#MacherlaNiyojakavargam: నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ రివ్యూ

First Published | Aug 12, 2022, 1:33 PM IST

 ప్రతీ స్టార్ మాస్ సినిమాలకే మ్రొగ్గు చూపుతారు. మంచి కంటెంట్ ఉంటే  థియేటర్స్ కు కూడా జనం వస్తున్నారని ప్రూవ్ అయ్యింది. ఈ నేపధ్యంలో   హీరో నితిన్  పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’తో మన ముందుకు వచ్చాడు. ఈ నేపధ్యంలో ఈ రోజు ( ఆగస్ట్ 12న) న రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో  చూద్దాం..

Macherla Niyojakavargam


మాస్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు మంచి స్దానమే ఇస్తారు. దాంతో ప్రతీ స్టార్ మాస్ సినిమాలకే మ్రొగ్గు చూపుతారు. మంచి కంటెంట్ ఉంటే  థియేటర్స్ కు కూడా జనం వస్తున్నారని ప్రూవ్ అయ్యింది. ఈ నేపధ్యంలో   హీరో నితిన్  పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’తో మన ముందుకు వచ్చాడు. ఇప్పటికే టీమ్ వదిలిన  ప్రొమోషనల్ కంటెంట్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరో ప్రక్క చిత్రమైన వివాదాలతో ఈ సినిమా సోషల్ మీడియాలో చాలా రోజులు లైవ్ లో ఉంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ( ఆగస్ట్ 12న) న రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో  చూద్దాం..


కథేంటి

గత ముప్పై ఏళ్లుగా  ‘మాచర్ల నియోజకవర్గం’నుండి ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న ఎమ్మెల్యే రాజప్ప (సముద్రఖని). ఆ నియోజకవర్గంలో తనకు ప్రతిపక్షమే లేకుండా చేసి,ఎన్నికలు జరగనివ్వడు. ఎప్పుడూ ఇనానమస్ గా గెలవటమే. తన అంగబలం,అర్దబలంతో నియంతలా పాలిస్తూంటాడు. మాచర్లను శాసిస్తూంటాడు. అక్కడ తన రాజ్యాన్ని స్దాపిస్తాడు. ఎన్నికలు జరపాలని ప్రయత్నించిన కలెక్టర్ ని చంపేస్తాడు. ఎదురుతిరిగిన అధికారులను పైకి పంపిస్తూంటాడు.

మరో ప్రక్క  వైజాగ్‌లో కుర్రాడు సిద్ధు అలియాస్ సిద్ధార్థ్ రెడ్డి (నితిన్) సివిల్స్ పూర్తి చేసి పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉంటాడు. అతన్ని మినిష్టర్ కుమార్తె ఝాన్సి (క్యాథరిన్ ట్రెసా) ప్రేమిస్తుంటుంది. కానీ అతను మాత్రం అదేమీ పట్టించుకోకుండా  వైజాగ్ బీచ్‌లో  కనిపించిన స్వాతి (కృతి శెట్టి)  తో ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను చెప్పి ఒప్పించాలనుకునేలోపు ఆమె వెళ్లిపోతుంది. స్వాతిని వెతికి, దగ్గర అవుదామనుకూంటే రాజప్ప కొడుకు వీర ..ఆమెను చంపటానికి ప్రయత్నిస్తాడు. సిద్దు కాపాడతాడు. 

Latest Videos


ఈలోగా గుంటూరుకి  కలెక్ట్ గా  సిద్దు (నితిన్) కు పోస్టింగ్ వస్తుంది. డైనమిక్ గా ఉన్న అతను కొన్ని ప్రత్యేకపరిస్దితుల్లో రాజప్ప గురించి తెలుసుకుంటాడు. అతని సామ్రాజ్యాన్ని కూలుస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత సిద్దు కు అర్దమవుతుంది. తాను ఢీ కొట్టింది కొండని అని. ఆ ఛాలెంజ్ కు రాజప్ప తీవ్రంగా స్పందిస్తాడు. అక్కడ నుంచి ఎత్తుకు, పై ఎత్తులతో ఇద్దరి మధ్యా యుద్దం మొదలవుతుంది. చివరకు సిద్దు ఎలా గెలిచాడు, స్వాతి (కీర్తి శెట్టి)ని రాజప్ప కొడుకు ఎందుకు చంపుదామనుకున్నాడు..ఆమె గతం ఏమిటి... చివరకు ఏమైంది...ఆ నియోజక వర్గంలో ఎలక్షన్స్ మళ్లీ జరిపించారా ? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


ఎనాలసిస్...

