#Salaar మూవీ రివ్యూ .. ప్రభాస్ 'ఉగ్ర' రూపస్య...

First Published | Dec 22, 2023, 9:32 AM IST

శత్రువుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సలార్. సలార్‌లో ఫ్రెండ్‍షిప్ కోర్ ఎమోషన్. సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్‌లో సగం కథే చెప్పారు. 

Salaar

బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు  తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.  ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్...అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్ ఆ  సమస్యలను అధిగమించేలా చేసాయి.  ఆ విషయాన్ని  ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ప్రూవ్ చేస్తున్నాయి.   ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నారు అందరూ.   ఖాన్సార్‌ వరల్డ్‌ ఎలా ఉందో చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నవారికి ఎక్సపెక్ట్ చేసిన కిక్ ఇవ్వగలిగిందా..ఈ చిత్రం కథేంటి, ప్రభాస్ కి నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లగలిగిందా వంటి విషయాలు చూద్దాం. 

Prashanth Neels Prithviraj Prabhas film Salaar

స్టోరీ లైన్ 

బర్మా సరిహద్దుల్లోని అసోం దగ్గర బొగ్గు గనుల్లో దేవా అలియాస్ సలార్ (ప్రభాస్) తన తల్లి(ఈశ్వరీరావు)తో కలిసి ఉంటూంటాడు. ఆమె ఓ స్కూల్ అక్కడ పిల్లల కోసం రన్ చేస్తూంటుంది. దేవా అక్కడ మెకానిక్ గా  పనిచేస్తుంటాడు. దేవా తన తల్లి గీసిన గీత దాటడు. ఆమె ఎలా చెప్తే అలానే.  అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న సమయంలో ఆధ్య  (శృతిహాసన్) అమెరికా నుంచి ఇండియాకు తన తల్లి అస్దికులు గంగలో కలపటానికి వస్తుంది. అయితే ఆమెకు లైఫ్ థ్రెట్ ఉంటుంది. ఆ విషయం తెలిసిన ఆమె తండ్రి ఇక్కడకు రావద్దని హెచ్చరిస్తున్నా వినకుండా వస్తుంది. అదే సమయంలో  ఆమెను చంపటానికి ఓబులమ్మ ప్రయత్నిస్తుంది. దాంతో ఆద్యను చంపటానికి  గుంపు బయిలు దేరుతుంది. ఆమెను  కాపాడటం కోసం దేవా ఉన్న ప్రాంతానికి చేరుస్తారు. అక్కడ ఆమె దేవా తల్లి నడిపే స్కూల్ లో టీచర్ గా చేరుతుంది. అయితే అదే సమయంలో ఆమె కోసం వెతుకుతున్న వాళ్లకు ఎక్కడుందో తెలిసిపోయి ఎత్తుకు తీసుకురమ్మని , రక్షించే దేవాని చంపేయమని పురమాస్తారు. అయితే అది వాళ్ల వల్ల కాదు.  అప్పుడు ఓబుళమ్మ యజమాని (శ్రీయారెడ్డి) సీన్ లోకి వస్తుంది. 

Latest Videos


Salaar Movie

ఆద్యను వేసేయమని ని వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)మనుష్యులకు పురమాయిస్తుంది. అప్పుడు దేవా వెళ్లి వరదరాజ మన్నార్ వెహికల్ ని ఆపి,ఆమెను సేవ్ చేస్తాడు. ఈ విషయం వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)కు తెలుస్తుంది. తన వెహికల్ నే ఆపుచేసాడంటే వాడు ఖచ్చితంగా దేవా నే అవుతాడు అంటాడు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు అనే విషయం బయిటకు వస్తుంది. ఖాన్సార్ ప్రాంతం ప్రస్తావన వస్తుంది. అక్కడ ఏం జరిగింది. ఖాన్సార్ కు గతంలో వెళ్లి దేవా ఏం చేసాడు. దేవాకు సలార్ అనే పేరు ఎవరు ,ఎందుకు పెట్టారు. అలాగే ఎండింగ్ లో వచ్చే  శౌర్యంగ పర్వానికి దేవాకు ఉన్న లింకు ఏమిటి? అవన్నీ వదిలేసి  అసోంలో తన తల్లి (ఈశ్వరీరావు)తో కలిసి దేవా ఎందుకు ఉండాల్సి వచ్చింది.  ఆధ్యను దేవా దగ్గరకే ఎందుకు చేర్చారు ? ఖాన్సార్ ప్రాంతం గత చరిత్ర ఏమిటి...  ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సమస్య వచ్చింది. ఖాన్సార్ ప్రాంతంలో యుద్ధ విరమణ (CeaseFire) ఒప్పందాన్ని ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు? ఆ ఓటింగ్ సమయంలోనే  దేవా అక్కడుకి ఎందుకు వచ్చాడు?  వంటి  అనేక  ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే...

