
దేశంలో పరువు హత్య కేసులు ఎక్కడో ఒక్కచోట నమోదు అవుతూనే ఉన్నాయి. కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించదంటే చాలు కన్నకూతురిని కూడా చంపడానికి వెనుకాడటం లేదు. ఈ విషయాలపై భారీగా డిస్కషన్ జరుగుతోంది. మార్పు ఏ మేరకు వస్తోందో..పరిష్కారం ఏమిటి అనేది తేలకపోయినా కొంతలో కొంత మార్పు అయితే చర్చ ల ద్వారా వచ్చే అవకాసం ఉంది. సినిమా అనేది బలమైన మాధ్యమం కాబట్టి దాని ద్వారా చర్చ జరగటం మంచిదే. అలాంటి కోణంలోంచి ఆవిష్కరించబడ్డ సినిమానే ‘శ్రీదేవి సోడా సెంటర్’. పైకి రొటీన్ కమర్షియల్ సినిమాగా అనిపించినా..అంతర్గతంగా ఈ విషయంపై ఫోకస్ చేసారు. ఇంతకీ ఈ సినిమా కథేంటి..డైరక్టర్ చెప్పదలుచుకున్నదేమిటి...సామాన్య ప్రేక్షకుడుకు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
అమలాపురంలో లైటింగ్ సూరిబాబు(సుధీర్ బాబు)అంటే ఫేమస్. పేరున్న ఎలక్ట్రీషియన్. ఆ ఊళ్లో సోడాల శ్రీదేవి (ఆనంది) అనే అందగత్తె. జాతరలో ఆమెను చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి వెనకే పడిపోతాడు. ఆ అమ్మాయి కూడా ఈ కుర్రాడి కష్టం చూసి సరే అనేస్తుంది. ఇద్దరు ఎడాపెడా ప్రేమించేసుకుని..పెళ్లి చేసేసుకుందామనుకుంటారు. ప్రేమకు అంటే ప్లాబ్లం లేదు కాని పెళ్లంటే బోలెడు లెక్కలు కదా. శ్రీదేవి తండ్రి(నరేష్) నో చెప్పేస్తాడు. ఎందుకు అంటే కుర్రాడు మన కలుపోడు కాదు అనే కారణం చెప్తాడు. అదే సమయంలో సూరిబాబు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళతాడు సూరిబాబు. అతన్ను ఎవరు ఇరికించారు. చివరకు ఆ ప్రేమ కథ ఏ తీరం చేసింది.. శ్రీదేవి, సూరిబాబు ఒక్కటయ్యారా లేదా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ..
క్లైమాక్స్ ట్విస్ట్..రెస్టాఫ్
కొన్ని సినిమాలు క్లైమాక్స్ ని నమ్ముకుని తెరకెక్కుతూంటాయి. అది కానీ పేలిందా..జనాలకు ఎక్కిందా...సినిమా నిలబడిపోతుంది. ఈ మధ్యకాలంలో ఉప్పెన చిత్రం అలాంటి ఊహించని మలుపుతో తెరకెక్కి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ నే నమ్ముకుంది. మిగతా కథ అంతా మనం కామన్ ప్రేక్షకుడు కూడా కమాన్ అంటూ ఊహించేయగలుగుతాడు.ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం ఫక్తు కమర్షియల్ సినిమాలా నడుస్తుంది. ఇంటర్వెల్ దగ్గర నుంచే నేరేషన్ లో మార్పు మొదవుతుంది. క్లైమాక్స్ కు వచ్చేసరికి అది పీక్స్ కు వెళ్తుంది.
చాలా డార్క్ గా క్లైమాక్స్ ని డిజైన్ చేసారు. అది కనుక జనాలకు పట్టి, చర్చనీయాంశంగా మారితే సినిమాకు మామూలుగా ప్లస్ కాదు. అలా కాకపోతే సోసో సినిమా అనిపించుకుంటుంది. ఇక ఇలాంటి సినిమాలకు బాగా ప్లస్ కావాల్సిన ప్రేమ కథ, జంట మధ్యన ఉండాల్సిన కెమిస్ట్రీ కాస్త తక్కువనే చెప్పాలి. దాంతో క్లైమాక్స్ ఇంపాక్ట్ తక్కువగా అనిపించింది. అలాగే పరువు హత్యలు అనే పాయింట్ చుట్టూ కథ అయ్యినప్పుడు ఫస్టాఫ్ లో అందుకు సంభందించిన హింట్ ఇస్తే బాగుండేది. సమాజంలో చర్చించాల్సిన విషయమే కాని కథ,కథనం ఇంకాస్త కొత్తగా చెప్తే బాగుండేది అనిపించింది.
