Sigma Movie Review: సిగ్మా మూవీ రివ్యూ.. విజమ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే

Published : Oct 02, 2026, 03:32 PM IST

విజయ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమా `సిగ్మా`. సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా నిరూపించుకున్నాడా?

PREV
16
సిగ్మా మూవీ రివ్యూ

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా మారి రూపొందిన చిత్రం `సిగ్మా`. ఇందులో సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. సంపత్‌రాజ్‌, రాజు సుందరం మాస్టర్‌ కీలక పాత్రలు పోషించారు. లైకా సంస్థ పతాకంపై సుభాస్కరణ్‌ నిర్మించారు. విజయ్‌ కొడుకు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో దీనిపై ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(అక్టోబర్‌ 2)న విడుదలైంది. మరి జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా హిట్‌ కొట్టాడా? సందీప్‌కి ఇప్పుడైనా హిట్‌ పడిందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
సిగ్మా మూవీ కథ

గురు(సందీప్‌ కిషన్‌) తన అమ్మ జ్ఞాపకాలతో కూడిన లైబ్రరీని నిర్వహిస్తుంటాడు. తను బాగా అప్పల్లో ఉంటాడు. అప్పుల వాళ్లు బెదిరిస్తుంటారు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. మరోవైపు వీరయ్య రెడ్డి(సంపత్‌ రాజ్‌), విన్సెంట్‌తో కలిసి మాఫియాని, క్యాసినోని నిర్వహిస్తుంటారు. దీని వెనుక భారీగా మాదక ద్రవ్యాల వ్యాపారం నడుస్తుంటుంది. ఇద్దరు బాగా సంపాదిస్తారు. వెయ్యి కోట్లు ఒక కంటెయినర్‌ లో ఉంటాయి. దాని కీ, బెన్‌ డ్రైవ్‌ విన్సెంట్‌ వద్ద ఉంటుంది. ఈ దశలో వీరయ్య రెడ్డి, విన్సెంట్‌ విడిపోతారు. విన్సెంట్‌ ఈ వ్యాపారాలను లీడ్‌ చేస్తుంటాడు. రెడ్డిపై పోలీసులు ఎటాక్‌ చేస్తారు. కానీ బతికి వస్తాడు. కీ కోసం వెతుకులాట జరుగుతుంది. మరోవైపు ఈ నేరాల గురించి, ఈ డబ్బు గురించి గురు టీమ్‌(ఫరియా, రాజు సుందరం)కి తెలుస్తుంది. వీళ్లు దాన్ని దక్కించుకునే ప్లాన్‌ చేస్తారు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది సినిమా.

36
సిగ్మా మూవీ విశ్లేషణ

వెయ్యి కోట్ల మనీ చుట్టూ తిరిగే కథ ఇది. ఆ మనీని దక్కించుకునేందుకు కారణమైన కీ కోసం హీరో గ్యాంగ్‌, విలన్ల గ్యాంగ్‌ చేసే పోరాటమే ఈ మూవీ. ఓ వైపు క్రైమ్‌ స్టోరీ, మరోవైపు హీరో అప్పుల బాధతో బాధపడటం వంటి అంశాలతో సినిమా సాగుతుంది. రెండింటిని ప్యారలల్‌గా దర్శకుడు సినిమాని నడిపించాడు. కథగా ఇది చాలా సింపుల్‌. కానీ దర్శకుడు జేసన్‌ కథనం విషయంలోనే చాలా కాంప్లికేటెడ్‌గా మార్చాడు. కథ ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా తీసుకెళ్లారు. ప్రారంభంలో కథని ఎస్టాబ్లిష్‌ చేసే సమయంలో కొంత ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనే క్లారిటీ మిస్‌ అయ్యింది. ఏవేవో పాత్రలు వస్తుంటాయి. ఎందుకొస్తాయనేది క్లారిటీ లేదు. అనంతరం సందీప్‌ కిషన్‌, ఫరియా లవ్‌ ట్రాక్‌ ఉంటుంది. డబ్బు విషయంలో మోసం చేశాడని సందీప్‌ని ఫరియా ఛీ కొడుతుంది. కానీ డాక్టర్‌ అయిన రాజు సుందరం మాస్టర్‌ సపోర్ట్ గా ఉంటాడు. అలాగే డబ్బులు కోసం చేసే ప్రయత్నంలో క్యాసినో వెనక జరిగే క్రైమ్‌ గురించి హీరోకి తెలియడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ చేదనలో విలన్లు కొట్టుకోవడం, విలన్లని హీరో బ్లాక్‌ మెయిల్‌ చేయడం, డబ్బులు డిమాండ్‌ చేయడం, డబ్బులు వచ్చినట్టే వచ్చి పోవడం వంటి సన్నివేశాలు కొంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, వాటిని సాగడంతో చిరాకు తెప్పిస్తాయి. ఆయా సీన్లలో ల్యాగ్‌ ఎక్కువగా ఉంటుంది.

