Drushyam 2 Movie Review : దృశ్యం 1 ను మించి ...

First Published | Nov 25, 2021, 2:28 AM IST

ఆరు సంవత్సరాల క్రితం మలయాళంలో సెన్సెషనల్ హిట్ సాధించిన సినిమా దృశ్యం. ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యి.. అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా సిక్వెల్‏ను మరోసారి మలయాళంలో తెరకెక్కించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించగా.. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసి   అమెజాన్ ప్రైమ్‏లో విడుదల చేశారు. 


ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన దృశ్యం 2 మీద ప్రైమ్ భారీ అంచనాలే పెట్టుకుంది. అందులోనూ రీసెంట్ గా జై భీమ్ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపుమీదున్న అమెజాన్ దాన్ని రాంబాబు క్రైమ్ డ్రామా కొనసాగిస్తుందనే నమ్మకంతో ఉంది. దృశ్యం తర్వాత ఈ సీక్వెల్ రావటానికి చాలా గ్యాప్ వచ్చినప్పటికీ ఆకట్టుకునే బలమైన కంటెంట్ ఇందులో ఉండటమే ఆ నమ్మకానికి కారణం. ఇప్పటికే మోహన్ లాల్ నటించిన మలయాళం వెర్షన్ కూడా ప్రైమ్ లో రిలీజై పెద్ద హిట్టైంది. దాంతో దృశ్యం 2 మీద మంచి ఎక్సపెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఎంతవరకూ ఈ సినిమా రీచ్ అయ్యింది. థియోటర్ లో రిలీజ్ అయ్యే సినిమాని ఓటీటిలో విడుదల చేసారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అందులో నిజమెంత..ఈ సీక్వెల్ లో కథేంటి వంటి విషయాలతో రివ్యూలో ముందుకెళదాం.

Drushyam 2

కథేంటి

దృశ్యం సినిమా ముగింపు నుంచి దృశ్యం 2 ప్రారంభమవుతుంది. హత్య కేసు నుంచి రాంబాబు(వెంకటేష్)తన ఫ్యామిలీతో సహా తెలివిగా బయిటపడి ఆరేళ్లు అయ్యింది. ఇప్పుడు అంతా హాయిగా ఉన్నారు. కుటుంబం కూడా ఆర్దికంగా సెటిలైంది. రాంబాబు కేబుల్ వ్యాపారం నుంచి థియోటర్ కట్టి బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్యన సినిమా తీయాలని ఆ పనులు మీద బిజీగా ఉంటున్నాడు. ఆ కుటుంబం ఆ హత్య తర్వాత జరిగిన పోలీస్ విచారణ నుంచి పూర్తిగా కోలుకున్నారా అంటే లేదనే చెప్పాలి. వర్షం వచ్చినప్పుడో,పోలీస్ సైరన్ వినపడినప్పుడే ఉలికిపడుతూనే ఉన్నారు. భార్య జ్యోతి(మీనా),కూతుళ్లు అంజు, అను (కృతిక, ఏస్తర్‌ అనిల్‌) భయంతో వణికిపోతున్నారు. ఊరు కూడా రాంబాబు ఆర్దికంగా బాగుపడతంతో అసూయ పెంచుకుంది. అతని కుటుంబం వెనుక రూమర్స్ జనం చెప్పుకుంటున్నారు. 

Latest Videos


Drushyam 2


ఇంకో వైపు పోలీసుల తమ డేగ కళ్లతో ఈ కుటుంబాన్ని పరిశీలిస్తున్నారు. ఏదో ఒక రోజు ఒక్క క్లూ అయినా దొరక్కపోతుందా అని ఆ ఇంటి చుట్టూ,మనుష్యుల చుట్టూ వ్యూహాలు పన్నారు. హత్యకు గురైన ఆ కుర్రాడి శవాన్ని కనిపెట్టాలనేదే పోలీస్ ల కోరిక. కానీ  ఆ కుటుంబ యజమాని అయిన రాంబాబు తక్కువవాడేం కాదు. ఎప్పటికప్పుడు ఏం జరగబోతుందో అని వేయి కళ్లతో కుటుంబాన్ని చూసుకుంటూ, పోలీస్ లను ఎదుర్కోవటానికి సకల సరంజామాతో సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వార్ పోలీస్ లకు, రాంబాబుకు మధ్య.  ఐజీ గౌతమ్‌ సాహూ(సంపత్‌ రాజ్‌) సీన్ లోకి వచ్చాడు. కేసుని రీఓపెన్ చేసాడు. అప్పుడేం జరిగింది? ఈ  దృశ్యం 2 లో కూడా కుటుంబమే గెలుస్తుందా. రాంబాబు మళ్లీ గెలిచాడా..పోలీస్ లు  పన్నిన పద్మవ్యూహం ఏమిటి...రాంబాబు ఎలా ఛేదించాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Drushyam 2

ఎనాలసిస్ ..