ప్రశాంత్ నీల్ తొలి చిత్రం కన్నడ సినిమా ఉగ్రం ప్లాట్ కు తన నెక్ట్స్ చిత్రం కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ ని కలిపి తీసిన చిత్రం ఇది.  ‘కేజీయఫ్‌’లో నరాచీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్‌ నీల్‌.. ‘సలార్‌’తో ఖాన్సార్‌ వరల్డ్‌ని పరిచయం చేసారు. ఆ విషయంలో ఆయన క్రియేటివిటి మెచ్చుకోదగినదే. ఓ కొత్త ఊహాజనిత ప్రపంచం క్రియేట్ చేసి అందులో కథ నడపటం, అక్కడ రూల్స్, చట్టాలు వంటివి ప్రస్తావించటం కొత్తగా అనిపిస్తుంది.  ‘కేజీయఫ్‌’నిజంగా కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఉంది. కానీ ఈ ఖాన్సార్ వరల్డ్ మాత్రం పూర్తి ఊహాజనితమే. ప్రశాంత్ నీల్ రైటింగ్, మేకింగ్ , తో మాయ చేసే ప్రయత్నం చేసారు.  ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ పైనే దృష్టి పెట్టారు. అందుకోసం సెటప్ చేయటంతోనే సీన్స్ నడుస్తూంటాయి.  అలాగే సెకండాఫ్ లో ఖాన్సార్ వరల్డ్ కేజీఎఫ్ ని గుర్తు చేసినా బాహుబలి తరహా డ్రామా నడపటం ప్లస్ అయ్యింది. అయితే యుద్ధ విరమణ (CeaseFire) ఒప్పందాలు వంటివి కాస్త ఇబ్బందిగానే అనిపించాయి. ఎందుకంటే అందులో హీరోకు పెద్దగా ప్రయారిటీ ఉండదు. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కాచుకుని కూర్చున్నట్లుగా హీరో అక్కడ కనపడతాయి.   అయితే ఇక్కడ అభిమానులు దృష్టిలో పెట్టుకుని హీరోని చాలా సేపు సైలెంట్ గా ఉంచి, చుట్టూ దారుణ పరిస్దితులను  సెటప్ చేస్తూ ఛత్రపతి తరహాలో ఒకేసారి యాక్షన్ సీక్వెన్స్ పెట్టి elevation ఇచ్చారు. అయితే అదే నాలుగైదు సార్లు రిపీట్ చేసారు. 
 

కథ స్నేహం చుట్టూ తిరుగుతూంటుంది. స్నేహం కోసం హీరో ఏదైనా చేస్తాడని మనకు చెప్తారు కానీ మనకు ఆ ఎమోషన్ ని పూర్తి స్దాయిలో రిజిస్టర్ చెయ్యలేదు.  ఇక స్క్రీన్ ప్లే పరంగా చూస్తే ప్లాష్ బ్యాక్ సగంలో ఆపుచేసి సినిమా కు ఎండ్ కార్డ్ వేసేసారు. దాంతో కొంత నిరాశ అనిపించినా సెకండ్ పార్ట్ కోసం అలా చేసారు కాబట్టి ఓకే అనిపిస్తుంది.  ఫస్టాఫ్ దేవా, రాజమన్నార్ చిన్నప్పటి స్నేహంతో మొదలెట్టి, కొంత టైమ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వేరే చోట తన తల్లితో ఎక్కడో ఉండటం...ఆమె నువ్వు యాక్షన్ లో దిగటానికి వీల్లేదు అని ఆపటంతో..అంత వైలెంట్ గా ఉండే దేవా అలా ఎందుకు మారాల్సి వచ్చింది...ఆ మధ్యలో ఏం జరిగింది అనే ఆసక్తి ఖచ్చితంగా కలుగుతుంది. అదే ఈ కథకు యూఎస్ పి.  సెకండాఫ్‌లో ఖాన్సార్ గురించి ప్లాష్ బ్యాక్ ...  అధినేత రాజమన్నార్ (జగపతిబాబు)  తమ ప్రాంతాన్ని వదిలి వెల్లటంతో ఆ సింహాసనం కోసం జరిగే కుట్రకలు. అక్కడికి దేవా వెళ్లాల్సి రావటంతో యాక్షన్  పీక్స్ కు తీసుకెళ్లారు.  కథ ఇంటెన్స్‌గా మారుతుంది. 

