం పూర్తిచేసారు రేఖా గుప్తా. ఇలా డిగ్రీ చదువుతున్న సమయంలోనే బిజెపి విద్యార్థి విభాగం ఏబివిపిలో చేరారు. ఇలా ఓవైపు బాగా చదువుతూనే మరోవైపు విద్యార్థి సమస్యలపై పోరాటం చేసేవారు. డిగ్రీ తర్వాత మేరఠ్ లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం పట్టా పొందారు. 

స్టూడెంట్ నుండి లాయర్ గా మారిన ఆమె స్టూడెంట్ యూనియన్ నుండి రాజకీయ నాయకురాలిగా మారారు. ఇలా 2007 లో రేఖా గుప్తా పితంపుర మున్సిపల్ కౌన్సిలర్ గా మొదటిసారి పోటీచేసి విజయం సాధించారు. దక్షిణ డిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా కూడా పనిచేసారు. ఇలా  అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతూ శాలిమార్ బాగ్ ఎమ్మెల్యే సీటును దక్కించుకున్నారు.

2015 లో మొదటిసారి శాలిమార్ బాగ్ నుండి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం రేఖా గుప్తా కు దక్కింది... కానీ ఆమె గెలవలేకపోయింది. తర్వాత 2020 లో కూడా బిజెపి నుండి అదే నియోజకవర్గంలో పోటీచేసారు.. అప్పుడు కూడా పరాభవం తప్పలేదు. చివరకు 2025 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు అనూహ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవే దక్కింది. 
 

click me!

Recommended Stories