`అశ్వథ్ధామ` మూవీ రివ్యూ
First Published | Jan 31, 2020, 1:30 PM IST---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఆ మధ్యన హారర్ కామెడీలతో ఓ ఊపు ఊగిపోయిన తెలుగు సినిమా గత కొంతకాలంగా క్రైమ్ థ్రిల్లర్స్ పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా రాక్షసుడు హిట్ అయ్యిన దగ్గర నుంచి అలాంటి కథలు అర్జెంటుగా వండి వడ్డించేయాలని చూస్తోంది. హారర్ కామెడీలాగానే క్రైమ్ థ్రిల్లర్స్ తోనూ కొన్ని సుఖాలు ఉన్నాయి. పెద్ద స్టార్లు అవసరం లేదు. ఐటెం సాంగ్ లు అక్కర్లేదు . ఓ చిన్న కథ… దానికి సరైన ట్విస్ట్ కలిస్తే చాలు. బడ్జెట్ కూడా లిమిట్ లోనే ఉంటుంది కాబట్టి, ఓ మాదిరిగా ఉన్నా ఒడ్డున పడిపోవచ్చు. అయితే ఇలాంటి సినిమాలకు సక్సెస్ రేటు కాస్త తక్కువ. అరుదుగా ఇలాంటి సినిమాలు హిట్లవుతుంటాయి. క్రితం సంవత్సరం వచ్చిన `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`, `ఎవరు`, 'రాక్షసుడు', 'ఖైథీ' మంచి థ్రిల్లర్లుగా నిలిచాయి. ఈ స్ఫూర్తితో ఈ జోనర్‌కి మరింత ఊపు వచ్చింది. ఈ లిస్ట్ లో వచ్చిన మరో సినిమా `అశ్వథ్ధామ`. హీరో నాగశౌర్య స్వయంగా కథా రచయితగా మారి రచించిన ఈ చిత్రం కథేంటి, ఈ సినిమాకు మిగతా క్రైమ్ థ్రిల్లర్స్ కు తేడా ఏంటి...ఈ సినిమాతో నాగశౌర్య తను ఆశించినట్లు యాక్షన్ హీరో ఇమేజ్ అందుకుంటాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.