అప్పుడు ‘దృశ్యం’ రిలీజ్‌ అయ్యింది.  ‘దృశ్యం’ లో వెంకటేష్ తన కుటుంబాన్ని సినిమా నాలెడ్జ్ తో కూడిన తెలివితో కాపాడుకున్నాడు. అయితే హత్యకు గురైన కుర్రాడి శవం దొరకలేదు. డెడ్ బాడీ లేకపోతే కేసు ముందుకు నడవదు. నేరం నిరూపణ కాదు..శిక్ష పడలేదు. అలా ఆ కథ ముగిసింది అనుకుంటాం. కాని పోలీసులు నిజంగానే కేసు మూసేయరు. వాళ్లు ఆ కేసును పట్టుదలగా అలా  పట్టుకునే ఉంటారు. గత ఆరేళ్లుగా ఆ కేసును ఛేదించాలనే చూస్తుంటారు. వెంకటేష్ కుటుంబానికి శిక్ష పడేలా చేయడం వారి విధి. ఇప్పుడేం జరిగింది. ఈ సారైనా పోలీస్ లు గెలిచారా...ఆ కుర్రాడి శవాన్ని పట్టుకన్నారా అనే డౌట్స్ తీర్చటానికి అన్నట్లు ఈ కొత్త థ్రిల్లర్ మన ముందుకు వచ్చింది. ఈ సారి ఫ్యామిలీనే గెలిచింది కాదు..తన కుటుంబాన్ని రాంబాబు అనే సామాన్యుడు గెలిపించుకున్నాడు. సినిమా ఫస్ట్ పార్ట్ కు ఫెరఫెక్ట్ సీక్వెల్ ఇది. ఫస్ట్ ఫార్ట్ లో జరిగిన కథను కంటిన్యూ చేస్తూ సాగటమే ఈ సినిమాకు బ్యూటీ. 

Drushyam 2

అలాగే ఈ సినిమా కు మొదట సీన్ నుంచి కథకు సీడ్స్ వేసుకుంటూ వెళ్లిపోతాడు దర్శకుడు. ఓ ప్రక్కన  ప్రేక్షకుడుని  హుక్ చేయటానికి సీన్ వేస్తున్నట్లు కనపడుతూనే మరో ప్రక్క కీలకమైన సీడ్ లాంటి సీన్ ని ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. అక్కడనుంచి కుటుంబంలో సైక్లాజికల్ డ్రామాకు తెర లేపుతాడు. ఈ సారి రాంబాబు దొరికిపోయాడేమో అనే పరిస్దితి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత తెలివిగా పోలీస్ లనే ట్రాప్ చేసి ఎలా తప్పించుకున్నాడని చూపెడతాడు. 

Drushyam 2


రాంబాబుకి తెలియకుండా ఈ కేసును పోలీసులు రహస్యంగా ఎంక్వైరీ చేస్తుండగా.. కొన్ని ఆధారాలు పోలీసులకు చిక్కడం నుంచి కథ ఇంట్రస్టింగ్ గా మారుతుంది. ఈ కేసులో రాంబాబు విషయంలో పోలీసులు ఎలా డీల్ చేశారు.. అతడిని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్లాన్స్ చేశారనేవి ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటాయి. పోలీసులకు ధీటుగా రాంబాబు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేసే ప్లాన్స్ తోపాటు ప్రేక్షకులు కూడా ఏమాత్రం ఉహించని ట్విస్టులతో ఈ సినిమా ముగుస్తుంది. ఫస్టాఫ్ లో  ప్రీ ఇంట్రెవెల్ బ్లాక్ లో ఫస్ట్ ట్విస్ట్ వచ్చేదాకా కథ పెద్దగా జరిగినట్లు అనిపించదు. ఎప్పుడైతే ఫస్ట్ ట్విస్ట్ రివీల్ అయ్యిందో అక్కడ నుంచి ఆసక్తిగా చూడటం మొదలెడతాం. వాస్తవానికి ఈ కథకు సెకండాఫే బలం. అక్కడ నుంచే ప్రేక్షకుడుని గ్రిప్ లోకి తీసుకుంటుంది. పూర్తిగా అనుహ్యా మలుపులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూ.. చివరికి వావ్ అనిపించేలా ఈ మూవీని ముగించేశారు.  