టెక్నికల్ గా ...

ఈ సినిమా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉందటనంలో సందేహం లేదు. ప్రశాంత్ నీల్ టెక్నికల్ నాలెడ్జ్ మనకు ప్రతీ షాట్ లోనూ కనపడుతుంది.  అంబరీవ్ అందించిన ఫైట్స్ స్పెషల్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..కేజీఎఫ్ స్దాయిలో అనిపించదు. సౌండ్ మిక్సింగ్  ఫెరఫెక్ట్.  ఎడిటర్ సెకండాఫ్ లో కాస్త స్పీడు చేస్తే బాగుండేది. చాలా చోట్ల లాగినట్లు అనిపించింది. కొంత కన్ఫూజన్ కూడా క్రియేట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ పూర్తిగా కేజీఎఫ్ ఫీల్ ని తెచ్చింది. ఆర్ట్ డిపార్టమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాస్ట్యూమ్స్ కూడా కొత్తగా డిజైన్ చేసారు. డైలాగులు కొన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది.  ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మామూలుగా లేవు.  

నటీనటుల్లో ...
ప్రభాస్ మళ్లీ చాలా కాలం తర్వాత తన జానర్ లో వచ్చి ఇరగదీసాడు అని చెప్పాలి. తన స్నేహితుడు కోసం ప్రాణాలైనా పెడతాడు అనే పాత్రలో ఒదిగిపోయాడు. ఇక వరదరాజమన్నార్ గా పృధ్వీ రాజ్ సుకుమారన్ డీసెంట్ ఫెరఫార్మెన్స్ . ఎంత చేయాలో అంత దాకా చేసాడు. ఓవర్ చేయలేదు. కానీ తెలుగు డబ్బింగ్ చెప్పకుండా ఉండాల్సిందేమో. శృతిహాసన్ కు చెప్పుకుటేంత పెద్ద పాత్ర కాదు. ఉందంటే ఉంది. ఆమెను గ్లామర్ యాంగిల్ చూపక పోవటం,పాటలు పెట్టకపోవటం ప్లస్ అని చెప్పాలి. ఇక ఈశ్వరి రావు , జగపతి బాబు , శ్రీయ రెడ్డి , anchor ఝాన్సీ , ఇతరులు ఎవరి పాత్రకి తగ్గట్టు వారి పరిధిలో బాగా నటించారు
 

హైలెట్స్
 
ప్రభాస్ బలం అయిన యాక్షన్ ని సరిగ్గా ఉపయోగించటం
ప్రభాస్ వన్ మ్యాన్ షో
సెకండాఫ్ లో  కోటేరమ్మ కి బలి  సీన్  చివర్లో ” నువ్వు నిజామా కాదా అని తాకి చూస్తున్న” అని ఒకామె వచ్చి ప్రభాస్ ని పట్టుకు చూసే సీన్
 ఖాన్సార్‌ వరల్డ్‌


మైనస్  లు
ఎమోషన్ కనెక్టివిటీ లేకపోవటం

కొన్ని సీన్స్ బాగా మెల్లిగా సాగటం..

యుద్ధ విరమణ (CeaseFire) కాన్సెప్టుని  సరిగ్గా అర్దమయ్యేలా చెప్పకపోవటం

సెకండాఫ్ లో  కేజీఎఫ్ గుర్తుకు రావటం

Salaar: Part 1 – Ceasefire

 ఫైనల్ థాట్
 
 ప్రభాస్ ఎలాంటి సినిమా చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారో వంద శాతం అలాంటి సినిమా .కేజీఎఫ్ కన్నా ముందు వచ్చి ఉంటే ఇంకా ఫ్రెష్ గా ఫీల్ ఉండేది. 

Rating:3
------------సూర్య ప్రకాష్ జోశ్యుల

Salaar


బ్యానర్: హోంబలే ఫిలింస్ 
నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, సప్తగిరి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రీయారెడ్డి, జాన్ విజయ్, ఝాన్సీ, పృథ్వీరాజ్, టిను ఆనంద్ తదితరులు 
సినిమాటోగ్రఫి: భువన్ గౌడ 
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
మ్యూజిక్: రవి బస్రూర్ 
రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్ 
నిర్మాత: విజయ్ కిరంగదూర్ 
రిలీజ్ డేట్: 2023-12-22

click me!