డాడీ...ఇది కమల్ సినిమానే..!!. ‘బ్లడీ డాడీ’ రివ్యూ

First Published | Jun 10, 2023, 1:44 PM IST

ఈ మూవీ థియేటర్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. జియో స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాని జియో సినిమా (Jio Cinema) ఓటిటిలో రిలీజ్ చేసారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం...

Bloody Daddy Review


బాలీవుడ్ స్టార్  హీరో షాహిద్ కపూర్.. రీసెంట్ గా  ఫర్జి (Farzi) సిరీస్ తో సూపర్ హిట్టుని అందుకున్నాడు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), రాశి ఖన్నా (Rashi Khanna) ప్రధాన పాత్రలు పోషించిన ఆ సిరీస్ తో షాహిద్ సౌత్ లో కూడా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ‘బ్లడీ డాడీ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ థియేటర్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. జియో స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాని జియో సినిమా (Jio Cinema) ఓటిటిలో రిలీజ్ చేసారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం...

స్టోరీ లైన్:

నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఆఫీసర్ సుమేర్ ఆజాద్‌ (షాహిద్ కపూర్).. చాలా పవర్ ఫుల్..ప్లానింగ్ ఉన్నవాడుప. కోవిడ్ టైమ్ లో ఓ డ్రగ్స్ గ్యాంగ్ పై దాడి చేసి దాదాపు యాభై కోట్ల డ్రగ్స్ పట్టుకుంటాడు. అయితే అంత ఖరీదైన మాల్ ని వదులుకోవటానికి అవతలి వాళ్లు సిద్దంగా ఉండరు కదా. ఆ మాల్ ఓనర్ సికిందర్ (రోనిత్ రాయ్)కి కాలిపోతుంది. వెనక్కి ఆ మాల్ ని తప్పించుకోవటానికి   సుమేర్ కొడుకుని కిడ్నాప్ చేస్తారు. మా డ్రగ్స్ మాకు ఇచ్చి మీ అబ్బాయిని మీరు తీసుకెళ్లడంని బేరం పెడతాడు. అప్పుడు సుమేర్ ఏం డెసిషన్ తీసుకున్నాడు..తన కొడుకుని ఎలా రక్షించుకున్నాడు. సికిందర్ కు ఎలా బుద్ది చెప్పారన్నదే అసలు కథ.



విశ్లేషణ:

చాలా చిన్న పాయింట్ తో ఈ సినిమా తీశారు. పాయింట్ చిన్న‌దే అయినా.. ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లేని  జోడిస్తే వ‌ర్క‌వుట్ అయిపోతుంది. మొదట ఈ సినిమా ఫ్రెంచ్ ఫిల్మ్ 'స్లీప్ లెస్ నైట్స్'కు రీమేక్ అని తెలుసుకోవాలి. ఈ ప్రెంచ్ సినిమా ఆధారంగా ఎప్పుడో కమల్ హాసన్ 'చీకటి రాజ్యం' చేశారు. దాంతో మనకు చీకటి రాజ్యం చూసిన వాళ్లకు ఎప్పుడో ఈ కథ  విన్నట్లే ఉందే అనిపిస్తుంది. ఇక  ఈ స్టోరీ లైన్ చాలా చిన్నది . మన ఇండియన్ సినిమాకు చాలా ఎక్సటెండ్ చేస్తే కానీ వర్కవుట్ కాదు. ఎందుకంటే ఇలాంటి ట్విస్ట్ లు మనవాళ్లు పోలీస్ కథల సెకండాఫ్ లో చాలా సార్లు చూసేసారు. అయితే ఈ డైరక్టర్, హిందీ రచయిత కలసి మూల కథను బాగా పెంచేసే పనిలో పడి సాగతీస్తున్నాం అనే విషయం మర్చిపోయారు. అందుకే సినిమా ప్రారంభం ఉన్నంత టైట్ గా ముందుకు వెళ్లే కొలిగి ఉండదు. విలన్ ని పట్టుకోవటం కోసం వేసే కొన్ని ట్రిక్ లు బాగున్నా అప్పటికే విసుగెత్తిన స్క్రీన్ ప్లే అవి పెద్దగా ఆనవు. అలాగే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ కు క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోవాలి. కానీ అక్కడేమీ అంత గా లేదు. దాంతో ప్లాట్ గా ఉన్న ఫీలింగ్. ప్రెంచ్ సినిమా స్క్రీన్ ప్లేను యాజటీజ్ అనుకరిస్తూ ... హీరో పర్శనల్ లైఫ్ ని పట్టించుకోలేదు. దాంతో మనకు ఎమోషనల్ డెప్త్ దొరకదు. ఎప్పుడైతే మనం ఎమోషన్ గా కనెక్ట్ కాలేదో మిగతా కథ అంతా జస్ట్ ఓకే అన్నట్లు గా సాగుతూన్న ఫీలింగ్ వస్తుంది. ఏదైమైనా మరింత వర్క్ చేయాల్సిన ఫిల్మ్ ఇది. సినిమా అంతా చూసిన తర్వాత డైరక్టర్ చెప్పదలచుకున్న విషయంలో స్పష్టత లోచించిందనేది స్పష్టంగా అర్ధమౌతుంది. సరైన క్లైమాక్స్  లేని పాత్రలు కొన్ని మిగిలిపోయాయి.

