భవిష్యత్తులో హైవేపై టోల్‌ప్లాజాలు బంద్: కేంద్రం యోచన

Published : Aug 24, 2022, 09:55 PM ISTUpdated : Aug 24, 2022, 09:58 PM IST

రానున్న రోజుల్లో జాతీయ రహదారులపై టోల్ ప్జాజాలను తొలగించాలని కేంద్రం యోచిస్తుంది. శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టనుంది.మరో వైపు వాహనాల నెంబర్ ప్లేట్ల ద్వారా కూడా టోల్ వసూలు చేసే విషయమై  యోచిస్తుంది.ఈ విధానాలపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు.

PREV
భవిష్యత్తులో హైవేపై టోల్‌ప్లాజాలు బంద్: కేంద్రం యోచన
Cartoon punch on Toll Plazas

రానున్న  రోజుల్లో టోల్ ప్లాజాలు  కనుమరుగు కానున్నాయి. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిపివేసి వాహన యజమానుల నుండి డబ్బులు వసూలు చేస్తారు. అయితే టోల్ రోడ్డులో ప్రయానం చేసే వాహనాల నెంబర్ ఆధారంగా ఆ వాహనం యజమాని బ్యాంకు ఖాతా నుండి నేరుగా టోల్ డబ్బులు వసూలు కానున్నాయి.  ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలనే రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయమై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు. అయితేఈ విషయమై  నిర్ణయం తీసుకోలేదన్నారు. కొత్త పద్దతి ద్వారా శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ ను అమల్లోకి తీసుకురానున్నామన్నారు. వాహనంలో ఏర్పాటు చేసిన జీపీఎస్ సిస్టమ్ ద్వారా వాహన యజమాని బ్యాంకు ఖాతా నుండి డబ్బులు  టోల్ ప్లాజా ఖాతాలో జమకానున్నాయి. 
 

click me!

Recommended Stories