నందమూరి బాలకృష్ణ కుమార్తె మరోసారి సర్ప్రైజ్ చేసింది. ఆమె తన మొట్టమొదటి యాడ్ లో నటించింది. ఓ జ్యువెలరీ బ్రాండ్ కోసం నటించిన యాడ్ లో తేజస్విని అదరగొట్టింది.
బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. బాలకృష్ణ సినిమాల్లో కూడా తేజస్విని ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆమె ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. తేజస్విని పూర్తి స్థాయి నిర్మాతగా టాలీవుడ్ లో ప్రయాణం మొదలుపెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త విశాఖపట్నం ఎంపీ భరత్ అనే విషయం తెలిసిందే. తేజస్విని రాజకీయాల వైపు కాకుండా సినిమా రంగంలో తన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
25
తేజస్విని ఫస్ట్ యాడ్
తాజాగా నందమూరి తేజస్విని తన తొలి యాడ్ లో నటించారు. సిద్దార్థ జ్యువెలర్స్ బ్రాండ్ కోసం ఆమె వాణిజ్య ప్రకటనలో నటించారు. ఆ యాడ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ యాడ్ కోసం తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, ఇతర టాప్ టెక్నీషియన్స్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందుకే యాడ్ క్వాలిటీ అద్భుతంగా వచ్చింది.
35
అందంగా మెరిసిన నందమూరి తేజస్విని
ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మెస్మరైజ్ చేస్తోంది. తళతళ తార అంటూ బ్యాగ్రౌండ్ లో వచ్చే సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. దీనితో తోడు తేజస్విని అందమైన లుక్స్ యాడ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లాలి. ఆమెని మూడు రకాల లుక్స్ లో ఈ యాడ్ లో ప్రజెంట్ చేశారు. మోడ్రన్ లుక్ లో స్టైలిష్ గా ఉంది. ఆ తర్వాత లెహంగాలో గ్లామరస్ గా మెరిసింది. చివర్లో సాంప్రదాయ బద్దంగా చీరకట్టులో సైతం ఆకట్టుకుంది.
నా నమ్మకం, నా విశ్వాసం, నా సంతోషం.. సిద్దార్థ అంటూ డైలాగులు కూడా చెప్పింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా నందమూరి తేజస్విని అదరగొట్టేసింది. దీనితో క్షణాల్లో ఈ యాడ్ వైరల్ గా మారింది.
55
యాడ్ కి పనిచేసిన టెక్నీషియన్లు
ఈ యాడ్ ని యమున కిషోర్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం, అయనంక బోస్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అందించారు. ఇలాంటి టాప్ టెక్నీషియన్లు పనిచేయడం వల్ల నందమూరి తేజస్విని ఫస్ట్ యాడ్ మెమొరబుల్ గా మారిపోయింది.