బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘కిల్‌’రివ్యూ

First Published | Jul 16, 2024, 7:47 AM IST

 ‘కిల్‌’ని తెలుగులోకి తేవాలని చాలా మంది దర్శకులు,నిర్మాతలు ఉత్సాహపడుతున్నారు. హీరోలు సైతం రైట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Kill movie


ఒక సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని మిగతా భాషల్లో రీమేక్ చేస్తూంటారు. అలా తెలుగు నుంచి వేరే భాషల్లోకి, వేరే చోట నుంచి తెలుగులోకి వస్తూండటం చాలా కాలంగా జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా మన సౌతిండయన్ ఫిల్మ్ లు అంటే హిందీవాళ్లు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ డైరక్టర్స్ అక్కడ కథలు చెప్తూ సినిమాలు డైరక్ట్ చేస్తున్నారు. ఈ శుక్రవారం కూడా మన సౌతిండన్ చిత్రం ఆకాశం నీ హద్దురా ..అక్షయ్ కుమార్ హీరోగా  ‘సర్ఫిరా’ అంటూ రీమేక్ అయ్యింది. ఇప్పుడు హిందీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన ‘కిల్‌’ని తెలుగులోకి తేవాలని చాలా మంది దర్శకులు,నిర్మాతలు ఉత్సాహపడుతున్నారు. హీరోలు సైతం రైట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Kill movie


 లక్ష్‌ లాల్వానీ (Lakshya) హీరో  నిఖిల్‌ నగశ్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కిల్‌’.  తాన్యా మనక్తిలా (Tanya Maniktala) హీరోయిన్. రీసెంట్ గా  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్ కు పండగ చేసుకుంటున్నారు.  ఆ సీన్స్ కొత్తగా ఉన్నాయంటున్నారు.  ఈ నేఫధ్యంలో ఈ చిత్రం కథేంటి..సినిమాలో వర్కవుట్ అయిన ఎలిమెంట్స్ ఏమిటి..తెలుగులో నడుస్తుందా వంటి విషయాలు చూద్దాం.

Latest Videos


Kill movie


చిత్రం కథేంటంటే..

ఎన్‍ఎస్‍జీ కమాండోగా పని చేస్తున్న అమిత్ రాథోడ్ ( లక్ష్‌ లాల్వానీ) ఢిల్లీ నుంచి రాంచీకి ఒకే ట్రైన్‍లో బయలుదేరివస్తూంటాడు.  అమిత్‍తో పాటు తోటి కమాండో తన స్నేహితుడు వీరేశ్ (అభిషేక్ చౌహాన్) కూడా ఉంటాడు. రాత్రిపూట ప్రయాణం. అమిత్ ఆలోచనల నిండా ఒకటే. తను ప్రేమించిన అమ్మాయి కోటీశ్వరరాలు అయిన  తులికా (తాన్య మనక్తిలా)కు వేరే అబ్బాయితో ఎంగేజ్‍మెంట్ చేసేసారు. వాళ్లకు కమెండో గా పనిచేసే అమిత్ ఆనడు. దాంతో ఆమె తల్లితండ్రులు ఇలా వేరే కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేసేసారన్నమాట. అదే ట్రైన్ లో ఆమె తన ఫ్యామిలీతో ఉంది. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలనేది అమిత్ ఆలోచన. 
 

Kill movie


ఇదిలా ఉండగా...ఊహించని విధంగా ఆ ట్రైన్ పై బందిపోట్ల దాడి జరుగుతుంది. ఫణి (రాఘవ్ జుయల్), బేని (ఆశిష్ విద్యార్థి) లీడ్ చేస్తున్న ఓ  బందిపోట్ల ముఠా ఆ ట్రైన్ లోని ప్రయాణికులపై  దాడి చేస్తుంది. ప్రయాణికులను ఆ బందిపోట్లు దోచుకునేందుకు వస్తారు.  ఆ బందిపోట్లు కేవలం  దోచుకోవడమే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా  తీస్తుంటారు. బయిటకు కాల్స్ వెళ్లకుండా  జామర్లు పెట్టి ఎవరి ఫోన్లు పని చేయకుండా చేస్తారు. ఈ క్రమంలో ఆ ట్రైన్ లో ఉన్న ప్రయాణీకుల తో పాటు  తులికా కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. అప్పుడు అమిత్ రంగంలోకి దిగుతాడు. తన స్నేహితుడు వీరేశ్ సాయింతో కమెండో స్కిల్స్ తో ఆ బందిపోట్లపై సునామీలా విరుచుకుపడతాడు.  అప్పుడు ఏం జరిగింది. తులికా ఫ్యామిలీని, ప్రయాణీకులను రక్షించగలిగారా....అనేది మిగతా కథ.  

