Godse : సత్యదేవ్ ‘‘గాడ్సే’’ రివ్యూ

First Published | Jun 17, 2022, 3:29 PM IST

లాస్ట్ ఇయర్ తిమ్మరుసుతో థియేటర్లలో సందడి చేశాడు సత్యదేవ్. తాజాగా ‘‘గాడ్సే’’ అనే చిత్రంతో మరోసారి  ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ గోపి గణేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు జూన్ 17 రిలీజైంది.
 

Godse


హిట్,ప్లాఫ్ లకు సంభందం లేకుండా వరస  సినిమాలు చేస్తూ..  గుర్తింపు తెచ్చుకున్నాడు  సత్యదేవ్. హీరోగా కన్నా నటుడుగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.   ఆ మధ్యన తిమ్మరుసుతో థియేటర్లలో సందడి చేశాడు. తాజాగా ‘‘గాడ్సే’’ అనే చిత్రంతో మరోసారి  ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ గోపి గణేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు జూన్ 17 రిలీజైంది.  గతంలో ఇదే డైరెక్టర్ తో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా తీసిన సత్యదేవ్.... ఇప్పుడు గాడ్సే మూవీలో ఏం చేసారు..సినిమా కథేంటి,సత్యదేవ్ కు బ్రేక్ ఇస్తుందా  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Godse

కథ


హైదరాబాద్ లో  ఫైనాన్స్ మినిస్టర్, పోలీస్ ఆఫీసర్లు,  వాళ్ల బినామీలు వరస పెట్టి కిడ్నాప్ అవుతూంటారు. ఆ విషయం బయిటకు రాకుండా సీక్రెట్ గా డీల్ చేయమని ఓ టీమ్ ని ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. ఆ టీమ్ ని ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) లీడ్ చేస్తుంది. ఆ క్రమంలో ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి మరెవరో కాదని..లండన్ నుంచి తెలుగు రాష్ట్రానికి వచ్చిన విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) అనే బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. అతనే  'గాడ్సే' పేరుతో ఈ  కిడ్నాప్స్ చేశాడని ఆమె తెలుసుకుంటుంది. అసలు ఓ బిజినెస్‌మేన్ కిడ్నాప‌ర్‌గా ఎందుకు మారాడు?ఎందుకు ఇలా చేసాడు?  'గాడ్సే'ను చూసి   మినిస్టర్స్ నుంచి   ముఖ్యమంత్రి దాకా ఎందుకు కంగారుపడ్డారు ? అసలు గాడ్సే కథేంటి? అతడి దగ్గర ఎవరెవరి సీక్రెట్స్ ఉన్నాయి?  అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Godse


కథా విశ్లేషణ

కథగా ఇది చాలా రొటీన్ అనిపిస్తుంది. ఇలాంటివి చాలా చూసాం అనిపిస్తుంది.  శంకర్ తీసిన సినిమాలు గుర్తుకురాకమానవు. అలాగే  నారా రోహిత్ 'ప్రతినిధి' కూడా ఖచ్చితంగా గుర్తు వస్తుంది.  అయితే ఆ సినిమాల  స్దాయిలో హీరో క్యారక్టరైజేషన్ లేదు. ఏవో డైలాగులతో చెప్పించి, ఒప్పించే ప్రయత్నం చేసారు కానీ ఆ ఎమోషన్ పూర్తి స్దాయిలో కనెక్ట్ కాదు. కాకపోతే హీరో చేత చెప్పించిన డైలాగులు చాలా వరకూ సూటిగా చాలా మందికి పొలిటీషిన్స్ తగులుతాయి. నిజమే కదా అనిపిస్తుంది. కాకపోతే స్క్రీన్ ప్లే బాగా బద్దకంగా సాగుతుంది. ఇంట్రస్టింగ్ గా మొదలైన కథ..ఆ తర్వాత అదే ఇంట్రస్ట్ ని సస్టైన్ చేయలేకపోతుంది. ఫస్టాఫ్ లో అసలేమి జరిగినట్లు ఉండదు. అలాగే చాలా స్పీడుగా జరగాల్సిన విషయాలు మెల్లిగా సాగుతూ విసిగిస్తూంటాయి. ఇక కిడ్నాప్ లు  ఒక్కొక్కటి ఎందుకు చేసారనేది చెప్పే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఊహకు అందేదే. కొత్తగా ఏమి అనిపించదు. ఎక్కువగా రోజూ వారి న్యూస్ లలో వచ్చే వాటినే సీన్స్ గా మలిచారు.  దాంతో పెద్దగా ఏమీ అనిపించదు. 
 

Godse

టెక్నికల్ గా ..

డైరక్షన్ ఈ కథకు తగ్గట్లే కొంత ఇంటెన్స్ తో కొంత లాగ్ తో సాగింది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది. సునీల్ కశ్యప్ పాటల్లో చెప్పుకోదగనది ఏదీ లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓకే. సినిమా మూడ్ ని ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాలి.కొన్ని చోట్ల బాగా స్లో అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు సరపడే స్దాయిలో లేవు.  సినిమాలో చెప్పుకోదగనవి గోపీ గణేష్ రాసుకున్న డైలాగులు.  సిస్టమ్ ను ఎదిరించే  డైలాగులు మాత్రం బాగా పేలాయి. 
 
నటీనటుల్లో ...  సినిమా మొత్తాన్ని సత్యదేవ్ తన భుజాన వేసే ప్రయత్నం చేసారు. మోసాడు. దాంతో  సినిమాలో చాలా మంది ఆర్టిస్ట్ లు ఉన్నా సత్యదేవ్   డామినేట్ చేస్తూ కనపడతాడు. ఇక తమిళ అమ్మాయి ఐశ్వర్య బాగానే చేసింది. ప్రియదర్శి, నోయల్ సత్యదేవ్ ఫ్రెండ్స్ పాత్రల్లో బాగా చేశారు. ఇక మిగతా ఆర్టిస్ట్ లు ఓకే.   రాహుల్ రామకృష్ణ, నాగబాబు కు చెప్పుకోదగన సీన్స్ లేవు. పృథ్వి రాజ్ కామెడీ బాగుంది.
 

Godse

ఫైనల్ థాట్

ఓటీటిలో చూస్తే బెస్ట్ అనిపిస్తుంది. థియోటర్ లో కష్టమనిపిస్తుంది.
 
Rating: 2/5

లాస్ట్ ఇయర్ తిమ్మరుసుతో థియేటర్లలో సందడి చేశాడు సత్యదేవ్. తాజాగా ‘‘గాడ్సే’’ అనే చిత్రంతో మరోసారి  ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ గోపి గణేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు జూన్ 17 రిలీజైంది.

Godse


బాగున్నవి:
 
యాక్షన్ ఎపిసోడ్స్,
సినిమాటోగ్రఫీ

బాగోలేనవి:

కథా, స్క్రీన్ ప్లే
ప్రొడక్షన్ వాల్యూస్ 
ఎడిటింగ్

Godse

నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, జియా ఖాన్, పృథ్వీ, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, నోయెల్ తదితరులతో పాటు అతిథి పాత్రల్లో నాగబాబు, ప్రియదర్శి
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
స్వరాలు (రెండు పాటలు): సునీల్ కశ్యప్
సంగీతం: శాండీ అద్దంకి
నిర్మాత: సి. కళ్యాణ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి
విడుదల తేదీ: జూన్ 17, 2022

Latest Videos

click me!