Published : Mar 24, 2026, 04:21 PM ISTUpdated : Mar 24, 2026, 04:32 PM IST
ఐటీ క్యాపిటల్ బెంగళూరులో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయినా మధ్యతరగతి వాళ్లు కూడా సొంతిల్లు కొనేందుకు కొన్ని ఏరియాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మహానగరంలో తక్కువ ధరలో ఇళ్లు ఎక్కడ దొరుకుతాయో చూద్దాం.
బెంగళూరులోని ఐటీ హబ్ వైట్‌ఫీల్డ్ దగ్గరగా ఉండటంతో ఇక్కడి ప్రాంతాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే కొత్త గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు వేగంగా వస్తున్నాయి. ఇక్కడ చదరపు అడుగుకు రూ.4,000–రూ.6,500 ధరలో ఫ్లాట్లు దొరుకుతాయి. స్కూళ్లు, హాస్పిటల్స్, ఐటీ పార్కులకు కనెక్టివిటీ బాగుంది. ఇంటి అద్దెలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ ఇప్పుడే కొనే ప్రాపర్టీ విలువ భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.
25
సౌత్ బెంగళూరు (Electronic City Zone)
ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండటంతో రోజువారీ ప్రయాణం తగ్గుతుంది. మెట్రో రావడంతో కనెక్టివిటీ మెరుగుపడింది. ఎలక్ట్రానిక్ సిటీలో సగటున చదరపు అడుగుకు ₹5,850 ఉంది. బడ్జెట్ ఫ్యామిలీలకు ఇది సరైన ప్రాంతం. చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లకు మంచి అవకాశం. తక్కువ ధరలో కొత్త ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
35
నార్త్ బెంగళూరు (Airport Corridor)
ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉండటంతో ఇది ఇన్వెస్ట్‌మెంట్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. ఇక్కడ చదరపు అడుగుకు ₹4,000–₹6,000 ధరలో పెద్ద ప్రాజెక్టులు, టౌన్‌షిప్‌లు నిర్మిస్తున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఐటీ, ఏరోస్పేస్ పరిశ్రమల వల్ల డిమాండ్ పెరుగుతోంది.
ఇక్కడికి నేరుగా మెట్రో కనెక్టివిటీ ఉంది, కాబట్టి ప్రయాణం సులభం. చదరపు అడుగుకు ₹3,000–₹4,000 ధరతో చౌకైన ఫ్లాట్లు దొరుకుతాయి. తక్కువ ధరలో ఇల్లు దొరికే అరుదైన ఏరియా ఇది. విద్యార్థులు, ఫ్యామిలీల నుంచి అద్దెలకు మంచి డిమాండ్ ఉంది. మైసూర్ రోడ్ అభివృద్ధి చెందడంతో కొత్త అవకాశాలు వస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది.
55
కేవలం రూ.48 లక్షల్లోపే సొంతిల్లు...
కెంగేరి జోన్‌లో ₹48 లక్షల నుంచే ఫ్లాట్ కొనొచ్చు. మధ్యతరగతి వారికి EMI ఆప్షన్లు అనువుగా ఉంటాయి. ₹5,500–₹10,000 అద్దెతో కొత్తగా పెళ్లైన జంటలకు ఇది బెస్ట్. పెట్టుబడి పెడితే అద్దె ఆదాయం గ్యారెంటీ. లోన్ వడ్డీపై సబ్సిడీ కూడా అందుబాటులో ఉంది.