
రామాయణంపై మన తెలుగులో, ఇండియాలో వివిధ భాషల్లో సినిమాలు వచ్చాయి. అలరిస్తున్నాయి. ఇటీవల ప్రభాస్ కూడా `ఆదిపురుష్` పేరుతో రామాయణాన్ని చూపించి బోల్తా కొట్టాడు. అందరికి తెలిసిన కథే కావడంతో ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో రామాయణం మన ముందుకు వచ్చింది.
`రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ` పేరుతో యానిమేషన్‌లో తీసిన రామాయణం తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చింది. అయితే ఈ యానిమేషన్ రామాయణాన్ని జపాన్ వాళ్లు తీయడం విశేషం. జపాన్‌కి చెందిన కోయిచి ససకి, యుగో సాకిలతో కలిసి రామ్ మోహన్ దీన్ని రూపొందించారు. ముప్పై ఏళ్ల క్రితమే దీన్ని రూపొందించారు. అక్కడ విడుదల చేశారు. అదే సమయంలో సిరీస్‌గా దీన్ని రిలీజ్ చేశారు.
ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్‌గా రెండున్నర గంటల సినిమాగా చేసి ఇండియాలో విడుదల చేశారు. తెలుగుతోపాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో ఈ మూవీని శుక్రవారం(జనవరి 24)న విడుదల చేయడం విశేషం. మరి ఈ యానిమేషన్ రామాయణం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
వాల్మీకి రామాయణం అందరికి తెలిసిందే. ఇది కూడా దాని ఆధారంగానే తెరకెక్కించారు. రాముడు జన్మించడం నుంచి పెరిగి పెద్ద అవడం, సీతని స్వయంవరంలో పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఒక నింద కారణంగా 12ఏళ్లు వనవాసం వెళ్లడం, భరతుడు ఆయోధ్యని పాలించడం, ఆ తర్వాత దశరథుడు కన్నుమూయడం, పర్ణశాలలో మాయ లేడీ వల్ల రాముడు అడవుల్లోకి వెళ్లడం, అన్నని వెతుక్కుంటూ లక్ష్మణుడు వెళ్లడం, అదే సమయంలో ఓ ముని రూపంలో రావణుడు వచ్చి సీతని ఎత్తుకు పోవడం, సీత కోసం హనుమంతుడు, వానరసులతో కలిసి రాముడు చేసే యుద్ధమే ఈ సినిమా. రాముడు రావణుడిని అంతం వరకు ఇందులో చూపించారు.
విశ్లేషణః
రామాయణంలోని ప్రధాన ఘట్టాలను బేస్ట్ చేసుకుని తీసిన మూవీ. కథ పరంగా కొత్తదనమేమీ లేదు. అందరికి తెలిసిందే. ఇప్పుడు చిన్న పిల్లలకు తప్ప టీనేజ్ నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ కథ తెలుసు. అయితే చిన్నపిల్లలకు యానిమేషన్ రూపంలో రామయణాన్ని తెలియజేయడమే ఈ మూవీ ఈ ఉద్దేశ్యం.
పిల్లలను టార్గెట్ చేస్తూ రూపొందించిన చిత్రమిది. వారికి కూడా మన పురణాలు, ఇతిహాసాలు తెలియాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు దీన్ని తెలుగు ఆడియెన్స్ కి, ఇండియన్ ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చారని అర్థమవుతుంది.
యానిమేషన్ ఫిల్మ్ పరంగా బాగుంది. యానిమేషన్స్ చాలా సహజంగా ఉన్నాయి. పాత్రలు లైవ్లీగా ఉన్నాయి. సాధారణంగా కర్టూన్ చిత్రాలు రియాలిటీకి దూరంగా ఉంటాయి. పాత్రలను గుర్తు పట్టడం కష్టం. కానీ ఇందులో ఆ స్పష్టత కనిపిస్తుంది. పైగా ముప్పై ఏళ్ల క్రితమే ఈ క్వాలిటీతో చేయడం అభినందనీయం.
రామాయణంలోని ప్రధాన ఘట్టాలను కట్టెకొట్టె తెచ్చే అనేలా చూపించారు. కాకపోతే కొన్ని సంఘటనలకు, సన్నివేశాలకు ప్రయారిటీ ఇచ్చారు. డిటెయిల్‌గా చూపించారు. ఎమోషన్స్ ని క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యారు. అదే ఈ సినిమాలో మెయిన్ హైలైట్. యానిమేషన్ క్వాలిటీతోపాటు ఎమోషన్స్ కి కూడా పెద్ద పీఠ వేస్తూ దీన్ని రూపొందించడం విశేషమని చెప్పాలి.
ఇప్పుడు చిన్నప్పుడు యానిమేషన్, కర్టూన్ చిత్రాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా హాలీవుడ్ కార్టూన్ మూవీస్, యానిమేషన్ చిత్రాలకు ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉంది. కోట్లకు కోట్లు వసూలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఇప్పుడు రామాయణం సినిమాతో అటు మన కథలను, మన ఇండియా గొప్పతనం చెప్పడంతోపాటు పిల్లల్ని అలరింపచేయడం కూడా ఈ మూవీ ఉద్దేశ్యం కావడం విశేషం. సింపుల్‌గా రామాయణం గురించి తెలుసుకునేలా తీయడం అభినందనీయం.
ఎందుకంటే రామాయణం అనేది చాలా పెద్ద స్టోరీ. దాన్ని రెండు గంటల్లో చెప్పడం సాధ్యం కాదు, కానీ ఈ మూవీ ద్వారా జపాన్ మేకర్స్ చూపించడం విశేషం. అయితే జపాన్ వాళ్ల వ్యూ కూడా మన ఇండియన్ వ్యూ లాగే ఉండటం మరో విశేషం. అయితే డబ్బింగ్ విషయంలో మరింత క్వాలిటీతోపాటు, పాటలు కూడా తెలుగులోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది.
టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. చాలా అడ్వాన్స్ గానూ ఉంది. ముప్పై ఏళ్ల క్రితం అంటే మన తెలుగు సినిమాల క్వాలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు, కానీ ఇప్పటి జనరేషన్ కి కూడా ఇది పాత సినిమా అనే ఫీలింగ్ లేకుండా ఆ అడ్వాన్స్ టెక్నాలజీతో, వీఎఫ్‌ఎక్స్ తో అంతే క్వాలిటీగా తీయడం ఈ సినిమాలో హైలైట్ పాయింట్. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. అదే సమయంలో చెప్పాల్సిన కథ కూడా సూటిగా, సుత్తిలేకుండా ఉండటం విశేషం. సరదాగా పిల్లలతో కలిసి ఈ మూవీని చూడొచ్చు. పిలలకు చూపించాల్సిన మూవీ కూడా.
read more: `హత్య` మూవీ రివ్యూ.. వివేకానంద రెడ్డిని హత్య చేసింది సొంత కూతురా? జగనా?
also read: `గాంధీ తాత చెట్టు` మూవీ రివ్యూ.. సుకుమార్ కూతురు నటించిన సినిమా ఎలా ఉందంటే?