నిఖిల్ నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’ రివ్యూ

First Published | Jun 29, 2023, 12:43 PM IST

 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించిన ఫైల్స్ గురించి ఈ సినిమా కాన్సెప్ట్ అని చెప్పిన దగ్గరనుంచి.. సినిమాకు ఎక్కడలేని బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈ క్రేజ్ ను నిఖిల్ & టీం సరిగా వినియోగించుకోగలిగారా?

Spy

ఈ మధ్యన  RAW ఏజెన్సీ కు చెందిన కథలుకు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. సినిమా గూఢచారులు రకరకాల కేసులు డీల్ చేయటానికి ఉత్సాహపడుతున్నారు. మొన్నీ మధ్యనే అఖిల్ ... ఏజెంట్ అంటూ వచ్చాడు. అంతకు ముందు అడవి శేషు గూఢచారి అంటూ పెద్ద హిట్ కొట్టారు.  షారూఖ్ ఖాన్ పఠాన్ అన్నాడు.ఈ క్రమంలో నేను సైతం ఓ గూఢచారి చిత్రం చేస్తాను అని నిఖిల్ ముందుకు వచ్చాడు. మరి ఈ గూఢచారి పఠాన్ లా భాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోతాడా లేక...అఖిల్ ఏజెంట్ లా వెనక్కి వెళ్లిపోతాడా ...ఏమిటి ఈ స్పై కథ, సినిమాలో రానా పాత్ర ఏమిటి  అనేది చూద్దాం  

స్టోరీ లైన్:

రీసెర్చ్ అనాలసిస్ వింగ్-రా ఏజెంట్ జే (నిఖిల్ ) . జేమ్స్ బాండ్ లా అతను ఎప్పుడు దేశాలు తిరుగుతూ కుట్రలు ఛేదిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి ఓ పని అప్పచెప్తారు రా చీఫ్ శాస్త్రి (మకరంద్ దేష్ పాండే). అదేమిటంటే గ్లోబల్ టెర్రరిస్ట్ ఖదీర్ ఖాన్‌(నితిన్ మెహతా)ని ట్రేస్ చేసి  చంపేయమని.   ఆ ఆపరేషన్ లీడ్ చేస్తున్న టైమ్ లో.. తన అన్నయ్య  సుభాష్ వర్ధన్(ఆర్యన్ రాజేష్ ) మరణానికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు జైకి తెలుస్తాయి. అతను గతంలో రా ఏజెంట్ గా చేసిన వాడే. వాటిని ఛేజ్ చేసే పనిలో ఉండగా మరో విషయం తెలుస్తుంది. రా హెడ్ క్వార్ట్రర్స్ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైల్ మిస్ అయ్యిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. తన పర్శనల్ ఎజెండా తన అన్నయ్యను చంపిన వారిని తెలుసుకుని పగ తీర్చుకోవటం. అలాగే అఫీషియల్ ఎజెండా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైల్ ని వెనక్కు తేవటం. అయితే ఇప్పుడా ఫైల్ లో ఏముంది..విలన్స్ ఆ ఫైల్ ని లేపేసి ఇప్పుడేం చేయబోతున్నారు? అసలు విలన్స్ ఎవరు అనేదే సినిమా కథ. 


విశ్లేషణ:

