దీదీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్: బీజేపీకి నితీష్ షాక్

First Published Jun 10, 2019, 1:12 PM IST

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార పార్టీ  టీఎంసీ పార్టీ వ్యూహకర్తగా పనిచేయాలని  ప్రశాంత్ కిషోర్ సంతకం చేయడంపై  జేడీ(యూ) చీఫ్, బీహార్ ముఖమ్యమంత్రి నితీష్ కుమార్ అనుమతి ఇచ్చినట్టుగా ప్రచారం  సాగుతోంది.

ఆదివారం నాడు జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశం పాట్నాలో జరిగాయి.ఈ సమావేశం ప్రారంభానికి ఓ గంట ముందుగా ప్రశాంత్ కిషోర్‌తో నితీష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడికానప్పటికీ... మమత బెనర్జీతో ఒప్పందానికి ప్రశాంత్ కిషోర్‌కు నితీష్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
undefined
బెంగాల్ రాష్ట్ర సీఎంతో ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని నితీష్ కుమార్ శనివారం నాడు స్పష్టం చేశారు. ఆదివారం నాడు జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీష్ కుమార్ పక్కనే ప్రశాంత్ కిషోర్ కూర్చొన్నాడు.
undefined
ఇదిలా ఉంటే ఐ ప్యాక్‌తో కలిసి జేడీ(యూ) పనిచేయడం లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ప్రకటించారు. ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్‌తో ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేసిన సమయంలో ఎందుకు ఈ రకమైన ప్రశ్నలు లేవనెత్తలేదని ఆయన ప్రశ్నించారు.
undefined
బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ఏ మేరకు బలపడిందనే విషయాన్ని సర్వే ద్వారా తనకు తెలపాలని మమత బెనర్జీ ప్రశాంత్‌ కిషోర్‌ను కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో రెండు ఎంపీ స్థానాల నుండి 18 స్థానాలకు బీజేపీ పెరిగింది.
undefined
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేయనుందని జేడీ(యూ) ప్రకటించింది. బీహార్ రాష్ట్రంలోనే జేడీ(యూ) ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి.
undefined
ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్‌కు బెంగాల్‌లో దీదీకి పనిచేయడానికి నితీష్ అనుమతి ఇచ్చారని చెబుతున్నారు. మోడీ కేబినెట్‌లో రెండు కీలక పదవులను నితీష్ కోరుకొన్నాడు.
undefined
కానీ, ఒక్క పదవి ఇవ్వడానికే బీజేపీ మొగ్గు చూపింది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో నితీష్ పార్టీ చేరలేదు.బీహార్ రాష్ట్రంలో కూడ బీజేపీకి ఒక్క మంత్రి పదవిని మాత్రమే జేడీ(యూ) కట్టబెట్టింది.
undefined
2015లో బీహార్ లో మహాకూటమి విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో మోడీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ కీలకపాత్ర పోషించారు. గత ఏడాది ప్రశాంత్ కిషోర్ జేడీ(యూ)లో చేరారు.
undefined
click me!