స్లోగా సాగి..సాగి... : ‘స‌ప్త సాగరాలు దాటి సైడ్‌-బీ’ రివ్యూ

First Published | Nov 17, 2023, 1:13 PM IST

 సైడ్ A తెలుగులో సెప్టెంబర్ 22న రిలీజ్ అవ్వగా తాజాగా నేడు నవంబర్ 17న సైడ్ B సౌత్ లో అన్ని భాషల్లో ఒకేసారి రిలీజయింది. 

Sapta Sagaralu Dhaati Side-B

క‌న్న‌డ హీరో ర‌క్షిత్‌శెట్టి ఒక‌ ప్రక్క మాస్ సినిమాలు చేస్తూనే.. మ‌ధ్య‌ మధ్యలో ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తోనూ మనలని పలకరిస్తున్నారు.డిఫరెంట్ టేస్ట్ తో విభిన్నంగా సాగే ఆయన సినిమాలు తెలుగువారినీ ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో  ఆయ‌న ఈసారి ఓ ప్రేమ‌క‌థ‌ని ఎంచుకుని ‘స‌ప్త‌సాగ‌ర‌దాచే ఎల్లో’ అనే సినిమా చేశారు. క‌వితాత్మ‌క‌మైన ఈ సినిమా తెలుగులో ‘స‌ప్త సాగ‌రాలు దాటి’ (Sapta Sagaralu Dhaati Side-B Movie Review) పేరుతో విడుద‌లైంది. కన్నడంలో సెన్సేషన్ అయిన ఆ చిత్రం తెలుగులో అంతగా పోలేదు. ఓ వర్గానికి మాత్రం బాగా నచ్చింది. ఇప్పుడు ఆ సినిమా సెకండ్ పార్ట్ రిలీజ్  అయ్యింది. ఈ సెకండ్ పార్ట్ ఎలా ఉంది? ఈ మూవీ పంచిన ఫీల్‌ ఏంటి?

స్టోరీలైన్ 

ఫస్ట్ పార్ట్ లో ... హీరో మ‌ను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వ‌సంత్‌)  లవర్స్.. శంక‌ర్ గౌడ (అవినాష్‌) అనే ఇండస్ట్రలియస్ట్  ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు మ‌ను.  ఇక హీరోయిన్ ప్రియ...ఒక‌వైపు చ‌దువుకుంటూనే మ‌రోవైపు సింగర్ అవ్వాలనే ప్రయత్నాల్లో ఉంటుంది. లో మిడిల్ క్లాస్ కు  చెందిన వీళ్లిద్దరూ ఖాళీ దొరికినప్పుడల్లా భ‌విష్య‌త్తు గురించి అంద‌మైన క‌ల‌లు కంటూంటారు. ఇంక   పెళ్లి చేసుకుని, జీవితంలో స్థిర‌ప‌డి పోదాం అని ..డబ్బు కోసం తను చేయని త‌ప్పుని త‌నపైన వేసుకుంటాడు మ‌ను.  ఎవరో చేసిన యాక్సిడెంట్ కేసుని మను(రక్షిత్ శెట్టి) డబ్బుల కోసం ఒప్పుకొని బయటకి వచ్చి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుందామని తన లవర్ ప్రియ (రుక్మిణి వసంత్) ఒప్పుకోకపోయినా జైలుకి వెళ్తాడు. కేసు ఇచ్చిన వాళ్ళు చనిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మను పదేళ్లు జైలులోనే ఉండి బయటకి వస్తాడు. ఈ లోపు ప్రియ ఇంకో పెళ్లి చేసేసుకుంటుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అంటే రెండో పార్ట్ లో చూపించారు..

Latest Videos



ఇక  సప్త సాగరాలు దాటి సైడ్  Bలో...