Bloody Daddy

టెక్నికల్ గా..

ఈ సినిమా సాంకేతికంగా ఉన్నతంగానే ఉంది. నేపధ్య సంగీతం ఓకే. కెమరాపనితనం నీట్ గా వుంది. ఎడిటింగ్ మాత్రం ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. లోకేషన్స్ బావున్నాయి కానీ అసలు ఈ కథ ఎక్కడ జరుగుతోంది అంత రిజిస్టర్ కాకుండా చేశారు.  . ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ వంటి సినిమాలను తెరకెక్కించిన అలీ అబ్బాస్‌ ఈ సినిమాలో ఎమోషన్ కన్నా  యాక్షన్‌కే పెద్దపీట వేశారు 

Bloody Daddy


ఫెరఫార్మెన్స్ వైజ్...

షాహిద్ కపూర్ రీమేక్ రాజా అవుతున్నాడు. ఈ సినిమాలో పాత్ర‌కు, టైటిల్ కు త‌గిన న‌ట‌న క‌న‌బ‌రిచాడు.  ప్రారంభంలో ఆ ఫ్రెంచ్ ఫిల్మ్ ని యాజటీజ్  ఫాలో అవుతున్నాడ‌ని అనిపించినా, క్ర‌మంగా.. వేరియేష‌న్స్ చూపించే అవ‌కాశం ద‌క్కింది. ఈయన కొడుకుగా నటించిన సర్తాజ్‌ కక్కర్‌ మెప్పిస్తాడు.  . త‌న స్క్రీన్ ప్రెజెన్స్ ఆక‌ట్టుకొంది. కొన్ని క్యారెక్ట‌ర్ల‌కు న‌టీన‌టుల్ని ఎంచుకోవ‌డం రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. ముఖ్యంగా విల‌న్ గ్యాంగ్ జస్ట్ ఓకే అనిపించింది. బ‌హుశా టీమ్  ఇదే కొత్త‌గా ఫీల్ అయ్యిందేమో..?

Bloody Daddy

  
ఫైనల్ థాట్

మన దేశ భాషల రీమేక్ లు అయితే మన హీరోలకు ఫెరఫెక్ట్ గా సరిపోతాయి.. వేరే దేశాల వాళ్లవి అయితే ఆ కొలతలు మార్చి మొత్తం కుట్టుకోవాలి.లేకపోతే స్క్రిప్టు చిన్నదవచ్చు..పెద్దది అవ్వచ్చు..అసలు సరిపోక పోవచ్చు. 

--సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:2

Bloody Daddy

నటీనటులు: షాహిద్‌ కపూర్‌, సర్తాజ్‌ కక్కర్‌, రోనిత్‌ రాయ్‌, సంజయ్‌ కపూర్‌, డయానా పెంటీ తదితరులు; 
సంగీతం: జులియస్‌ (నేపథ్య సంగీతం), బాద్‌షా, ఆదిత్య దేవ్‌, అనుజ్‌ (పాటలు); 
ఎడిటింగ్‌: స్టీవెన్‌ హెచ్‌. బెర్నార్డ్‌; 
సినిమాటోగ్రఫీ: మార్కిన్‌; 
నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్‌, ఆఫ్‌సైడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆజ్‌ ఫిల్మ్స్‌; 
దర్శకత్వం: అలీ అబ్బాస్‌ జాఫర్‌; 
విడుదల: 09-06-2023
 ఓటీటీ : జియో సినిమా 

Latest Videos

click me!