#Dhamaka:రవితేజ 'ధమాకా' రివ్యూ

First Published | Dec 23, 2022, 1:04 PM IST

. ‘ధమాకా’ టీజర్, ట్రైలర్లు, సాంగ్స్ చూస్తే ఒకప్పటి వింటేజ్ రవితేజ కనిపించాడని అందరూ మురిసిపోయారు. ఈ  క్రమంలో సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. మరి ధమాకా ఆ అంచనాలను అందుకుందా? దిల్ ఖుష్ చేసిందా 

Dhamaka Movie Review

ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కథ గురించి ముందే చర్చ అంతటా జరిగింది.  అనేక సినిమాలతో పోలికలు పెడుతూ వచ్చారు. దానికి తోడు ఇది రౌడీ అల్లుడు కు మరో వెర్షన్ అని రచయితే చెప్పటం తో చాలా మంది లైట్ తీసుకున్నారు. అయితే రవితేజ వంటి స్టార్ హీరో, ఎంతో అనుభవం ఉన్నవాడు..ప్రస్తుతం ప్లాఫ్ ల్లో ఉన్నవాడు అలాంటి కథను ఎందుకు ఎంచుకుంటాడు. అందులో ఏదో కొత్తదనం ఉండే ఉంటుంది అని మళ్లీ కుదుటపడ్డారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది...జనం ఊహించినట్లుగా రొటీన్ గానే ఉందా...  ట్రీట్మెంట్ కొత్తగా చేసారా, అసలు స్టోరీ లైన్ ఏమిటి..రవితేజను ప్లాఫ్ ల నుంచి ఈ సినిమా బయిటపడేస్తుందా.... వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 


స్టోరీ లైన్

ఇది హీరో డ్యూయిల్ రోల్ ఫిల్మ్. ఇందులో రవితేజ ..స్వామిగా, ఆనంద చక్రవర్తిగా కనిపిస్తాడు. స్వామి ది మిడిల్ క్లాస్.  చెల్లి(మోనికా రెడ్డి)కి పెళ్ళి చేయాలనే భాధ్యత. అయితే అనుకోకుండా ఉద్యోగం పోయి ఖాళీగా ఉంటాడు. ఆనంద చక్రవర్తి ది రిచ్ బ్యాక్ గ్రౌండ్.  పీపుల్స్ మార్ట్ గ్రూప్ కి కాబోయే సీఈవో అతను. అయితే ఆనంద్ కు అది ఇష్టం ఉండదు.  దాంతో తండ్రి  చక్రవర్తి (సచిన్ కేడ్కర్) ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. ఇక డబ్బున్న చోట శత్రువులు ఉంటారు కదా. అలా ఈ కథకో విలన్  జెపి( జయరామ్)  . తన కొడుకు కోసం పీపుల్స్ మార్ట్ తనకు తక్కువ ధరకే అమ్మేయాలని పెద్ద ఎత్తున ప్రెజర్ పెడుతూ ఉంటాడు.  ఆనంద్, చక్రవర్తి మీద దాడి  ప్రయత్నిస్తూంటాడు.  వీళ్ల మధ్యలో ఓ అందమైన అమ్మాయి పావని (శ్రీలీల). పావనిని ఆనంద్ చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేయాలనేది తన తండ్రి (రావు రమేష్) జీవితాశయం. ఇక పావనిని (శ్రీలీల) చూడగానే ఇష్టపడతాడు స్వామి. ఒకే పోలికలతో ఉన్న స్వామి, ఆనంద్ చక్రవర్తిలను చూసి షాక్ అయ్యిన పావని..ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అందుకోసం ఇద్దరితోనూ ట్రావెల్ చేస్తూంటుంది. ఇలా పావని , జెపి , స్వామి, ఆనంద చక్రవర్తిల మధ్య తిరుగుతూ కథ చివరకు ఏ తీరం చేరింది. జేపీ కు  ఆనంద్ బుద్ది చెప్పాడా...పావని...ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంది... అసలు స్వామి, ఆనంద్ లకు పరిచయం ఉందా? అసలు వీరిద్దరూ ఒక్కరేనా? లేక వేరు వేరు వ్యక్తులా? వంటి విషయాలు తెలుకోవాలని ఉంటే సినిమా చూడాల్సిందే.


ఎనాలసిస్...:

  కథగా చూస్తే కొత్తదనం కొంచెం కూడా కనపడదు. అయితే పాత కథలను కూడా కొత్తగా చెప్పచ్చు అని చాలా మంది గతంలో ప్రూవ్ చేసారు. ఇక్కడా కొంతవరకూ ట్రై చేసారు. కానీ మెయిన్ పాయింట్, రవితేజ డ్యూయిల్ రోల్ ఆ అవకాసం ఇవ్వదు. అప్పటి చిరంజీవి సినిమాలు దొంగమొగుడు, రౌడీ అల్లుడు నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన గోపిచంద్ సినిమా దాకా వరసపెట్టి గుర్తు వచ్చేస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మినిహా ఫస్టాఫ్ లో ఏమీ జరిగినట్లు ఉండదు.అయితే బోర్ కొట్టనివ్వకుండా ఫన్ అడ్డుపడి సేవ్ చేస్తూంటుంది. అలాగే రవితేజ గత సూపర్ హిట్ చిత్రాల్లో ఎనర్జీ ని ఎలివేట్ చేసేలా సీన్స్ కొన్ని రాసుకున్నారు. అదే ఈ కథలో ఏకైక ప్లస్. ఈ కథ రవితేజ కాకుండా వేరే వాళ్లు చేస్తే ఎలా ఉంటుందా..చూడగలమా చివరిదాకా  అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు ఇంద్ర సినిమా స్పూఫ్ , ప్రీ క్లైమాక్స్ లో అలవైకుంఠపురములో సీన్ ...బాగా పండాయి కానీ రవితేజ వంటి స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేష్ సినిమాలను గుర్తు చేసేలా ప్యారిడీలు ఏంటి అనిపిస్తుంది.  

