కుర్రంలో ప్రయాణీకుల వాహనాలపై ఉగ్ర‌వాదుల‌ కాల్పులు.. 38 మంది మృతి

First Published | Nov 21, 2024, 6:09 PM IST

Kurram : కుర్రంలో ప్రయాణికుల వాహనాలపై ముష్కరులు జరిపిన కాల్పుల్లో 38 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మర‌ణాలు మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది. 
 

don't cross, police, Stop

Kurram open fire : పాకిస్తాన్ లో ఉగ్ర‌వాదులు మ‌రోసారి  మార‌ణ‌హోమం జ‌రిపారు. ప్ర‌యాణికుల‌తో కూడిన వాహ‌నం పై కాల్పులు జ‌ర‌ప‌డంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం అందుతున్న  రిపోర్టులు ప్ర‌కారం ఈ సంఖ్య మ‌రింత పెర‌గ‌నుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. వాయువ్య పాకిస్థాన్‌లోని కుర్రం గిరిజన జిల్లాలో గురువారం ప్రయాణికుల వాహనాలపై ముష్కరులు కాల్పులు జరపడంతో దాదాపు 38 మంది మరణించారు. మ‌రో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాడుతున్నారు. దీంతో మ‌ర‌ణాలు సంఖ్య పెర‌గ‌వ‌చ్చు. 

మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ ప్రధాన కార్యదర్శి నదీమ్ అస్లాం చౌదరి మాట్లాడుతూ.. పెషావర్-పరాచినార్ మధ్య ప్రయాణిస్తున్న రెండు ప్యాసింజర్ వాహనాల కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు దాడి జ‌రిపారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దాడిని ఆయ‌న పెద్ద విషాదంగా పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. 

Latest Videos


ఈ ప్రాంతం చాలా కాలంగా షియా, సున్నీ ముస్లింల మధ్య సెక్టారియన్ ఉద్రిక్తతలకు హాట్‌స్పాట్‌గా ఉంది. ప్రధానంగా దీర్ఘకాల భూవివాదం కార‌ణంగా ఇది ఉద్భవించింది. దాడి చేసిన వారిని ఇంకా గుర్తించలేదు. అలాగే, దాడికి బాధ్యులను ఏ సమూహం ప్రకటించలేదు. 

పెషావర్ నుండి పరాచినార్ వరకు కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న వారిలో అతని బంధువులు ఉన్నారని స్థానిక నివాసి జియారత్ హుస్సేన్ ధృవీకరించార‌ని రాయిటర్స్ నివేదిక‌లు పేర్కొన్నాయి. అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఈ దాడిని ఖండించారు. పౌరులను లక్ష్యంగా చేసుకున్న హింసను తీవ్రంగా ఖండించారు.

click me!