సాధారణంగా స్పై సినిమాలు ఎక్కువ డిపెండ్ అయ్యేది  wow ఎలిమెంట్స్ మీదే. కొత్త విషయాలు, కొత్త లొకేషన్స్, కొత్త కాంప్లిక్ట్ లు డీల్ చేస్తూంటే ఆటోమేటిక్ గా wow ఎలిమెంట్ వర్కవుట్ అయ్యిపోతూంటాయి.ఈ  సినిమాకు తీసుకున్న కీ  పాయింట్ సుభాష్ చంద్రబోస్ మిస్టీరియస్ డెత్.  స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 1945లో విమాన ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆ ప్రమాదంలో ఆయన చనిపోలేదని మిస్ అయ్యాడని .. ఆయన మరణం చుట్టూ చాలా మిస్టరీ ఉంది. ఈ విషయాన్నే పట్టుకుని తమ స్క్రిప్టులో తెచ్చామని మనకు ప్రమోషన్ లో మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అదే బ్యాంక్ చేసుకుని ఆ ఇంట్రస్టింగ్ విషయం ఏమిటో తెలుసుకుందామని మనం చూడ్డానికి వెళ్తాం. అయితే ఈ ఎలిమెంట్ సినిమాలో చిన్న పాయింట్ మాత్రమే. అది సమగ్రంగా ఉండదు. ఆ పాయింట్ ఎక్కడో సెకండాఫ్ లో వచ్చేదాకా వెయిట్ చేయాలి. మరో విషయం ఏమిటంటే..పబ్లిసిటీలో చేసినంత మేరకు కూడా ఆ పాయింట్ సినిమాలో ఉండదు. సుభాష్ చంద్రబోస్ గురించి ఏదన్నా చెప్తారేమో..ఆ సీక్రెట్స్ ఏమన్నా టచ్ చేసారేమో అని ఆశిస్తే మనకు నిరాశమిగులుతుంది. కేవలం పబ్లిసిటీ కు మాత్రమే సుభాష్ చంద్రబోస్ ని వాడారని అర్దమవుతుంది. 

సరే ఆ విషయం ప్రక్కన పడితే   సినిమాలో China Vs India యుద్దం రాబోతోందని, టెర్రరిస్ట్ మిస్సైల్స్ , ఇజ్రాయిల్ గూఢచారి వ్యవస్ద  'మొసాద్‌'  గురించి ఇలా చాలా పెద్ద విషయాలు ప్రస్తావన తో మాట్లాడుతూంటారు. కానీ తెరపై జరిగేదంతా  గల్లీ లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది.  అసలు విలన్ ఎవరో తెలిసేటప్పటికే సినిమా మూడు వంతలు అయ్యిపోతుంది. ఆ విలన్ ని ఎదుర్కోవటం క్లైమాక్స్ .అదీ మిస్టర్ ఇండియా టైమ్ నాటి క్లైమాక్స్..విలన్ మిస్సైల్ వదులుతూంటే...హీరో ఆపటం.ఇలా తాము విన్న, చూసిన, తెలుసుకున్న  మొత్తం మెటీరియల్ ఒకే సినిమాలో వాడేయాలన్న తపనే తప్పించి కథను ఇంట్రస్టింగ్ గా చెప్పాలి అనే విషయం కనపడదు. చాలా ట్విస్ట్ లు పేపరుమీద పండి ఉంటాయి. అవన్నీ ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యాయి.స్పై సినిమాలకు చాలా స్మార్ట్ గా ఉండాలనే విషయం మరో సారి ఈ చిత్రం గుర్తు చేస్తుంది.

టెక్నికల్ గా...

కొన్నిచోట్ల  మేకింగ్ బాగున్నప్పటికీ ..కీ సీన్స్ తేలిపోయాయి. అయినా స్పై సినిమా అయినా మరొకటి అయినా బోర్ కొట్టకుండా అర్దమయ్యేటట్లు చెప్పాలనే విషయం సీనియర్ ఎడిటర్ అయిన దర్శకుడు గుర్తు పెట్టుకోకపోవటం విచిత్రం. అయితే ఛేజింగ్ సీక్వెన్స్ లు బాగా తీసారు.ఇక  శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు ఓకే. కథ,కథనాలే బాగోలేదు. డైలాగులు అలాగే ఉన్నాయి. ఇక ఇలాంటి సినిమాకు అవసరమైన సినిమాటోగ్రఫీ వర్క్ కుదిరింది.  విఎఫ్ ఎక్స్ ఇంకాస్త క్వాలిటీ ఉండాలి.   సబ్జెక్ట్ మీద మంచి రీసెర్చ్ చేసారు కానీ దాన్ని కథగా మార్చుకోవటంలో ఫెయిల్ అయ్యారు.  

