#Eaglereview రవితేజ ‘ఈగల్’రివ్యూ

First Published | Feb 9, 2024, 1:34 PM IST

ర‌వితేజ యాక్ష‌న్ అవ‌తారంలో  స‌హ‌దేవ్ వ‌ర్మ పాత్ర‌లో చెలరేగిపోయిన సినిమా ఇది. 

Eagle movie review


రవితేజ తన బ్రాండ్ ఫన్ ని వదిలేసి వరస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఆ క్రమంలో  గత సంవత్సరం  రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావు అంటూ పలకరించి హడలుకొట్టిన రవితేజ ఈ యేడు ప్రారంభంలో ఈగల్ అంటూ మన ముందు వాలాడు.    విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ డైలాగులు చెప్తూ వచ్చాడు. ఖచ్చితంగా హిట్ కావాల్సిన టైమ్ లో వచ్చిన ఈ సినిమా ఏ మేరకు రవితేజ కెరీర్ కు ప్లస్ అయ్యింది..ఏంటి సినిమా ప్రత్యేకత..  కెమెరామన్ టర్న్డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన  ఈ చిత్రం కథేంటి వంటి విషయాలు చూద్దాం.  

Eagle Movie Review


స్టోరీ లైన్

ఢిల్లీలో పని చేసే జర్నలిస్ట్ నళిని రావు (అనుపమ) కి  రోజు  అనుకోకుండా ఒక ప్రత్యేకమైన కాటన్ క్లాత్ ని చూస్తుంది. ఆ క్లాత్ ని కొనేటప్పుడు ఆ  క్లాత్ ని తయారుచేసిన పత్తి పండించే ఊరికి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ విషయం తెలుసుకుంటుంది.  అదేమిటంటే..ఆ అరుదైన క్లాత్ ని ప్రపంచానికి పరిచయం చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మాయమయ్యాడని.  వెంటనే ఆమె తన వృత్తి ధర్మంగా...ఆ విషయంపై పేపర్లో ఓ ఆర్టికల్ రాస్తుంది. సాధారణంగా కాటన్ క్లాత్ గురించి రాస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ చిత్రంగా ఇంటిలిజెన్స్ రంగంలోకి దిగి ఆ పత్రిక మొత్తాన్ని ఒకరోజు ప్రింటవకుండా అడ్డుకుంటుంది. ఆ వార్త వల్ల ఓ టాప్ సీక్రెట్ బయిటకు వెళ్తుందని కంగారుపడుతుంది. నళిని మరింత ముందుకు వెళ్లకుండా జాబ్ పోతుంది. అయితే నళిని ఊరుకుంటుందా...ఆ మిస్ అయ్యిన వ్యక్తి గురించి ఆరా తీయటం మొదలెడుతుంది. 


Eagle Movie Review


ఆ క్రమంలో ఆ మిస్సైన వ్యక్తి పేరు సహదేవ్ వర్మ (రవితేజ) అని తెలుస్తుంది. అతని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు  నళిని ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి వెళుతుంది. అక్కడ  సహదేవ్ (రవితేజ) చిత్తూరు జిల్లాలోని తలకోన ప్రాంతంలో ఒక గిరిజన ప్రాంతంలో ఫాం హౌస్ కట్టుకుని ఒక పత్తి ఫ్యాక్టరీని నడుపుతుండేవాడిని తెలుసుకుంది.  అక్కడ పండే అరుదైన పత్తిని రైతులు తీసుకొచ్చి ఇదే ఫ్యాక్టరీలో నేయడం ద్వారా జీవనం సాగిస్తుంటారు. మరో ప్రక్క  పైకి మామూలు వ్యక్తిలా కనిపించే సహదేవ్ కి బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. అతడికి ‘ఈగల్’ అనే మరో కోడ్ నేమ్,లైఫ్  కూడా ఉంటుంది. ఆ ఈగల్ కోడ్ నేమ్ వెనక కథేంటి.. సహదేవ్ వర్మ పేరు చెప్తే ఇంటిలిజెన్స్ ఎందుకు ఉలిక్కి పడింది..  సహదేవ్ భార్య రచన(కావ్య)కి ఏమైంది?సహదేవ్ ఎలా మిస్సయ్యాడు.. ఆ ప్లాష్ బ్యాక్ ఏమిటి వంటి  విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.

Eagle Movie Review

విశ్లేషణ

ఇదో థ్రిల్లర్ జానర్ లో జరిగే కథ. అయితే కథా నేరేషన్ టెక్నిక్ ని కేజీఎఫ్ ని పోలి ఉంటుంది. హీరో గురించి ఎత్తగానే అందరూ ఓ రేంజిలో ఉలిక్కి పడటాలు. అతను గురించి బిల్డప్ గా గతం-గరుడపురాణం.. మృగసిర-మధ్యరాత్రి.. పట్టపగలు-పద్ధతైన దాడి.. కంచె-కాపరి.. అంటూ చెప్తూ ఎలివేషన్స్ ఇస్తారు. అయితే ఆ ఎలివేషన్స్ తగ్గ కథ ఆ పాత్ర లో కనిపించదు. దాంతో ఆ బిల్డప్ విని ఆ పాత్ర గురించి ఓ రేంజిలో ఊహించుకుంటే అదేమీ కనపడక సీన్స్ తేలిపోతూంటాయి. దానికి తగినట్లు ఎపిసోడిక్ నేరేషన్ కొంత ఇబ్బంది పెడుతుంది.  ముఖ్యంగా మరీ ఫస్టాఫ్ లో అసలేమీ జరిగినట్లు ఉండదు. ఎందుకంటే కథలోకి అసలు రారు. సెకండాఫ్ లో మెల్లిగా తాయితీయిగా కథ మొదలవుతుంది. ప్రత్తి,చేనేత అంటూ మొదలెట్టి  ఆయుధాలు, నక్సలైట్లు, పాక్ టెర్రరిస్టులుతో మిక్స్ చేసి ఏదో చెప్దామనుకుని ఏదేదో చెప్పేసారు. 