తెలుగు సినిమా కోవిడ్ తర్వాత మారింది...మారుతోంది..మారని సినిమాలకు మరుభూమి అంటోంది. అయితే ఇంకా కొందరు దర్శకుడు అవేమీ తమకు సంభందం లేదన్నట్లుగా పాతకాలం కథలు రెడీ చేసుకుని హీరోలను ఒప్పించి థియేటర్ లోకి తమ సినిమాలు దింపుతున్నారు. కానీ అవి ట్రైలర్ నాడే జనం పసిగట్టేస్తున్నారు. అక్కడ దాటితే మార్నింగ్ షోకే మ్యాటర్ ఇదీ అర్దం చేసుకుని ప్రచారం చేసేస్తున్నారు. ఈ డైరక్టర్..ఎడిటర్ గా ఎంతో పేరున్నవాడు. అయితే తన తొలి సినిమాని పక్కా మాస్,కమర్షియల్ గా చేయాలని ఇరవై ఏళ్ల నుంచి వస్తున్న సినిమాల్లో సీన్స్ ని ముందేసుకుని కథ రెడీ చేసుకున్నాడు. అంతా మూస వ్యవహారమే. హీరో,హీరోయిన్స్, విలన్ ఇలా వరస పెట్టి కంటిన్యూ ట్రాక్ లు వస్తూంటాయి. విలనిజం కూడా ఎప్పుడో ముగిసిపోయిన వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లు అనిపిస్తుంది. కథకేముంది ఏ కథ కొత్తది అంటే...దాని స్క్రీన్ ప్లే, ప్రెజంటేషన్ అయినా కొత్తగా ఉండేలా సాధారణంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ అదీ పాత వాసనే కొడుతూంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని దర్శకుడు భావించాడేమో కానీ చూసేటప్పుడు చాలా ప్రెడిక్టుబుల్ గా నడుస్తూంటే విసుగొస్తుంది. ఎప్పుడో తీసి ప్రక్కన పెట్టేసిన సినిమా ఇప్పుడు రిలీజ్ చేసారా అని డౌట్ వస్తూంటుంది.  కమర్షియల్ సినిమాల మీద ప్యారెడీ తీసారా అనిపిస్తూంటుంది. స్క్రీన్ ప్లే గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ తప్ప మరేమీ లేదు. సెకండాఫ్ లో అదీ లేదు..క్లైమాక్స్ అయితే  పరమ ప్రెడిక్టబుల్ . 
 

బాగున్నవి: 

వెన్నెల కిషోర్ కామెడీ
జాతర ఫైట్
రాను రాను సాంగ్


బాగోలేనివి:

కథ,స్క్రీన్ ప్లే
లెంగ్తీగా మారిన యాక్షన్ ఎపిసోడ్స్
రన్ టైమ్ ఎక్కువగా ఉండటం 
 

 
 టెక్నికల్ గా ....

దర్శకుడు గా రాజశేఖర్ రెడ్డి మారుతున్న తెలుగు సినిమా పరిణామక్రమాన్ని గమనిస్తున్నట్లు లేరు...పరమ రొటీన్ కథ,కథనాన్ని ఎంచుకోవటంతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాసం కనపడలేదు.  పాతదాన్ని అంతే పాతగా ప్రెజెంట్ చేసారు. డైరక్టర్ కు  తగ్గట్లే టెక్నీషియన్స్ అందరూ టిపికల్ కమర్షియల్ రూటులో ప్రయాణం పెట్టుకున్నారు. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ పాటల్లో  ఇప్పటికే  చార్ట్ బస్టర్ గా నిలిచిన ‘రారా రెడ్డి’, ‘రాను రాను’ సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం...థమన్ ని అనుకరిస్తున్నట్లు గా బాగా లౌడ్ గా ఉంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి జస్ట్ ఓకే.  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ ల్యాగ్ లు లేకుండా బాగుంది. అయితే రన్ టైమ్ తగ్గించాల్సింది. 
 

రైటింగ్ విషయానికి వస్తే పైనే చెప్పుకున్నట్లు పరమ రొటీన్ వ్యవహారం. ఆ సీన్స్ కు తగినట్లే మామిడాల తిరుపతి డైలాగ్స్ ఉన్నాయి. ఒక్కటీ గుర్తు పెట్టుకునే డైలాగు లేదు.  సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ కొన్ని సీన్స్ లో బాగా హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.... ఈ చిత్రానికి పనిచేసిన  ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ , అనల్ అరసు ల గురించి భారీ యాక్షన్ పార్ట్స్ ని, అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ లని అందించారు. అయితే ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ని సపోర్ట్ చేసే స్దాయిలో సీన్స్ అయితే లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.    


నటీనటుల్లో ... నెరిసిన జుట్టు, మెలితిరిగిన మీసం, నుదిటిన తిలకం, మెడలో రుద్రాక్షమాలతో వింటేజ్ పొలిటిషియన్ లుక్ లో  సముద్ర ఖని డిఫరెంట్ గా ఉన్నారు. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ కొత్తగా అనిపించకపోయినా నవ్వించింది. నితిన్ ఎప్పటిలాగే చేసుకుంటూ పోయారు.    స్పెషల్ సాంగ్  ‘రారా రెడ్డి’ లో నితిన్, అంజలి ల కెమిస్ట్రీ, మాస్ డ్యాన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కృతి శెట్టి ఓకే. కేథరిన్ థ్రెసా గురించి అయితే  చెప్పుకోవటానికి ఏమీ లేదు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మాజీ, మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, శ్యామల వంటి వారు  సినిమా చేస్తున్నాం కాబట్టి చేసాం అన్నట్లు  కనపడి వెళ్లిపోతారు.

ఫైనల్ థాట్

 థియేటర్ కు సినిమా చూడటానికి కాకుండా నిద్రపోవటం, సెల్ చూసుకోవటం వంటి రకరకాల వేరే పనులు మీద వస్తే ఖచ్చితంగా నచ్చుతుంది
---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2/5


బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, అంజలి (స్పెషల్ సాంగ్), వెన్నెల కిషోర్,  రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మాజీ, మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, శ్యామల తదితరులు
 సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్ : మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్, రవివర్మ, అనల్ అరసు
రన్ టైమ్ : 160 నిముషాలు
రచన, దర్శకత్వం:  ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి
సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
విడుదల తేదీ: ఆగస్ట్ 12, 2022
 

click me!