మను జైలు నుంచి వస్తాడు. ఆ తర్వాత  ఓ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. తన ప్రేయసి  జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో ఆమెని వెతుకుతూంటాడు. మరో ప్రక్క  ప్రియ పెళ్లి చేసుకున్న అతను  బిజినెస్ లో లాస్ అవ్వుతాడు. దాంతో  తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని లాగుతూంటుంది. ఇదంతా మను చూస్తాడు.  తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెడతాడు..అవి ఏమిటి? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? ఈ జర్నిలో  తనకి వేశ్య సురభి(చిత్ర జై ఆచార్) దగ్గరవగా ఆమె కోసం ఏం చేశాడు? జైలు నుండి తనని బయటకి తీసుకురాకుండా వదిలేసిన ప్రభు (అచ్యుత్ కుమార్)కు ఏం శిక్ష విధించాడు..  ?అంతేకాకుండా  జైలులో తనతో గొడవ పడ్డవాళ్ళు బయట కూడా టార్గెట్ చేసినప్పుడు ఏం చేసాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Rakshit Shetty Sapta Sagaradaache ello


విశ్లేషణ

మొదటి పార్ట్ ప్రేమ‌లో ప‌డిన  ఓ జంట భావోగ్వేగ  ప్ర‌యాణ‌ం ప్రధానంగా రూపొందించారు. అంద‌మైన క‌ల‌లు క‌న్న ఆ జంట ప్ర‌యాణాన్ని విధి ఎలా ప్ర‌భావితం చేసింది? అనేది చూపించారు. వాస్తవానికి ఫస్ట్ పార్ట్ లో కథగా పెద్దగా జరిగేది ఏమీ లేకపోయినా  క‌వితాత్మ‌కంగా తెర‌పై చక్కటి విజువల్స్ తో  ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు హేమంత్‌. అది చాలా మందికి నచ్చింది. ముఖ్యంగా  స‌ముద్రంతో ముడిపెడుతూ ఆ క‌థ‌ని చెప్పాడు. స‌ముద్రంలోని ప్ర‌శాంత‌త‌, క‌ల్లోలాలు రెండూ ఈ క‌థ‌లో ఆవిష్కృతమయ్యేలా చేసారు.  ప్రధాన పాత్రలో కనిపించే  ప్రేమ‌జంట మ‌ధ్య కెమిస్ట్రీ, భావోద్వేగాలే ఈ సినిమాకి కీల‌కమైంది. ఇక సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి ఆ స్దాయిలో ఇక్కడ సీన్స్ పండించటానికి కంటెంట్ లేదు.  మరీ ముఖ్యంగా ఈ సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి హీరోయిన్ కు పెళ్లైపోతుంది. కానీ జైలు నుంచి వచ్చిన హీరో పెళ్ళైపోయిన తన మాజీ ప్రేయసి మీద ప్రేమ చావక ఆమె చుట్టూ తిరుగుతూంటాడు. ఆమె సంతోషం కోసం పాటుపడుతూంటాడు. మధ్య మధ్యలో తనకీ పరిస్దితి క్రియేట్ చేసిన వాళ్లపై కాస్తంత రివేంజ్..అంతకు మించి ఏమీ లేదు.అది విసుగ్గా అనిపిస్తుంది. 

Rakshit Shetty


అయితే  దర్శకుడు విజువల్ కు విజువల్ మధ్య ఉండే ఫీల్ ని మాత్రం చాలాజాగ్రత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు.  అవి ఆకట్టుకుంటాయి. నిజానికి రెండు పార్ట్ లు కలిపి ఒకే సినిమాగా వదిలితే బాగుండును అనిపిస్తుంది. ఇంటర్వెల్ దాకా ఫస్ట్ పార్ట్ ..అక్కడ నుంచి సెకండ్ పార్ట్ అయితే మనకు ఇక్కడ వర్కవుట్ అయ్యేది. అలాగే మొదటి భాగం క్లైమాక్స్ చూసేసి...ఇందులో ఈ రెండో పార్ట్ లో రివేంజ్ సీన్స్ భారీ ఎత్తున ఉంటాయి.యాక్షన్ తో అదరకొడతాడు అనకుంటే మనకు నిరాశే ఎదురౌతుంది. ఇక ఈ సైడ్ బి లో వేశ్య పాత్రను తీసుకొచ్చారు. ఆ పాత్ర..దేవదాసుని గుర్తు చేస్తుంది. టోటల్ గా దేవదాసుని దగ్గర పెట్టుకుని చేసినట్లు అనిపిస్తుంది.  ఓవరాల్ గా మన తెలుగువారికి కాస్తంత నలుగుడుపడని కథాంశమే. ఈ సినిమా చాలా సీన్స్  నిదానంగా సాగుతుంటాయి. సెకండాఫ్ కూడా  మ‌రీ భారంగా అనిపించ‌డంతోపాటు, క‌థ కూడా ఏమాత్రం ముందుకు సాగుతున్న‌ట్టు అనిపించ‌దు. ఏదైమైనా ఇంత సాగతీతను భరించే ఓపిక మనవాళ్లకు తక్కువనే చెప్పాలి. ఓటిటిలో వెబ్ సీరిస్ లు చూస్తున్న సమయంలో కాస్తంత స్పీడు పెంచింతే కానీ భరించలేం అనిపిస్తుంది.

Rishab Rukmini

టెక్నికల్  గా చెప్పాలంటే .

మొదటి పార్ట్ ఉన్నంత ఉన్నతంగా సాంకేతికంగా లేదు.  అయితే ఈ పార్ట్ కు కూడా చరణ్ రాజ్ సంగీతం, అద్వైత గురుమూర్తి కెమెరా ప‌నిత‌నం సినిమాకి ప్ర‌ధాన బ‌లం. ప్రేమ‌క‌థ‌కి త‌గ్గ మూడ్‌ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ ప్రేమ కథే లేదు. వార్ వన్ సైడ్ అయ్యిపోయింది. ద‌ర్శ‌కుడు హేమంత్ తాను కమర్షియల్ ఎలిమెంట్స్ వైపుకు  వెళ్ల‌కుండా నిజాయ‌తీగా క‌థ చెప్పే ప్ర‌య‌త్నం చేసాను అనుకున్నారు. కానీ అంత లేదు అని మనకు అనిపిస్తుంది. కొన్ని మనస్సుని తట్టే డైలాగులు,సీన్స్ అక్కడక్కడా మెరుస్తూ  ఆక‌ట్టుకుంటాయి. అయితే అవి వచ్చే సమయానికి మనం ఎలర్ట్ గా ఉండాలి. నిద్రపోకూడదు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. ఎడిటర్ మాత్రం కాస్తంత కనికరం చూపించి మినిమం ఓ అరగంట లేపేస్టే ...ఆ లాగుడు తగ్గుతుందనిపించింది. 

Rakshit Shetty

నటీనటుల్లో ...

ర‌క్షిత్‌శెట్టి ఈ రెండో పాత్రలోనూ అలా ఫీల్ గుడ్ సీన్స్ పండించుకుంటూ వెళ్లారు. రుక్మిణీ వ‌సంత్ కు సీన్స్ తక్కువే. దానికి తోడు  ఇద్ద‌రి జోడీ, వాళ్ల మ‌ధ్య కెమిస్ట్రీ  ఆక‌ట్టుకుంది అనటానికి అసలు జోడినే కాదు.  (Sapta Sagaralu Dhaati Side-B Movie Review). అచ్యుత్ కుమార్, శరత్ లోహితాశ్వ, రమేష్ ఇందిర, గోపాలకృష్ణ దేశ్‌పాండే త‌దిత‌రులు పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.
 

sapta sagaradaache ello


ప్లస్ లు 

+ ఎమోషన్స్ 
+ ర‌క్షిత్‌, రుక్మిణి వ‌సంత్ న‌ట‌న  
+  బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్

మైనస్ లు

పాటలు
స్లో నేరేషన్ 

Rakshit Shetty

ఫైనల్ థాట్...

మన అదృష్టం ఏమిటి అంటే క్యాసెట్ కు A,B అని రెండు వైపులే ఉండటం..లేకపోతే డైరక్టర్ మూడో భాగం కోసం  క‌థ‌ని అట్టి పెట్టుకుందుడు. అప్పుడు మనమంతా  సైడ్-సి పేరుతో విడుద‌ల‌య్యే మూడో  భాగం సినిమా వ‌ర‌కూ ఎదురు చూడాల్సి వచ్చేది. 
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5

sapta sagaradaache yello-Film rakshit shetty


నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, చైత్ర జె అచార్, అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిరా తదితరులు  
ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి
సంగీతం: చరణ్ రాజ్ 
నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వప్రసాద్ 
రచన - దర్శకత్వం: హేమంత్ ఎం రావు
విడుదల తేదీ: నవంబర్ 17, 2023  

click me!