రజనీకాంత్‌ 'పెద్దన్న' మూవీ రివ్యూ

First Published | Nov 4, 2021, 3:49 PM IST

పెద్దన్న ఎలా ఉంది..మళ్లీ రజనీ సినిమాలకు వెళ్లచ్చు అనే ధైర్యం ఇస్తుందా, అజిత్ కు వరస హిట్స్ ఇఛ్చిన దర్శకుడు శివ ఈ సినిమాని ఎలా రూపొందించారు..అసలు ఈ సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Peddanna


రజనీ వంటి మాస్ హీరోలు సినిమా చూసేందుకు వచ్చే రెగ్యులర్  ఆడియన్స్ కు కొన్ని  లెక్కలు వుంటాయి. సినిమా ఇలాగే ఉంటుందని అంచనాకు ముందే వచ్చే వస్తారు.సినిమా ఎలా వున్నా వాళ్ల సినిమాలు ఖచ్చితంగా చూడాలి అనుకుంటారు. అంతగా కాకపోతే సినిమా చూసేసి కావాలంటే అప్పుడు ట్రోల్ చేసుకోవాలి. అంతే తప్ప  మాగ్జిమం చూడకుండా వుండలేరు. అయితే రజనీ మీద ఈ ఒపీనియన్ ఇప్పుడిప్పుడే తగ్గిపోతోంది. అందుకు కారణం రజనీ సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటమే. ఈ తాజా చిత్రం పెద్దన్న ఎలా ఉంది..మళ్లీ రజనీ సినిమాలకు వెళ్లచ్చు అనే ధైర్యం ఇస్తుందా, అజిత్ కు వరస హిట్స్ ఇఛ్చిన దర్శకుడు శివ ఈ సినిమాని ఎలా రూపొందించారు..అసలు ఈ సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Peddanna

విశ్లేషణ

రజనీకాంత్ కు ఇన్ని సినిమాలు చేసేసాం..దాదాపు తాను చేయగలిగిన కథలు,పాయింట్ లు టచ్ చేసేసాం. ఇంకా ఏం చేస్తాం...అనిపిస్తుంది. ఏ కథ చెప్పినా అది తను గతంలో చేసిన సినిమాను గుర్తు చేస్తూ ఉండచ్చు. కొత్త జనరేషన్ ని నమ్ముకున్నా తనతో ప్లాఫ్ లు డిజాస్టర్స్ ఇస్తున్నారు. అభిమానులేమో ...అప్పట్లో రజనీ సినిమాలు భలే ఉండేవిరా అని అవే మెచ్చుకుంటూ ఉంటారు. ఏం చేయాలి..అలాంటి కథలే చేయాలా..ఈ డైరక్టర్ ఏదో చెల్లి సెంటిమెంట్ అంటున్నారు. మరీ ఇరవై ఏళ్ల క్రితం కథలా అనిపిస్తుందా అనుకుందామంటే...అబ్బే..సెంటిమెంట్ ఏ కాలంలో అయినా ఒకటే అని ఒప్పించేస్తున్నారే...అయినా ఆ డైరక్టర్ చేసిన సినిమాలు హిట్లే కానీ అవన్ని బాగా పాతబడ్డ కథలే కదా. అయినా ఈ మధ్యకాలంలో వచ్చే నా సినిమాల్లో యాక్షన్ పార్ట్ తగ్గిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇందులో అసలు కథే లేదు...యాక్షన్ ఎపిసోడ్స్ మధ్య అక్కడక్కడా కథలాంటి సీన్స్ అల్లారు. ఇదేదో కొత్తగా అనిపిస్తోంది. 
 


Peddanna


పెద్దన్న సినిమా కథ అనేక సినిమాల్లో సీన్స్ మిక్స్ చేసి వండి ఉండచ్చు. కానీ అతి తగ్గిస్తే ఆసక్తికరమైన థ్రిల్లర్ గా మార్చవచ్చు. ఫైట్స్ వరసగా వస్తే జనం ఆసక్తికరంగా చూస్తారు అని కథలో రాసుకున్న దర్శకుడు శివ, అదే విధంగా తను అనుకున్న కథకు కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆసక్తికరంగా తయారుచేస్తే ప్రేక్షకులు చూస్తారు అనే ఆలోచన ఎందుకు చేయలేదో? అనిపిస్తుంది.  కాస్త స్క్రీన్ ప్లే మార్చుకుని, కథనాన్ని ఆసక్తికరంగా నడిపితే సరిపోయేది. 
 