Kill movie


ఎలా ఉందంటే..

కిల్ చూస్తుంటే మనకు  The Raid (2011) గుర్తు వస్తుంది. రెండు సినిమాల్లోనూ సైన్యంగా విరుచుకుపడే గ్యాంగస్టర్స్, దొంగలతో కంటిన్యూ పోరాటమే సినిమా. కిల్ సినిమా ఎక్కువ శాతం ట్రైన్ లోనే జరుగుతుంది. లిమిటెడ్ లొకేషన్ సినిమాకు ఎడ్వాంటేజ్ గా మారింది. ఈ సినిమా కు రన్ టైమ్ బాగా తక్కువ ఉండటం కూడా కలిసొచ్చింది. దాదాపు 100 నిముషాల్లో సినిమా పూర్తైపోవటంతో ఆ ఫీల్ తోనే బయిటకు వచ్చేస్తాము. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్, డాన్స్ లు  కామెడీకు ప్లేస్ ఇవ్వకపోవటం కలిసొచ్చింది. టిపికల్ హాలీవుడ్ యాక్షన్ బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్న ఫీల్ తీసుకొచ్చారు. ప్రారంభంలో హీరోయిన్ తో కొద్దిగా రొమాన్స్ పెట్టారు. ఎందుకంటే సినిమాకు ఆ ఎమోషనే  కేటలిస్ట్ కాబట్టి. 

Kill movie


ఫస్టాఫ్ లో హీరో తన లవ్ స్టోరీ, ఎందుకు ట్రైన్ లో ప్రయాణం పెట్టుకున్నాడో , ప్రధాన పాత్రలు సెట్ చేస్తూనే మధ్యలో యాక్షన్ ని కలుపుకుంటూ వచ్చారు. అయితే సెకండాఫ్ లో వయిలెన్స్ విశ్వరూపం దాల్చింది. డైరక్టర్ నిఖిల్ నాగేశ్ భట్...చాలా స్పీడుగా యాక్షన్ సీన్స్ డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్లిపోయాడు. చూసేవాళ్లు ఊపిరి తీసుకునే గ్యాప్ లో ఏం జరిగిపోతుందా అన్నట్లుగా కొన్ని ఎపిసోడ్స్ తీర్చిదిద్దారు. ఈ సినిమా చూస్తుంటే మనకు Train to Busan (2016) కూడా గుర్తుకు వస్తుంది. జాంబీల ప్లేస్ లో బందిపోట్లును పెట్టారనిపిస్తుంది. 

kill movie


టెక్నికల్ గా ...

ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ టెక్నికల్ టీమ్. డైరక్టర్ గా నిఖిల్ నాగేశ్ భట్ ..హాలీవుడ్ చిత్రంలా దీన్ని తీర్చిదిద్దాలనుకుని అలా గే చేసుకుంటూ పోయారు. స్క్రిప్టు దశలోనే కథలో వేరే సబ్ ప్లాట్స్ వంటివి పెట్టుకోకుండా వేరే సీన్స్ కు తావు ఇవ్వకుండా చూసుకుున్నారు.  చిన్న పాటి ఎమోషన్  కూడా వర్కవుట్ అయ్యింది.  అలాగే ఈ సినిమాలో కష్టం అంతా యాక్షన్ కొరియోగ్రఫీ చేసినవారిదే. ట్రైన్ లో సినిమా నడపటం బోర్ కొట్టకుండా అనేది ఆషామాషీ కాదు. ఆ భాధ్య సినిమాటోగ్రఫర్ తీసుకున్నారు. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా  చేయటంతో గంటా 55 నిమిషాలతో ముగిసిపోతుంది. బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ప్లస్ అయ్యింది. నటీనుటుల్లో లీడ్ రోల్ చేసిన లక్ష్‌ లాల్వానీ అందరినీ డామినేట్ చేసాసారు యాక్షన్ సీక్వెన్స్ లలో .