సర్లే ఫస్టాఫ్ అందరిలాగే ఏదో గడిపేసాడు కథ చెప్పకుండా ,సెకండాఫ్ అదరకొట్టేస్తాడు అనుకుంటే చివరి ఇరవై నిముషాల దాకా అసలు కథేమిటో తెలియనివ్వడు. దాంతో హీరో కు ఏం జరిగిందో..అసలు అతని సమస్య ఏమిటో..అతన్ని మనం సపోర్ట్ చేయాలో అక్కర్లేదో..అతను ఎమోషన్ ని మన ఎమోషన్ గా భావించాలో వద్దో తెలియకుండా సినిమా  జరిగిపోయింది..తెరకు మనకు మధ్య సెల్ ఫోన్ వచ్చి నిలబడే సిట్యువేషన్ చాలా సేపు క్రియేట్ అయ్యింది. అక్రమ ఆయుధాలు అనే మంచి పాయింట్ ని ఎత్తుకున్నా దాన్ని బ్యాడ్ నేరేషన్ తో ఎంగేజింగ్ గా చెప్పలేకపోయారు. మనకు కనెక్ట్ గానీ సీన్స్ తో చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. 


టెక్నికల్ గా..

దర్శకుడు స్వతహాగా సినిమాటోగ్రాఫర్  కావటంతో ఆ విభాగంపై అతని దృష్టి ఎక్కువ ఉంది. మంచి అవుట్ ఫుట్ కనపడుతుంది. ఇక పాటలు విషయానికి వస్తే అసలు వర్కవుట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన  ఇలాంటి సినిమాలకు ఇచ్చిన అనిరిధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముందు తేలిపోయింది.  ఎడిటింగ్ ప్రధాన సమస్యగా అనిపిస్తుంది. డైరక్టరే ఎడిటర్ కాబట్టి ఆయనకు క్లారిటీగా అర్దమై ఉంటుంది ...కానీ చూసేవారికి ఆ క్లారిటీ ఇవ్వలేకపోయారు. చాలా లెంగ్తీగా అనిపిస్తాయి కొన్ని సీన్స్ తను మోజుపడి సీన్స్ ని సరిగ్గా ట్రిమ్ చేయలేకపోయారేమో అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఓ రేంజిలో ఉన్నాయి.మణిబాబు కరణం డైలాగులు గంభీరంగా ఉన్నాయి కానీ సీన్స్ లో చాలా వరకూ సింక్ కాకుండా విచిత్రంగా అనిపించాయి. ఎక్కడా సహజత్వం కనిపించలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా స్క్రీన్ ప్లే సినిమాని పూర్తి కన్ఫూజన్ గా మార్చేయటంలో సఫలీకృతమైంది. 


నటీనటుల్లో ..

సహదేవ్ వర్మగా రహస్యమైన గతం ఉన్న వ్యక్తిగా చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా రవితేజ కనపించారు. ఆ పాత్రకు డిఫరెంట్ లుక్ తో పూర్తి న్యాయం చేసారు. అనుపమ పరమేశ్వరన్ కు కార్తికేయ 2 తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ పాత్ర లభించింది.  కావ్య థాపర్ కనిపించిన కాసేపు గ్లామర్ తో అదరకొట్టింది. వినయ్ రాయ్ కాస్త డిఫరెంట్ పాత్ర చేశాడు.  నవదీప్ బాగానే చేశాడు. అజయ్ ఘోష్.. శ్రీనివాసరెడ్డి నవ్వించే పని పెట్టుకున్నారు. ఇంటిలిజెన్స్ రా చీఫ్ పాత్రకు మధుబాల నప్పలేదు. ఆ పాత్రకు తగ్గ ఇంటిలిజెన్స్, గంభీరతం ఆమెలో కనిపించలేదు. మిగతా పాత్రలు జస్ట్ ఓకే.   

నచ్చనవి

యాక్షన్ సీన్స్
రవితేజ లుక్స్
ప్రొడక్షన్ వాల్యూస్  


నచ్చనవి

ఎపిసోడిక్ స్క్రీన్ ప్లే నేరేషన్

కాంప్లిక్ట్ సెట్ కాని డ్రామా
లవ్ ట్రాక్

ఫైనల్ థాట్

 స్టైలిష్ నేరేషన్ లో  సోల్ మిస్సైంది. రవితేజ భాషలో చెప్పాలంటే 'పత్తి' యాపారం ఎక్కువై మెయిన్  పాయింట్ ప్రక్కకు వెళ్లిపోయింది.
-----సూర్య ప్రకాష్ జోశ్యుల


RATING:  2.25/5 

Eagle


బ్యానర్‌: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ;
 నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్‌, నవదీప్‌, వినయ్‌ రాయ్‌, కావ్యథాపర్‌, మధు, శ్రీనివాస్‌ అవసరాల, శ్రీనివాసరెడ్డి, అజయ్‌ ఘోష్‌ తదితరులు;
 సంగీతం: డేవ్‌ జాండ్‌; 
సినిమాటోగ్రఫీ: కమ్లీ ప్లాకీ, కరమ్‌ చావ్లా; 
ఎడిటింగ్‌: కార్తిక్‌ ఘట్టమనేని;
 నిర్మాత: టి.జి.విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల; 
స్క్రీన్‌ప్లే: మణిబాబు కరణం;
 రచన, దర్శకత్వం: కార్తిక్‌ ఘట్టమనేని; 
విడుదల: 09-02-2024
 

Latest Videos

click me!