విజయ్ #LEO రివ్యూ

First Published | Oct 19, 2023, 12:18 PM IST

 మరోసారి లోకేష్ కనగరాజ్‌తో విజయ్ జతకట్టడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా టైటిల్‌తోనే లోకేష్ ఆకట్టుకున్నారు. 

Leo

ఒక తమిళ దర్శకుడు సినిమా గురించి ఈ మధ్యకాలంలో తెలుగువారు ఇంతలా ఎదురుచూడటం ఇదే మొదటిసారేమో. నిజానికి విజయ్ సినిమా అనేదాని కన్నా లోకేష్ కనకరాజ్ సినిమా  అని చూడటానికి చాలా మంది ఉత్సాహం చూపించారనటంలో సందేహం లేదు.  విక్రమ్ తో బ్లాక్ బస్టర్ అందుకోవడం, అంతకముందు విజయ్ తో మాస్టర్ వంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించడం, ఆ రెండు చిత్రాలు  వరల్డ్ వైడ్ గా  ఆడియన్స్ ని కూడా విపరీతంగా అలరించడంతో లియో పై అంతటా అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. అయితే అదే సమయంలో ఈ చిత్రం ట్రైలర్ అంతగా క్లిక్ కాకపోవటం,  ‘A History of Violence’కు రీమేక్ అని ప్రచారం జరగటం మైనస్ గా మారింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది.. విక్రమ్ స్దాయి హిట్ కొట్టే చిత్రమేనా,అసలు కథేంటి, ఈ చిత్రం LCU లో భాగమేనా, రామ్ చరణ్ నిజంగా కనిపిస్తారా చివర్లో  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


స్టోరీ లైన్

పార్ధీపన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్ లో ఓ కాఫీ హౌస్ రన్ చేస్తూంటాడు. అతని భార్య (త్రిష) ,ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూంటాడు. అయితే ఆ ప్రశాంత జీవితం..అక్కడకి వచ్చిన ఓ సైకో బ్యాచ్, కొందరు క్రిమినల్స్ తో డిస్ట్రబ్ అవుతుంది. వాళ్లు అక్కడ కలెక్టర్ ని చంపేసి, లోకల్ గా మర్డర్స్ తో హల్ చల్ చేస్తూంటారు. ఆ క్రమంలో ఈ కాఫీ హౌస్ ని సైతం దోచుకుందామని వచ్చి, పార్దీపన్ కూతురు పై ఎటాక్ చేస్తారు.  అలాంటి తప్పనిసరి పరిస్దితుల్లో పార్ధీపన్ వాళ్లని ఆత్మ రక్షణ కోసం చంపేస్తాడు. అయితే ఓ ప్రొఫిషనల్ గా వాళ్లని తుపాకీతో కాల్చి చంపటం చాలా అనుమానాలకు దారి తీస్తుంది. పోలీస్ లు అరెస్ట్ చేస్తారు.  కానీ కోర్టు ఆత్మ రక్షణ కోసమే అని నమ్మి విడుదల చేస్తుంది. 

Latest Videos



హమ్మయ్య అనుకునేలోగా మరో సమస్య వచ్చి పడుతుంది. ఈ వార్త అన్ని న్యూస్ పేపర్స్ లోనూ అతని ఫొటో తో సైతం రావటం జరుగుతుంది. దాంతో రకరకాల రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది ఎలర్ట్ అవుతారు. అలాంటి వాళ్లలో ముఖ్యంగా డ్రగ్ బిజినెస్ హెడ్  ఆంటోని దాస్ (సంజయ్ దత్) ,మరొకరు హెరార్డ్ దాస్ (అర్జున్). వీళ్లు నరరూప రాక్షసులు టైప్. వీళ్లు తమ మనుష్యులను హిమాచల్ ప్రదేశ్ పంపుతారు. ఎందుకంటే వాళ్లంతా పార్దీపన్ లియో అని నమ్ముతూంటారు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఫైర్ ఎక్సిడెంట్ లో చనిపోయిన లియో..పార్దీపన్ ఒకడే అని ఒప్పుకోమంటారు. అసలు లియో ఎవరు..పార్ధీపన్ కు లియోకు ఉన్న లింక్  ఏమిటి...లియో అనకుని పార్ధీపన్ వెనక  గ్యాంగస్టర్స్ ఎందుకు పడుతున్నారు..అసలు నిజం ఏమిటి..చివరకు ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