kill movie


తెలుగు రీమేక్ లు 
    

ఇక   ‘కిల్‌’సూపర్ హిట్ అవటంతో  రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ‘కిల్‌’ రీమేక్‌ రైట్స్‌ కోసం తెలుగు నుంచి ప్రస్తుతం అనేకమంది పోటీ పడుతున్నారు. సుధీర్‌ బాబు (Sudheer Babu) లేదా కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వారికి రైట్స్ ఇస్తారో లేదో తెలియదు. తమిళ,తెలుగు, మళయాళం కలిసొచ్చేలా హీరోను ఎంచుకుని ఆ నిర్మాతలే రీమేక్ చేద్దామనుకుంటన్నట్లు తెలుస్తోంది. 

Photo Courtesy: Instagram


 వాస్తవానికి  తెలుగులో పూర్తి యాక్షన్‌ మూవీ అంటే వర్కవుట్‌ అవకాశాలు తక్కువ. దాంతో  ‘కిల్‌’ చిత్రంలో ఏం కలిపితే బాగుంటుంది అనే ఆలోచనలు చేస్తున్నారు.  కామెడీ,సాంగ్స్ వంటివి వర్కవుట్ కావు.   బాలీవుడ్‌ చిత్రంలో ఉన్న యాక్షన్‌ ఫ్లేవర్‌ ని అలాగే ఉంచి, ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న హీరోలలో ఎవరు చేస్తే  బాగుంటుందనేది చూడాలి.   ఓ రకంగా ఇది ప్రయోగాత్మక చిత్రమే. 
 

Kill movie

హాలీవుడ్ లోనూ

మరో ప్రక్కన ఇప్పటికే హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘జాన్‌ విక్‌’ను తెరకెక్కించిన దర్శకుడు ఛార్లెస్‌ ఎఫ్‌. స్టాహెల్స్కీ ఇంగ్లీష్‌ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. ‘జాన్‌ విక్‌’మూవీలో యాక్షన్‌ సీన్స్  ఏ రేంజిలో  ఉంటాయో యాక్షన్‌ లవర్స్ కు  బాగా తెలుసు. అలాంటి మూవీని తీసిన ఛార్లెస్‌ ఇందులోని స్టంట్స్‌కు ఫిదా అయ్యాడంటే అవి ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవాలంటున్నారు. 
 

Kill movie


ఫైనల్ థాట్

యాక్షన్ సీన్స్ ని ఇష్టపడేవారికి విపరీతంగా నచ్చే సినిమా ఇది. చిన్న పిల్లలు తో చూడటం కష్టం. ఫ్యామిలీతో కలిసి చూడకపోవటమే బెస్ట్. ఎందుకంటే సినిమాలో విపరీతమైన హింస ఉంది. దాన్ని తట్టుకోగలిగే వారే చూడాలి.

---Rating:3.5
 

Kill movie


బ్యానర్లు: ధర్మ ప్రొడక్షన్స్, శిఖ్యా ఎంటర్‌టైన్‍మెంట్, 
 నటీనటులు: లక్ష్య, తాన్య మానిక్తలా, రాఘవ్ జుయెల్, అద్రిజా సిన్హా, అభిషేక్ చౌహాన్, ఆషిశ్ విద్యార్థి తదితరులు
సంగీతం: విక్రమ్ మంతోర్సే, సశ్వంత్ సచ్‍దేవ్, హరూన్-గవిన్
నిర్మాతలు: కరణ్ జోహార్, గునీత్ మోంగా, అపూర్వ మెహతా, అచింత్ జైన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నిఖిల్ నగేశ్ భట్

click me!