Peddanna


అయితే ఈ మధ్యకాలంలో రజనీ విలేజ్ సబ్జెక్టు చేయలేదు. దాంతో  భిన్నమైన ఆంబియన్స్ తో,ఇంట్రస్టింగ్ లోకేషన్లతో, పాటలు, డ్యాన్స్ లతో కొద్దిసేపు కొత్తగా అనిపించుకుంది. ఆ తర్వాత చెల్లి,అన్న మధ్య వచ్చే సీన్స్ అయితే కామెడీ కోసం రాసారా,సీరియస్ కోసం చేసారా అనే సందేహం పీకుతూంటుంది. అక్కడ మొదలైన విషయం లేని సీన్స్ క్లైమాక్స్ దాకా సాగుతూనే ఉంటాయి. విసిగిస్తూనే ఉంటాయి. 

Peddanna


టెక్నికల్ గా...

పాటలు బాగోలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ప్రడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేసారు. అయితే వాటిని పెట్టుకునే సీన్స్ లేవు.  దర్శకుడుగా శివ అన్ని రకాలుగా తీవ్రంగా నిరాశ పరిచాడు. సెంటిమెంట్ సినిమా అయినా మనం ఎక్కడా ఫీల్ కాము. ఎమోషన్స్ సరిగ్గా రిజిస్టర్ కావు. కెమెరా వర్క్ బాగుంది. తెలుగు డబ్బింగ్ ,డైలాగులు బాగా కుదరాయి. ఎడిటింగ్ ఓకే.

Peddanna


నటీనటుల్లో...రజనీకాంత్ నటుడుగా కొత్తగా ఏమీ చేయటానికి ఈ కథ అవకాశం ఇవ్వలేదు. కీర్తి సురేష్ మాత్రం చెల్లిగా బాగుంది కానీ, ఎమోషన్ సీన్స్ లో మరీ డ్రామా ఎక్కువగా అనిపించింది. నయనతార ఉన్న సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి కానీ ఫలితం లేదు. మీనా,ఖుష్బు ఉన్నా లేనట్లే. జగపతిబాబు, అభిమన్యు విలన్స్ గా ఏమీ పండించలేకపోయారు. జగపతిబాబు గెటప్ చాలా దారుణంగా ఉంది. ప్రకాష్ రాజ్ రొటీన్.

Peddanna

బాగున్నవి
రజనీలుక్
సాంకేతిక విలువలు
నిర్మాణ విలువలు

బాగోలేనివి
సినిమా బిగిన్,మిడిల్,ఎండ్,మధ్యలో వచ్చే సీన్స్

Peddanna


ఫైనల్ ధాట్
ఈ సినిమా పూర్తిగా చూసాక..ఇంకేం థాట్స్ వస్తాయి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:1.5

ఫస్టాఫ్ లో ఫోర్స్ కామెడీ అయితే చిరాకు తెప్పిస్తుంది. ఏదైమైనా ఈ సినిమా మెలోడ్రామాకే పెద్దన్న.

Peddanna


ఎవరెవరు..
సంస్థ‌: స‌న్ పిక్చ‌ర్స్‌, 
న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, కీర్తిసురేష్‌, న‌య‌న‌తార‌, మీనా, ఖుష్బూ, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్‌రాజ్ త‌దిత‌రులు;
 ఛాయాగ్ర‌హ‌ణం: వెట్రి, 
సంగీతం: ఇమ్మాన్,
 కూర్పు: రూబెన్, 
నిర్మాణం: క‌ళానిధి మార‌న్‌, 
ద‌ర్శ‌క‌త్వం: శివ; 
విడుద‌ల‌: డి.సురేష్‌బాబు, నారాయ‌ణ్‌దాస్ నారంగ్‌, దిల్‌రాజు; 
విడుద‌ల తేదీ: 4-11-2021

Latest Videos

click me!