Leo review Vijay starrer film experience Lokesh Kanagaraj surprises again


విశ్లేషణ
 డేవిడ్​ క్రోనెన్​ బర్గ్​ దర్శకత్వంలో 2005లో వచ్చిన  హాలీవుడ్ సినిమా 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్​'  కల్ట్ క్లాసిక్ గ్యాంగ్​స్టర్​ సినిమాగా నిలిచింది. ఆ సినిమాని ఆధారం చేసుకునే ఓ ట్రిబ్యూట్ లా ఈ సినిమా చేస్తున్నానన్నట్లు సినిమా మొదట్లోనే దర్శకుడు అఫీషియల్ గానే స్పష్టం చేసారు. కాబట్టి ఇంక దానిపై చర్చ అనవసరం.  'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్​'   చూసిన వారికి ఈ సినిమా  కథ గెస్ చేసేయగలగుతారు. అయితే కథ కోసమే అయితే ఈ సినిమా చూడనక్కర్లేదు. ఆ తెలిసిన స్టోరీని తనదైన స్క్రీన్ ప్లే తో ఎలా తెరకెక్కించాడు,అందుకు అనిరిధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజిలో సాయిం చేసింది.. అనే విషయం కోసం చూడాలి. ఫస్టాఫ్ అంతా హీరో కాఫీ హౌస్, అతని ఫ్యామిలి రిలేషన్, ఇంత మారుమూల ప్లేస్ కు వచ్చి ఉంటున్నా, ఐడిటెంటీ బయిటపడటం అనే విషయం చుట్టూ తిరుగుతుంది.

leo


 అయితే అసలు నిజంగానే పార్ధీపన్ లేక విలన్స్  లియో అని పొరపడుతున్నారా అనే డౌట్ మాత్రం బాగా సస్టైన్ చేసారు. సెకండాఫ్ లో అసలు లియో ఎవరు అనే ఆసక్తి కలుగుతుంది. అయితే అక్కడే సినిమా అనుకున్న స్దాయిలో పేలలేదు. ప్లాష్ బ్యాక్ అదిరిపోతుంది అనుకుంటే తేలిపోయింది. రొటీన్ కు భిన్నంగా వెళ్లాలనుకుని అలా చేసారేమో కానీ ఆ ఎలిమెంట్స్ ఏమీ ఈ కథలో అతకలేదు. సంజయ్ దత్ క్యారెక్టర్లు ఎంటర్ అయిన తరవాత సినిమా గాడి తప్పింది. క్లైమాక్స్ కూడా సాగదీతగా ఉందనిపించింది. సెకండాఫ్  కనుక ఫస్టాఫ్  స్దాయిలో ఉండి ఉంటే నెక్ట్స్ లెవిల్ అనిపించేది. 


ఇక LCU కనెక్షన్ విషయానికి వస్తే ...ఖైదీలో కానిస్టేబుల్  పాత్రను తీసుకొచ్చి నడిపించటం బాగుంది. అలాగే క్లైమాక్స్ లో కూడా తన LCU లోంచి చిన్న లింక్ ని తీసుకొచ్చి ముగించారు. అది సర్పైజ్ ..రివీల్ చేయటం నాకు ఇష్టం లేదు. ఒకటి మాత్రం చెప్పచ్చు..అది  'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్​'  నుంచి తీసుకున్నా 100% లోకేష్ కనకరాజ్ మూవీ అన్న స్దాయిలో డిజైన్ చేసారు. సినిమా రైటింగ్ విషయానికి వస్తే జానర్ నుంచి ప్రక్కకు వెళ్లకుండా తీయటం బాగుందనిపిస్తుంది. విజయ్ ఉన్నాడు కదా అని ఐటెం సాంగ్ లు, పంచ్ డైలాగులు, కామెడీలు చేయలేదు. అది నచ్చుతుంది. అంతెందుకు భారీ ఇంట్రడక్షన్ సీన్ కూడా పెట్టలేదు. ఏదో హాలీవుడ్ చిత్రం చూస్తున్న ఫీల్ తెచ్చారు. అర్జున్ ,సంజయ్ దత్ వంటి వారిని సరిగ్గా వాడి ఉండి..వారితో ఉండే కాంప్లిక్ట్స్ సరైనది అయ్యి ఉండాల్సింది. 


టెక్నికల్ గా..