Drushyam 2


ఎవరెలా చేసారంటే...

వెంకటేష్  ...రాంబాబు  పాత్రలో పూర్తిగా జీవించేశారని చెప్పుకోవాలి.  ఆ స్క్రీన్ ప్రెజెన్స్.. సటిల్ యాక్టింగ్.. కొలిచినట్లుగా ఇచ్చే హావభావాలు బాగా సెట్ అయ్యాయి. అలాగే ఐజీగా చేసిన సంపత్ కూడా ఫెరఫెక్ట్ గా నిజమైన పోలీస్ అధికారిగా సెట్ అయ్యారు. ఇక మీనా, ఎస్తేర్, కృతిక,నదియా, నరేష్, తణికెళ్ళ భరణి, పూర్ణ, షఫి, తమ పాత్రలకు తగ్గట్లుగా నటించారు. ఫోర్శినిక్ సర్జన్ గా చేసిన శశి ఉన్నది కాసేపు అయినా నాచురల్ గా చేసారు. అలాగే సరితగా చేసిన సుజా వరుని కూడా చాలా బాగా చేసింది.

Drushyam 2

 టెక్నికల్ గా చూస్తే..

రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలో మాత్రం ఒకే ఒక పాట ఉండటమే బాగుంది. ఇక ఈ సినిమా కంటెంట్ కు తగినట్లుగా సీన్స్ లో ఉత్కంఠని నింపుతూ బ్యాగ్రౌండ్ స్కోర్ డిజైన్ చేసారు. అదే ఈ సినిమాకు బలం. ఇక  సతీశ్‌ కురుప్‌ సినిమాటోగ్రఫీ చక్కగా బాగుంది. మళయాళి ఒరిజనల్ కూడా ఆయనే చేసారు. మార్తాండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ అక్కడక్కడా స్లో అయ్యినా టెంపో పడిపోకుండా పరుగెత్తించింది.  ఇక రైటర్ కమ్ డైరెక్టర్ జీతు జోసెఫ్  గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్రిల్లర్ల స్పెషలిస్ట్ గా ఈ కథని డిజైన్ చేసారు. ఏదో మొక్కుబడిగా సీక్వెల్ తీసేయకుండా ఎంతో కసరత్తు చేసి అతనీ స్క్రిప్టును తీర్చిదిద్దారు. స్క్రీన్ ప్లే ‘దృశ్యం-2’లో అది పెద్ద హైలైట్. 

drushyam 2

నచ్చినవి
స్టోరీ లైన్
సెకండాఫ్ స్క్రీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
క్లైమాక్స్

నచ్చనవి
స్లోగా నడవటం
మొదట అరగంటా పెద్దగా కిక్ ఇవ్వకపోవటం 
 

Drushyam 2


 ఫైనల్ థాట్

అప్పుడప్పుడూ సీక్వెల్స్ కూడా బాగా కుదురుతాయి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్-3/5

 ప్రేక్షకుడి ఎక్కడా కూడా నిరాశ కలగకుండా.. దృశ్యం సినిమాను మించిన అంచనాలు, ట్విస్టులను అందించాడు.

Drushyam 2

తెర వెనుక..ముందు

బ్యానర్‌: సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఆశీర్వాద్‌ సినిమాస్‌;
నటీనటులు: వెంకటేశ్‌, మీనా, కృతిక, ఏస్తర్‌ అనిల్‌, సంపత్‌ రాజ్‌, నదియా, నరేశ్‌, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్‌, షఫీ తదితరులు; 
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌;
 సినిమాటోగ్రఫీ: సతీష్‌ కురుప్; 
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేశ్‌; 
 నిర్మాత: డి.సురేశ్‌బాబు, ఆంటోనీ పెరంబవూర్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి;
 రచన, దర్శకత్వం: జీతూ జోసెఫ్‌;
రన్ టైమ్: 2hr 34 Mins.
 విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌
విడుదల తేదీ:  25,నవంబర్ 2021
 

click me!