Spy Movie Review

నటీనటులు..

విభిన్నమైన కథ చేయాలని నిఖిల్ ఈ సినిమాని ఓకే చేసినట్లున్నారు. అతను పాత్రకు న్యాయం చేసారు.  బాడీ లాంగ్వేజ్ కూడా ఫెరఫెక్ట్.  ఎమోషనల్ సీన్స్ లో నిఖిల్ పరిణితి కనపడుతుంది. రా చీఫ్ శాస్త్రిగా మకరంద్ దేశ్ పాండే కొత్తగా అనిపించాడు. జుట్టు లేకుండా కనిపిస్తాడు.  ఐశ్వర్యమీనన్ ను కథలో భాగంగా ఉంది.  ఆర్యన్ రాజేష్ ది గెస్ట్ రోలే. సినిమా ఫన్ పార్ట్ ని అభినవ్ తీసుకున్నాడు. జిషు సేన్ గుప్తా, రవివర్మ, నితిన్ మెహతాలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
 

Spy, Rana

రానా ఎలా చేసారు
రానా ఉన్నది కొద్దిసేపే అయినా మంచి ఇంపాక్ట్ కలగ చేసారు. రానా ఉన్న కాసేపు మిగతా పాత్రలు నామ మాత్రమైపోయాయి. రానా మళ్లీ ఏ చివర్లో అయినా కనపడుతాడేమో అని ఆశిస్తాం. `పఠాన్`లో సల్మాన్ లాగ కనపడితే బాగుండేది.  

ప్లస్ లు :
నేతాజీ సీన్స్ 
బ్యాగ్రౌండ్ స్కోర్ 
  యాక్షన్ సీక్వెన్స్


మైనస్ లు :
 సినిమాలో హై ఇచ్చే సీన్స్ లేకపోవటం
తెరపై పేలని ట్విస్ట్ లు, టర్న్ లు
ప్లాట్ గా సాగే స్క్రీన్ ప్లే 
 స్పై సినిమాలు డిమాండ్ చేసే స్దాయిలో డైరక్షన్ లేకపోవటం


ఫైనల్ థాట్ :
ప్రతిష్టాత్మకమైన  Raw ఏజెంట్ అంటే  రా ఫుడ్ ఏజెన్సీ తీసుకుని ఊరూరే తిరిగేవాడిలాగ  ఉంటే ఎలా.. ?   ఓ ప్రక్కన  స్పైల చుట్టు తిరిగే కథలతో ఓటిటి వెబ్ సీరిస్ లు అద్బుతంగా వస్తున్నాయి. మరో ప్రక్క పఠాన్ వంటి స్పై సినిమాలు ఎవరెస్ట్ లా కనపడుతుంటే.. వాటికి పోటీ ఇవ్వకపోయినా ప్రక్కన అయినా నిలబడాలి కదా.

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2.5 

బ్యానర్: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యమీనన్, రానా దగ్గుబాటి, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్, సన్య థాకూర్, మక్రంద్ దేశ్ పాండే, జిస్సు సేన్ గుప్తా, నితిన్ మెహ్తా, రవి వర్మ, కృష్ణ తేజ, ప్రిష సింగ్, సోనియా నరేష్, తదితరులు.
 డీఓపీ:  వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
రచయిత: అనిరుధ్ కృష్ణమూర్తి
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
ఆర్ట్: అర్జున్ సూరిశెట్టి
దర్శకుడు & ఎడిటర్: గ్యారీ బీహెచ్
కథ & నిర్మాత: కే రాజశేఖర్ రెడ్డి
విడుదల తేదీ:  29-06-2023
 

Latest Videos

click me!