
ఓటీటిల పుణ్యమా అని మలయాళ హీరో టోవినో థామస్ ఇక్కడ వారికి బాగానే పరిచయం అయ్యారు. ఆయన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM”. ఈ సినిమా ఈ రోజు రిలీజైంది. టోవినో థామస్ కెరీర్ లో 50 వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో మన తెలుగులో బాగా పాపులర్ అయిన కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా చేయటంతో ఇక్కడ బాగానే బజ్ క్రియేట్ అయ్యింది.
అలాగే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేస్తున్న “ARM” ఎలా ఉంది?
బిగ్ బాస్ తెలుగు 8ః నిఖిల్ పై సోనియా ఫైర్, అసలు చిట్టా బట్టబయలు
రేడియో మెకానిక్ అజయన్ (టోవినో థామస్ ) పాపం గతం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. అతని తాత మణియన్ (టోవినో థామస్ ) దొంగ కావడంతో అజయన్ ను ఎవరూ గౌరవించరు. అంతేకాకుండా ఇప్పటికీ అతన్ని దొంగగా చూస్తూంటారు. అలాగే పోలీస్ లు కూడా ఎక్కడేం పోయినా, ఏ దొంగతనం జరిగినా అజయ్ ని వచ్చి అరెస్ట్ చేస్తూంటారు. స్టువర్టపురం దొంగ టైప్ అన్నమాట.
అయితే అతనితల్లి (రోహిణి)కి మాత్రం తన కొడుకుని అందరూ గౌరవంగా చూడాలని అనుకుంటుంది. ఇలా వీరి జీవితాలు నడుస్తుంటే ... రాజవంశస్థుడు సుదేవ్ వర్మ (హరీష్ ఉత్తమన్) ఆ ఊరికి వస్తాడు.
సుదేవ్ వర్మ (హరీష్ ఉత్తమన్) ఏడాదికి ఒకసారి జరిగే ఆ ఊరి ఉత్సవాలను డాక్యుమెంటరీగా చేయడానికి వచ్చానని చెప్తాడు. కానీ అతను వేరే ఆలోచనతో ఆ ఊరికి వస్తాడు. అతనికి కావాల్సింది శ్రీభూతి దీపం (అమ్మవారి విగ్రహం) .
ఇక ఆ శ్రీభూతి దీపం (అమ్మవారి విగ్రహం) ని 1900ల కాలంలో కేరళలోని హరిపురం అనే ప్రాంతంలో తన రాజ్యాన్ని కాపాడిన కేలు (టోవినో థామస్ ) ధైర్య సాహసాలను మెచ్చి ఎడక్కల్ మహారాజు బహుమతిగా ఇస్తాడు. అది అజయన్ ఊరిలో పెట్టి దానికే ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ పడుతుంది.
ఆ ఉత్సవాల ముందు అమ్మవారి విగ్రహం ఎవరో దొంగిలిస్తారు. దాంతో యాజ్ యూజవల్ గా ఆ దొంగతనం అజయ్ మీదకు తోసివేసే ప్రయత్నం జరుగుతుంది. ఊరు కూడా నమ్ముతుంది. అయితే అప్పుడు అజయ్ ఏం చేశాడు? విగ్రహం ఎవరు ఎత్తుకెళ్లారు? అలాగే లక్ష్మి(కృతి శెట్టి)తో అజయ్ ప్రేమకథ ఏమైంది? కథలో సురేష్(బాసిల్ జోసెఫ్) క్యారక్టర్ ఏమిటీ అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
స్టోరీ లైన్ గా బాగున్న ఈ సినిమా ట్రీట్మెంట్ పరంగా దెబ్బతింది. కొన్ని పాపులర్ అయిన జానపద కథలను సోషల్ హైయ్యరార్కితో కలిపి చెప్పే ప్రయత్నం చేసారు. అయితే దాన్ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో చెప్పే సమయంలో కథ కు ఓ లక్ష్యం అంటూ లేకుండా పోయింది. కేరళలో ఉన్న కులాల ఈక్వేషన్స్ ని ఈ సినిమా ఎత్తి చూపే ప్రయత్నం చేసింది.
అయితే ఆ క్రమంలో కమర్షియల్ ఎలిమెంట్స్ డామినేట్ చేయటంతో సినిమా దెబ్బతింది. అలాగే సినిమా చాలా ప్రెడిక్టబుల్ గా సాగుతుంది. స్క్రీన్ ప్లే లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. కృతి శెట్టి పాత్ర ఇంకాస్త డవలప్ చేయాల్సి ఉంది. ఆమె కథలో మధ్య మధ్య లో వచ్చే రిలీఫ్ లా ఓ రకంగా ఫిల్లర్ గా తయారైంది. ఇంకాసిని ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే సినిమా అర్దవంతంగా ఉండేది.
టెక్నికల్ గా చూస్తే
సినిమా తెలుగు డబ్బింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అయితే సినిమాలో కనపడే సైన్ బోర్డ్ లు వంటివి తెలుగు ట్రాన్సలేషన్ ఫైనల్ చేసేముందు చూసుకోవాల్సింది. ఓటిటి కోసం డబ్బింగ్ చేసిన సినిమాలా ఉంది కాని రిలీజ్ కోసం చేసినట్లు అనిపించదు. ఆ శ్రద్ద కనిపించదు.ఇక దర్శకుడుగా జితిన్ లాల్ కమాండ్ తోనే చేసారు కానీ కథ,స్క్రీన్ ప్లే కలిసి రాలేదు.
కొన్ని విజువల్స్ స్ట్రైకింగ్ గా ఉన్నాయి. పాటలు జస్ట్ ఓఖే. ఎడిటింగ్ కాస్త ల్యాగ్ లు తగ్గిస్తే బాగుండేది. టివోనో థామస్ నటుడుగా మరో మెట్టు ఎక్కారు ఈ సినిమాతో. కృతి శెట్టి కు ఈ సినిమా వల్ల పెద్దగా కలిసొచ్చేదేమీ లేదనే చెప్పాలి.
ఫైనల్ థాట్
ఈ పీరియడ్ యాక్షన్ ఎడ్వెంచర్ డ్రామాని టివోనో థామస్ కోసం ఓ లుక్కేయచ్చు. ఎక్కువ ఎక్సపెక్ట్ చేస్తే ఎక్కువ నిరాశపడతారు
Rating:2.5