ముఖ్యంగా ఇంటెన్స్ డ్రామా అల్లు కోవాల్సింది. కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూర్చుకుంటూ రావటం కూడా ఈ కథకు అడ్డుగా మారింది. స్క్రీన్ ప్లే పరంగా చూస్తే.. అటు కమర్షియల్ సినిమాగానూ, ఇటు వాస్తవ ధోరణిలో నడిచే చిత్రంగానూ సమాంతరంగా అడుగులు వేస్తూ చివరకు ఎటు వైపు నిలబడలేక తడబడింది. దాంతో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఫోర్సెడ్ గా మారిపోయాయి. పలాస 1978 కు వెళ్లిన ధోరణిలోనే ఈ సినిమాని వాస్తవిక థోరణిలో మొత్తం తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.
ఇక హీరో,హీరోయిన్స్ లవ్ స్టోరీ ఒక వైపు, మరో ప్రక్క కులం గొడవలు సరిగ్గా బాలన్స్ చేయలేకపోయారు.రెండు వేర్వేరు థ్రెడ్ లాగ విడిపోయాయి. అలాగే సినిమా ప్రారంభంలో హీరో జైలుకు రావడం.. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వటం...హీరోయిన్ తో లవ్ ఎపిసోడ్..ఆ తర్వాత కులం మ్యాటర్ వరసగా వచ్చేయటం, ఇలాంటివి చాలా సినిమాల్లో చూసేయటం తో ఇంతకు ముందు చూసిన సినిమా చూసినట్లు అనిపిస్తుంది. లాస్ట్ లో మాత్రం కులం కోసం ఎంత దూరమైనా వెళ్లే తల్లిదండ్రులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు.. అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అదీ మనకు ప్రకాష్ రాజ్, సాయిపల్లవి చేసిన ‘Oor Iravu’ ని గుర్తుకు తెస్తుంది.
ప్లస్ లు, మైనస్ లు
హైలెట్స్ విషయానికి వస్తే...సుధీర్ బాబు, ఆనంది పెర్ఫార్మెన్స్, సాంగ్స్, ఫైట్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ అని చెప్పాలి, మైనస్ పాయింట్స్ లలో రొటీన్ అనిపించే స్టొరీ లైన్, రన్ టైం ఎక్కువ, సెకెండ్ ఆఫ్ స్లో అవ్వటం మేజర్ డ్రా బ్యాక్స్
దర్శకత్వం,మిగతా విభాగాలు
డైరెక్షన్ విషయానికి వస్తే తన తొలి సినిమా పలాస మాదిరిగానే మరోసారి క్యాస్ట్ ని ఇంటర్ లింక్ చేస్తూ కథ రాసుకున్నారు. ఇందుకు విలేజ్ లవ్ స్టొరీ నేపధ్యం తీసుకున్నారు.మూసలో కొట్టుకుపోకండా తన ముద్ర వేయగలిగిన ఇలాంటి కథని డైరక్టర్ చెప్పాలనుకోవటం అభినందించాల్సిన విషయం. అయితే ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేక ఎంగేజింగ్ గా అనిపించలేదు. క్లైమాక్స్ ట్విస్ట్ ని బేస్ చేసుకుని సినిమా కథ అంతా అల్లారని అర్దమవుతుంది. కాకపోతే కేవలం క్లైమాక్స్ మాత్రమే జనం చూసి ఎంజాయ్ చేయలేరు కదా..మొత్తం సినిమా చూడాలి కదా. ఫస్టాఫ్ లో అలాంటి మెరుపులు ప్రదర్శించాల్సింది. అలా చేయకపోవటంతో కొత్తదనం ఏమి లేకుండా రొటీన్ గానే అనిపిస్తూ సాగినట్లు అనిపించింది. ఇక క్లైమాక్స్ డార్క్ ట్విస్ట్ ఏ మేరకు తెలుగు ప్రేక్షకులకు పడుతుందో వెయిట్ చేయాలి. ఇక జబర్దస్త్ రాఘవ, సప్తగిరిలతో చేసిన కామెడీ సీన్స్ కూడా ఫోర్సెడ్ గానే ఉన్నాయి. కామెడి అక్కడితో ఆపేయటం బాగుందనిపించింది.