మొదటి నుంచి లోకేష్ కనకరాజ్ సినిమాలు టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంటూ వస్తున్నాయి. ఇక్కడా అదే జరిగింది. మనోజ్ పరమ హంస సినిమాటోగ్రఫీ విజువల్స్ వెస్ట్రన్ మూవీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. మంచి విజువల్స్ ఎక్సపీరియన్స్ ఇచ్చారు. అనిరిధ్ గురించి అయితే ప్రత్యంకంగా మెన్షన్ చేయనక్కర్లేదు. జైలర్ ని మించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అయితే పాటలు మాత్రం నిరాశపరుస్తాయి. ఇక ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో అంశం స్టంట్ సీక్వెన్స్ లు డిజాన్ చేయటం. అవి రియలిస్టిక్ టచ్ తో ఉన్నాయి. హైనా సీక్వెన్స్ అయితే చాలా బాగా చేసారు. ఎడిటింగ్ సెకండాఫ్ లో ఇంకాస్త షార్ప్ చేస్తే బాగుండేది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మామూలుగా లేవు. 

Leo movie issue


నటీనటుల్లో ...

  తన కూతురుని చంపేస్తారేమో అని  భయంతో ఒణికిపోవటం, తాను లియోని కాదు అనే చెప్పే సీన్స్ లో కానీ ,ప్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో కానీ విజయ్ మనకు కొత్తగా కనిపిస్తాడు. ఫైనల్ ఫైట్ లో తనెవరో చెప్పేటప్పుడు కూడా  ఓ రేంజిలో ఉంటుంది.  అంటోని దాస్ గా జంజయ్ దత్ , హెరాల్డ్ దాస్ అర్జున్ ఇద్దరూ ఫిజికల్ అప్రీయన్స్ బాగున్నారు కానీ కథకు కావాల్సినంత కాంప్లిక్ట్స్ ఇవ్వలేకపోయారు. వాళ్ల విలనిజం,అందుకు కారణాలు సినిమాకు సరిపోలేదనిపించింది.  ముఖ్యంగా అర్జున్, విజయ్ మధ్య సీన్స్ ఎక్సపెక్ట్ చేస్తే మాత్రం నిరాశే. త్రిష..హీరో ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమెగా,అసలకు తన భర్త ఎవరు అనే విషయం ఎంక్వైరీ చేసే ఆమెగా ఫెరఫెక్ట్.  అంతకు మించి ఆమెకు సీన్స్ లేవు. పార్దీ కొడుకు సిద్దార్ద్ గా మేధ్యూ ధామస్ కూడా మంచి డెబ్యూ. గౌతమ్ మీనన్ జస్ట్ ఓకే . మన్సూరీ అలీ ఖాన్..మనకు కార్తీ ఖైదీ గుర్తు చేస్తాడు. ప్రియా ఆనంద్ పాత్ర చెప్పుకోవటానికి ఏమీ లేదుఖైదీ ఫేమ్ George Maryan ఈ సినిమాలోనూ అదే కానిస్టేబుల్ పాత్ర అదరకొట్టారు. . 
 

Vijay starrer Leo


హైలెట్స్ 
మొదటి  45 నిముషాలు
ఇంట్రవెల్  
విజయ్ 
అనిరిధ్  BGM

మైనస్ లు 

సెకండాఫ్ ముఖ్యంగా ప్లాష్ బ్యాక్ 
మూడు గంటలకు సరపడ కథలేకపోవటం
#LCU కనెక్షన్స్ ఫోర్స్ గా అనిపించటం

Thalapathy Vijay film Leo

ఫైనల్ థాట్

కథ పరంగా చూస్తే   'లియో' ఓ మామూలు రొటీన్ రొట్టదే. చాలా సార్లు చూసిందే.  కానీ మేకింగ్ పరంగా, టెక్నికల్ గా నెక్ట్స్ లెవిల్. కథ కోసం కాకుండా సినిమాటెక్ ఎక్సపీరియన్స్ కోసం అయితే ఈ సినిమా చూడవచ్చు. 
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.75

బ్యానర్: 7 స్క్రీన్ స్టూడియో
నటీనటులు: విజయ్, త్రిష కృష్ణన్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డీవోపీ: మనోజ్ పరమహంస
యాక్షన్: అన్బరివ్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
ఆర్ట్: ఎన్. సతీష్ కుమార్
కొరియోగ్రఫీ: దినేష్
డైలాగ్ రైటర్స్: లోకేష్ కనగరాజ్, రత్న కుమార్ & దీరజ్ వైద్య
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్.
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
సహ నిర్మాత: జగదీష్ పళనిసామి
నిర్మాత: ఎస్ ఎస్ లలిత్ కుమార్
విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023

click me!