Dhamaka Telugu Movie Trailer ravi teja jayaram

స్టోరీ లైన్  చాలా చాలా రొటీన్ గా ఉంటుంది, 90’s నాటిది.  ఈ విషయం  గుర్తు పెట్టుకుని సినిమా చూడటం స్టార్ట్ చేస్తే సినిమా పర్వాలేదు బాగుంది అనిపిస్తుంది, లేదు ఏదో కొత్త కథని చూడబోతున్నాం అని వెళితే మట్టుకు బోర్ ఫీల్ అవ్వడం ఖాయం.  అలాగే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా ప్రెడిక్టబుల్ గా రాసుకున్నారు. . సినిమా చూస్తున్నప్పుడు  తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఆల్ మోస్ట్ గెస్ చేయగలగటం ఈ సినిమా ప్రత్యేక.త…అలాగే  కథ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టింది, ప్రీ ఇంటర్వెల్ నుండి  బాగానే ఉందనిపిస్తుంది కానీ సెకండాఫ్ మళ్లీ రొటీన్ ట్రాక్ కు వెళ్లిపోతుంది. రెగ్యులర్ గా సినిమాలు చూసేవాడు సెకెండ్ ఆఫ్ మొదట్లోనే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది , అక్కడ దాకా ఏం జరుగుతుందిఅన్నది ఆడియన్స్ కి ఈజీగా చెప్పేయగలగుతాడు. ఉన్నంతలో ట్విస్టులు మాత్రం  కాస్త బాగున్నాయి.. అవి నమ్మే చేసారేమో.
 


టెక్నికల్ గా...

అసలు ఇలాంటి పాత కథను కొత్తగా చేయాలి , ఒప్పించగలం అనే ధైర్యం మామూలు విషయం కాదు. అందుకు డైరక్టర్ ని మెచ్చుకోవాలి. వింటేజ్ రవితేజను చూపెట్టాలి అంటే వింటేజ్ కథలే ఎంచుకోవాలనే ఆలోచన కూడా గొప్పదే. ఇక రైటర్  బెజవాడ ప్రసన్నకుమార్... తన డైలాగులతో సినిమాని లాగే ప్రయత్నం చేసారు. చాలా వరకూ ఆయన వర్కవుట్ అయ్యారు. ఈ సినిమాకు పెద్ద హలం భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్వాలిటీతో సాగే పాటులు. జింతాక, కండక్టర్ పాటలు సెకండాఫ్ లో బాగా ప్రెజెంట్ చేసారు. ఎడిటింగ్ ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్. కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ సినిమాకు రిచ్ లుక్ తెచ్చిపెట్టింది. ఫ్రేమ్స్ అందంగా రిచ్ గా ఉన్నాయి.  


నటీనటుల్లో ..

ఇంత రొటీన్ కథను కూడా రవితేజ పూర్తిగా తన భుజాలపై వేకసుకుని ఎనర్జీతో మోసి నిలబెట్టే ప్రయత్నం చేసాడు. ఎట్ లీస్ట్ ..జనాలు సెల్ ఫోన్స్ లో మునిగిపోకుండా చూడగలిగాడు. శ్రీలీలకు కథలో పెద్దగా ప్రయారిటీ లేదు. ఉన్న మేరకు ఆమె బాగానే చేసింది. మాస్ సాంగ్స్ లో ఇరగతీసింది. జయరాం, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, హైపర్ ఆది ..వీళ్లంతా చక్కటి ప్యాడింగ్. బాగా ఫెమిలియర్ ఫేస్ లు కావటంతో కలిసొచ్చింది.


నచ్చినవి?
వింటేజ్ రవితేజ ను గుర్తు చేసే సీన్స్, ఫన్
జోష్ గా సాగే పాటలు
ఇంటర్వెల్ ట్విస్ట్

నచ్చనివి?
పరమ రొట్ట రొటీన్ కథ,కథనం
అడుగడక్కీ ఏదో ఒక చూసిన సినిమా గుర్తుకు రావటం
కీలకమైన క్లైమాక్స్ కూడా సోసోగా లాగేయటం

ఫైనల్ థాట్
 

 పాత ఏంటి,కొత్త ఏమిటి .కథ కోసం సినిమాకు వెళ్తామా... .కాసేపు నవ్వించాడు కదా చాలు అని ఎక్కువమంది అనుకుంటే ఈ సినిమా ధమాకానే. లేకపోతే దిమాక్ ఖారాబే.

--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating : 2.5/5

Dhamaka


నటీనటులు : రవితేజ, శ్రీలీల, జయరాం, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, హైపర్ ఆది తదితరులు
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే : ప్రసన్న కుమార్ బెజవాడ
కూర్పు : ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని
సంగీతం : భీమ్స్ సెసిరోలియో
నిర్మాతలు : అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
విడుదల తేదీ: డిసెంబర్ 23, 2022

Latest Videos

click me!