కథ ఎంతసేపు అక్కడే తిరుగుతుంది. చనిపోయిండనుకున్న రెడ్డి మళ్లీ ఎంట్రీతో కథ మరోవైపు టర్న్ తీసుకుంటుంది. ఫస్టాఫ్‌ బాగా స్లో అనుకుంటే, సెకండాఫ్‌ మరింత స్లోగా, మరింత కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. పాత్రలు ఎక్కువగా పెట్టడం కూడా ఇందులో మైనస్‌గానే చెప్పొచ్చు. సెకండాఫ్‌ మరింత గందరగోళంగా మారుతుంది. ఒక్క సీన్‌ కూడా ఎంగేజింగ్‌గా లేదు. పైగా బాగా లాగడంతో ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. అదే సమయంలో లాజిక్‌ లెస్‌గా ఉంటుంది. క్లైమాక్స్ మరీ సాగదీశారు. అది ఏ స్థాయిలో అంటే ఆడియెన్స్ ఓపికని పరీక్షించేలా ఉంటుంది. ఎంత చేయకూడదో అంత చేశారు. సినిమాలో ఒక ఇంటెన్సిటీ లేదు, సీరియస్‌ నెస్‌ లేదు, డ్రామా వర్కౌట్‌ కాలేదు, థ్రిల్లర్‌ ఫీల్‌ లేదు. ఏ రకంగానూ ఈ సినిమా ఆడియెన్స్ ని మెప్పించలేకపోయిందని చెప్పొచ్చు. నటీనటుల ఓవర్‌ డ్రామా ఇబ్బంది పెడుతుంది. సినిమాలో ఏదైనా ప్లస్‌ ఉందంటే కొన్నిచోట్ల ఆర్‌ఆర్‌ ఆకట్టుకుంటుంది.

46
సిగ్మా మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా నటించారంటే?

గురు పాత్రలో సందీప్‌ కిషన్‌ నటించి మెప్పించాడు. పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. కానీ ఆయన పాత్రలోని డ్రామా కూడా ఓవర్‌గా అనిపిస్తుంది. యాక్షన్‌ సీన్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సామ్‌ పాత్రలో ఫరియా ఫర్వాలేదనిపించింది. మెప్పించే ప్రయత్నం చేసింది. రాజుసుందరం మాస్టర్‌ పాత్ర ఏమాత్రం నవ్వించలేదు. సందీప్‌ కిషన్‌ పక్కన చేసిన అబ్బాయి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సంపత్‌ రాజ్‌ ఎప్పటిలాగే మెప్పించాడు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

56
సిగ్మా టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

థమన్‌ మ్యూజిక్‌ లో ఆర్‌ఆర్‌ ఓకే అనిపించింది. కానీ సీన్లల్లో దమ్ములేకపోవడంతో అవి తేలిపోయాయి. కెమెరా వర్క్ ఫర్వాలేదు. ఎడిటింగ్‌ పరంగా చాలా వర్క్ చేయాలి. నిర్మాణ విలువలకు కొదవ లేదు. సినిమా రేంజ్‌ని మించి ఖర్చు చేశారు. దర్శకుడు జేసన్‌ సంజయ్‌.. దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ ఇలాంటి సబ్జెక్ట్ ఎంపిక చేయడం మైనస్‌గా చెప్పొచ్చు. పైగా ఆకట్టుకునేలా తీయడంలో తడబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఫెయిల్‌ అయ్యాడు. ఫైనల్‌గా సినిమా చూశాక.. జేసన్‌ సంజయ్‌.. దర్శకుడిగా కంటే నటుడిగా ట్రై చేస్తే బెటర్‌ అనిపించింది.

66
ఫైనల్‌గా

ఆడియెన్స్ సహనంతో ఆడుకున్న సిగ్మా. విజయ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా సక్సెస్‌కాలేకపోయారు.

రేటింగ్‌: 1.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories