My Name is Shruthi Review: హన్సిక `మై నేమ్‌ ఈజ్‌ శృతి` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Nov 17, 2023, 5:54 AM IST

హన్సిక ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. కానీ ఇటీవల ఆమె జోరు తగ్గింది.  చాలా గ్యాప్‌తో తెలుగులో నటించిన `మై నేమ్‌ ఈజ్‌ శృతి`తో రాబోతుంది. ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్‌ 17)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది  అనేది రివ్యూ(My Name is Shruthi Review)లో తెలుసుకుందాం. 
 

హన్సిక ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. కానీ ఇటీవల ఆమె జోరు తగ్గింది. తమిళంలోకే పరిమితమయ్యింది. అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ తన సత్తాని చాటుతుంది. ఈ నేపథ్యంలో ఆమె తెలుగులో నటించిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `మై నేమ్‌ ఈజ్‌ శృతి`. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సికతోపాటు మురళీ శర్మ, ఆర్‌ నారాయణ్‌, జయప్రకాష్‌, వినోదిని, సాయితేజ్‌, పూజా రాంచంద్రన్‌ ముఖ్య పాత్రలు పోషించారర. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్‌ 17)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది. హన్సిక మెయిన్‌ లీడ్‌గా మెప్పించిందా? సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూ(My Name is Shruthi Review)లో తెలుసుకుందాం. 
 

కథః 
విక్రమ్‌ కంపెనీ అధినేత భార్య ఫేస్‌ డ్యామేజ్‌ కావడంతో స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ చేయాలని భావిస్తారు. అందుకు ఇండియాలోనే ఫేమస్‌ డాక్టర్‌ కిరణ్మయి (ప్రేమ)ని సహాయం కోరతారు. అందుకు భారీగా మనీ ఆఫర్‌ ఇస్తాడు. దీంతో ఆమెకి సరిపడ బ్లడ్‌ గ్రూప్‌, స్కిన్‌ టోన్‌ ఉన్న అమ్మాయిని గుర్తించమని ఆమె స్థానిక ఎమ్మెల్యే గురుమూర్తి(నరేన్‌)కి ఈ పని అప్పగిస్తుంది. అతను అమ్మాయిలను సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో డాక్టర్‌ చెప్పిన డీల్‌ సెట్‌చేసే పనిలో ఉంటాడు. మరోవైపు శృతి(హన్సిక మోత్వాని) హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ కంపెనీలో యాడ్‌ డిపార్ట్ మెంట్‌ పనిచేస్తుంటుంది. ఆమె పేరెంట్స్ బెంగుళూరులో ఉంటారు. శృతి.. చరణ్‌(సాయితేజ)తో లవ్‌లో పడుతుంది. రెగ్యూలర్‌గా అతను తన ఫ్లాట్‌కి కూడా వస్తుంటాడు. అతన్ని గుడ్డిగ నమ్మిన శృతి ప్రేమలో మునిగిపోతుంది. కానీ ఓ రోజు రాత్రి ప్రియుడు చరణ్‌.. తన రూమ్‌లో, రూమ్మేట్‌ అమ్మాయితో బెడ్‌పై చూసి షాక్‌ అవుతుంది. నమ్మించి మోసం చేయడాన్ని తట్టుకోలేకపోతుంది శృతి. అతనిపై దాడి చేసి బాత్‌రూమ్‌లో బంధిస్తుంది. పేరెంట్స్ కబురు మేరకు ఆమె బెంగుళూరు వెళ్తుంది. బెంగుళూరు నుంచి వచ్చాక చూస్తే తన బాత్‌రూమ్‌లో బాయ్‌ ఫ్రెండ్‌కి బదులు డ్రగ్స్ డీలర్‌ అను(పూజా రామచంద్రన్‌) డెడ్‌ బాడీ ఉంటుంది. మరి శృతి ప్రియుడు ఏమయ్యాడు? తన ఫ్లాట్‌లోకి డ్రగ్‌డీలర్‌ ఎలా వచ్చింది? ఈ కేసుకి ఎమ్మెల్యే గురుమూర్తికి ఉన్న సంబంధమేంటి? ఈ కేసుని డీల్‌ చేసిన ఏసీపీ రంజిత్‌(మురళీశర్మ)కి ఎలాంటి నిజాలు తెలిశాయి? ఈ కథకి, స్కిన్‌ డ్రాఫ్టింగ్‌ మాఫియాకి ఉన్నసంబంధమేంటనేది (My Name is Shruthi Review) మిగిలిన కథ. 


విశ్లేషణః

ఇప్పటి వరకు అమ్మాయిల అక్రమ రవాణాపై పలు సినిమాలొచ్చాయి. అందం కోసం పిండాలను అక్రమ సరఫరా చేసే కాన్సెప్ట్ తోనూ `యశోద` వంటి చిత్రాలొచ్చాయి. ఇలా మెడికల్‌ స్కామ్‌పై సినిమాలు వచ్చాయి. కానీ కానీ స్కిన్‌ డ్రాఫ్టింగ్‌కి సంబంధించిన మాఫియాపై సినిమాలు రాలేదనే చెప్పాలి. అందులో `మై నేమ్‌ ఈజ్‌ శృతి` మొదటి మూవీగా నిలుస్తుంది. ఈ కాన్సెప్ట్ ని ఎంచుకున్న మేకర్స్ ని అభినందించాల్సిందే. ఇండియాలో ఇలాంటి మాఫియా కూడా ఉంటుందనే విషయాన్ని చెప్పేందుకు చేసిన ధైర్యాన్ని అభినందించాలి. అదే సమయంలో ఓ కొత్త మాఫియాపై జనాలకు అవగాహన కల్పించడం కూడా ప్రశంసనీయం. 
 

సినిమా పరంగా ఎంచుకున్న కథ బాగుంది. కానీ దాన్ని అంతే బాగా తెరకెక్కించడంలో సక్సెస్‌ కాలేదని చెప్పొచ్చు. ఆకట్టుకునేలా, ఎంగేజ్‌ చేసేలా తెరకెక్కించడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. మొదటి భాగం సినిమా చాలా వరకు కథని ఎస్టాబ్లిష్‌ చేయడానికి, పాత్రలను పరిచయం చేయడానికి తీసుకున్నారు. కథలోకి తీసుకెళ్లేందుకు  ఎక్కువ టైమ్‌తీసుకున్నారు. మర్డర్‌ని రివీల్‌ చేసి, అందులోనే పెద్ద ట్విస్ట్, సస్పెన్స్ తో వదిలేశారు. ఆడియెన్స్ ని ఫల్టీ కొట్టిస్తూ, ఏం జరుగుతుందో (My Name is Shruthi Review) అనే ఆసక్తి, ఎంగేజ్‌ని క్రియేట్‌ చేయగలిగాడు. అయితే అందుకోసం ఎంచుకున్న సీన్లు మాత్రం కాస్త బోరింగ్‌గా అనిపిస్తాయి. ఫ్యామిలీ ఎలిమెంట్లు, వారి మధ్య వచ్చే డిస్కషన్‌ వంటివి కథలో వేగాన్ని తగ్గించాయి. ఇంటర్వెల్‌లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠకి గురి చేసిన తీరు బాగుంది. 

సెకండాఫ్‌లో అసలు కథని రివీల్‌ అవుతుంది. అందులో స్కిన్‌ మాఫియాకి, శృతికి ఉన్న సంబంధాన్ని, దీనికి సంబంధించిన సన్నివేశాలను ఒక్కొక్కటిగా రివీల్‌ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది. చివరికి స్కిన్‌ డ్రాఫ్టింగ్‌ స్కామ్‌కి సంబంధించి శృతి తీసుకున్న డేరింగ్‌ స్టెప్‌, అందుకోసం ఆమె వేసిన ప్లాన్‌, ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ లు కాస్త థ్రిల్‌ చేసేలా ఉన్నాయి. ఊహించని విధంగా ఉన్నాయి. శృతి ప్రేమకి, మెడికల్‌ స్కామ్‌కి, రాజకీయానికి ముడిపెట్టిన తీరు సైతం బాగుంది. అయితే ఇందులో డ్రామా ఎక్కువైంది. మెలోడ్రామా శృతి మించినట్టు అనిపిస్తుంది. అది సినిమాపై ఆసక్తిని తగ్గించేలా ఉంది. ఎంచుకున్న పాయింట్‌ (My Name is Shruthi Review)  చాలా చిన్నదే, కానీ దాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ని ఎంచుకున్న తీరు బాగున్నా, అది అంతగా కన్విన్సింగ్‌గా అనిపించదు. స్లో నెరేషన్‌ కూడా మైనస్‌గా చెప్పొచ్చు. అయితే చాలా వరకు సీన్లు సాగదీతగా అనిపిస్తాయి, వాటిలో సీరియస్‌ నెస్‌ మిస్‌ అయ్యింది. అదే సమయంలో చూపించిన సీన్లే తిప్పి తిప్పి చూపించినట్టు ఉంది. డైలాగ్‌లు అంతగా ఆకట్టుకునేలా లేవు. డబ్బింగ్ సినిమాని తలపించాయి. స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్పింగ్‌గా తీసుకెళ్తే బాగుండేది. దీంతోపాటు ఇన్వెస్టిగేషన్‌ అంశాలను రేసీగా ఉంటే ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తాయి, ఇందులో అది మిస్‌ అయ్యింది. ప్రారంభంలో గురుమూర్తి చంపే సీన్లు కూడా కన్విన్సింగ్‌గా అనిపించలేదు. చాలా టూమచ్‌ అనిపించాయి. ట్విస్ట్ లు కూడా ఆశించిన స్థాయిలో కిక్‌ ఇవ్వలేదు. వీటిపై మరింత దృష్టిపెడితే సినిమా ఫలితం చాలా బాగుండేది. ఓవరాల్‌గా సినిమా సందేశం బాగుంది. కానీ సినిమానే గ్రిప్పింగ్‌గా లేదు.
 

నటీనటులుః 
శృతిపాత్రలో హన్సిక అదరగొట్టింది. ఆమె చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తూనే ఫేస్‌లోనే అనేక భావోద్వేగాలను పలికించడం ఆకట్టుకుంది. సినిమాని సింపుల్‌గా మోసిందని చెప్పొచ్చు. అయితే చివరి ట్విస్ట్ లో ఆమె ఇంకా బాగా చేయాల్సింది. ఆ కిక్‌ తగ్గిపోయింది. ఇక ఎమ్మెల్యే గురు మూర్తి పాత్రలో నరేన్‌ అదరగొట్టారు. ఏసీపీగా మురళీ శర్మ ఈజీగా చేసుకుంటూ వెళ్లారు. శృతి బాయ్‌ ఫ్రెండ్‌గా చరణ్‌ పాత్రలో సాయితేజ్‌ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఒదిగిపోయాడు. శృతి బావ పాత్రలో కమెడియన్‌ ప్రవీణ్‌ ఫర్వాలేదనిపించాడు. అతని పాత్రలోని ట్విస్ట్ బాగుంది. ప్రేమ కాసేపు కనిపించి ఆకట్టుకుంది. డీజీపీగా జయప్రకాష్‌ ఓకే అనిపించాడు. డ్రగ్‌డీలర్‌ గా పూజా  రామచంద్రన్‌ పాత్ర మెప్పిస్తుంది. ఇతర పాత్రలు సైతం ఓకే అనిపిస్తాయి.
 

టెక్నీషియన్లుః 
టెక్నికల్‌గా సినిమా బాగుంది. కిశోర్‌ బోయిడపు కెమెరా వర్క్ సినిమాకి ప్లస్‌ అవుతుంది. సరికొత్త ఫ్రేములను సినిమాలో చూడొచ్చు. విజువల్‌గా ఆకట్టుకుంటుంది. మార్క్ కె రాబిన్‌ సంగీతం సినిమాకి మరో ప్లస్‌. బీజీఎం ఇరగదీశాడు. చాలా సీన్లలో అంత స్టఫ్‌ లేకపోయినా, తన బీజీఎంతో వాటిని ఎలివేట్‌ చేసేలా చేశాడు. ఇలాంటి థ్రిల్లర్‌ మూవీస్‌కి ఉండాల్సిన విధంగా సంగీతం అందించాడు. ఎడిటింగ్‌ పరంగా ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలు కట్‌ చేయోచ్చు. నిర్మాణ విలువలుఓకే అనిపించాయి. ఇక దర్శకుడు శ్రీనివాస్‌ ఓంకార్‌ ఎంచుకున్న కథ బాగుంది. ప్రశంసించేలా ఉంది. కానీ దాన్ని అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో ఆయన పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేదని చెప్పొచ్చు. స్క్రీన్‌ ప్లే విషయంలో మరింత కేర్‌ తీసుకోవాల్సింది. అలాగే ల్యాగ్‌ సన్నివేశాలను తీసేస్తే బాగుండేది. థ్రిల్లర్‌ సినిమాలు రేసీగా ఉంటేనే ఎంగేజ్‌ చేస్తాయి. ఆ విషయంలో మరింత వర్క్ చేస్తే బాగుంటుంది. అయితే సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ లు, ఒక్కొక్కటి రివీల్‌ అవుతున్న తీరు మాత్రం కొంత వరకు అలరిస్తాయి. 
 

ఫైనల్‌గాః సందేశం బాగుంది. కానీ థ్రిల్‌ చేయలేకపోయింది.

రేటింగ్‌ః 2.25


నటీనటులుః హన్సిక మోత్వాని, మురళీ శర్మ, నరేన్‌, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, ప్రవీణ్‌ తదితరులు.

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: జి సుబ్బారావు
పోస్ట‌ర్ డిజైనింగ్‌: విక్ర‌మ్ విజ‌న్స్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్: అమృత బొమ్మి
కాస్ట్యూమ్ ఛీఫ్: స‌ర్వేశ్వ‌ర‌రావు
కో ప్రొడ్యూస‌ర్: ప‌వ‌న్‌కుమార్ బండి
పీఆర్‌వో: మ‌డూరి మ‌ధు, 
సినిమాటోగ్రాఫర్: కిశోర్ బోయిడ‌పు
క‌ళా, ద‌ర్శ‌క‌త్వం: గోవింద్
సంగీతం: మార్క్ కె రాబిన్‌ 
ఎడిటర్: చోటా.కె.ప్రసాద్ 
నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్
దర్శకత్వం: శ్రీ‌నివాస్ ఓంకార్
 

Latest Videos

click me!