సుధీర్ బాబు విషయానికి వస్తే అతను ప్రత్యేకంగా నటుడుగా ప్రూవ్ చేసుకున్న సినిమాలు అతి తక్కువ. దాంతో కథ,కథనం బాగుంటేనే ఆడుతున్నాయి. వరస పెట్టి సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు సరైన కథ పడినప్పుడే హిట్ వస్తోంది. అయితే ఈ సారి అతను బాగా చేసారనిపించుకున్నారు. సీనియర్ నటుడు నరేష్ నరేష్ క్యారక్టరైజైషన్ టిపికల్ గా బాగా డిజైన్ చేసారు. నరేష్ కూడా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసారు.విలన్ గా చేసిన పావల్ నవగీతమ్, హీరోయిన్ ఆనంది గుర్తుండిపోతారు.
దేశంలో పరువు హత్య కేసులు ఎక్కడో ఒక్కచోట నమోదు అవుతూనే ఉన్నాయి. కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించదంటే చాలు కన్నకూతురిని కూడా చంపడానికి వెనుకాడటం లేదు. ఈ విషయాలపై భారీగా డిస్కషన్ జరుగుతోంది. మార్పు ఏ మేరకు వస్తోందో..పరిష్కారం ఏమిటి అనేది తేలకపోయినా కొంతలో కొంత మార్పు అయితే చర్చ ల ద్వారా వచ్చే అవకాసం ఉంది. సినిమా అనేది బలమైన మాధ్యమం కాబట్టి దాని ద్వారా చర్చ జరగటం మంచిదే. అలాంటి కోణంలోంచి ఆవిష్కరించబడ్డ సినిమానే ‘శ్రీదేవి సోడా సెంటర్’. పైకి రొటీన్ కమర్షియల్ సినిమాగా అనిపించినా..అంతర్గతంగా ఈ విషయంపై ఫోకస్ చేసారు. ఇంతకీ ఈ సినిమా కథేంటి..డైరక్టర్ చెప్పదలుచుకున్నదేమిటి...సామాన్య ప్రేక్షకుడుకు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
టెక్నికల్ గా ..
చిత్రం టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. సినిమాటోగ్రఫీ ..బాగుంది. ముఖ్యంగా రూరల్ ఎలిమెంట్స్ ని బాగా పట్టుకుంది. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగా రిజిస్ట్రర్ అయ్యింది. బాగుంది. మణిశర్మ సంగీతం లో పాటలు కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా చెయ్యాల్సింది. బాగా లెంగ్తీగా ఉంది. అలాగే కొన్ని చోట్లు స్పీడుగా మరికొన్ని చోట్ల స్లోపేస్ లో ఉంది. అంతటా ఒకేలా లేదు.
ఇక చిత్రంలో వచ్చే చాలా డైలాగులు బాగున్నాయి.“ పెద్ద మనిషి అంటే ముద్ద పెట్టేవాడు అయ్యిండాలి, ముద్ద లాక్కునేవాడు కాదు“ , “ జైలుకొచ్చిన మనిషి , జైలు నుంచి వెళ్లే మనిషి ఎప్పటికీ ఒకటి కాదు “ , “ మంచోడే..కానీ మనోడు కాదు” వంటివాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫైనల్ థాట్
అసురన్, కర్ణన్ స్దాయి కథలు,స్క్రీన్ ప్లేలు మన తెలుగు స్క్రీన్ కు అవసరమే కాకపోతే అదే స్దాయిలో ఉండాలి
Rating:2.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు..
నిర్మాణ సంస్థ: 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్
నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది, పవెల్ నవగీతన్, నరేశ్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేశ్, హర్షవర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రొహిణి, స్నేహ గుప్త, తదితరులు;
సంగీతం: మణిశర్మ
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్;
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్ సైనుద్దీన్
కథ: నాగేంద్ర కాషా;
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
విడుదల తేదీ: 27 ఆగస్టు 2021