అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' రివ్యూ

First Published Jan 12, 2020, 12:54 PM IST

'అజ్ఞాతవాసి ' తర్వాత త్రివిక్రమ్ పై అంచనాలు అంతరించిపోయాయి. దాంతో ' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'  తేడా కొట్టాక అల్లు అర్జున్ పోయి పోయి త్రివిక్రమ్ తో ఏం చేద్దామని చాలా మంది అనేసారు. అయితే టాలెంట్ అనేది ఓ సినిమా ప్లాఫ్ తో పోయేది కాదు..ఓ సినిమా హిట్ తో వచ్చేది కాదు..అని ఇద్దరికి తెలుసు. అందుకే 'అల' కోసం ఇద్దరూ కష్టపడటం మొదలెట్టారు. రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ట్రైలర్ క్లిక్ అవ్వలేదు. దానికి తోడు  ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ 1958లో నటించిన ఇంటిగుట్టు అనే సినిమా కథను పోలి ఉంటుందని టాక్ మొదలైంది.

---సూర్య ప్రకాష్ జోశ్యుల
 

'అజ్ఞాతవాసి ' తర్వాత త్రివిక్రమ్ పై అంచనాలు అంతరించిపోయాయి. దాంతో ' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తేడా కొట్టాక అల్లు అర్జున్ పోయి పోయి త్రివిక్రమ్ తో ఏం చేద్దామని చాలా మంది అనేసారు. అయితే టాలెంట్ అనేది ఓ సినిమా ప్లాఫ్ తో పోయేది కాదు..ఓ సినిమా హిట్ తో వచ్చేది కాదు..అని ఇద్దరికి తెలుసు. అందుకే 'అల' కోసం ఇద్దరూ కష్టపడటం మొదలెట్టారు. రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ట్రైలర్ క్లిక్ అవ్వలేదు. దానికి తోడు ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ 1958లో నటించిన ఇంటిగుట్టు అనే సినిమా కథను పోలి ఉంటుందని టాక్ మొదలైంది.ఆ సినిమాలో హీరో గొప్పింట్లో జన్మించినా పిల్లలు మారడంతో అతడు పేదింట్లో పెరుగుతాడు. చివర్లో మళ్లీ అతడి అసలు తల్లిదండ్రుల చెంతకు చేరి,అక్కడున్న కొన్ని సమస్యలు తీరుస్తాడు. దాంతో ఇది పాత చింతకాయ పచ్చడే అని అనేయటం మొదలెట్టారు. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం కథేంటి..నిజంగానే ..ఇంటిగుట్టు నుంచి స్టోరీ లేపారా...బన్నికు,త్రివిక్రమ్ కి కావాల్సిన సాలిడ్ హిట్ దొరికినట్లేనా..సంక్రాంతి వీరిద్దరిలో ఆనందం నింపుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
undefined
కథేంటి :వాల్మీకి (మురళి శర్మ) తనకు పుట్టిన  బిడ్డను తన మిలియనీర్ బాస్ రామచంద్ర (జయరామ్) బిడ్డతో మార్చేస్తాడు. ఆ మార్పిడి విషయం తెలిసిన నర్స్ కోమాలోకి వెళ్లిపోయింది. ఇరవై ఏళ్ల తర్వాత రాజ్ (సుశాంత్) చాలా లావిష్ గా పెరుగుతూంటే.. బంటు (అల్లు అర్జున్) మిడిల్ క్లాస్ లో మనుష్యులను,సమస్యలను మేనేజ్ చేస్తూ ఎదుగుతూంటాడు. బంటు టూరిజం కంపెనీలో జాబ్ కు జాయిన్ అవుతాడు. అతని బాస్ అమూల్య (పూజ హెడ్గే). వాళ్లిద్దరూ ప్యారిస్ ఓ ఎస్సైన్మెంట్ కోసం వెళ్తాడు. మెల్లి మెల్లిగా ఆమెతో  సామజవరగమన అనేస్తాడు. అయితే అమూల్యని రాజ్ (సుశాంత్)కు ఇచ్చి చేయాలని పెద్దవాళ్లు ప్రయత్నాలు చేస్తూంటారు.
undefined
మరో ప్రక్క విలన్ సముద్ర ఖని, తన కొడుకు గోవిందుతో కలిసి జయరామ్ కంపెనీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు పన్నుతూంటాడు. సుశాంత్ కు దాన్ని అడ్డుకునే శక్తి ఉండదు. అలాగే జయరామ్ కు భార్య టబు కు మధ్య రిలేషన్ సమస్యలు ఉంటాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు తను పుట్టినప్పుడు జరిగిన బిడ్డల మార్పిడి రహస్యం తెలుస్తుంది. అప్పుడు అలవోకగా వైకుంఠపురములో (ప్యాలెస్ పేరు)లో ఎంట్రీ ఇస్తాడు. అక్కడ నుంచి ఏం జరిగింది. తన నిజ తల్లి,తండ్రుల మధ్య ఉన్న సమస్యలు ఎలా తీర్చాడు..తన కంపెనీని ఎలా సేవ్ చేసుకున్నాడు..తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు...తనను పెంచిన తండ్రి మురళి శర్మను ఏం చేసాడు...సుశాంత్ పరిస్దితి ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
undefined
ఆ కాలం నాటి కథతో... అలనాటి కథలను,సీన్స్ ని ఈ కాలంలోకి మార్చటం త్రివిక్రమ్ కు పెన్నుతో పెట్టిన విద్యం. లేకపోతే అప్పుడెప్పుడో దాదాపు డబ్బై ఏళ్ల క్రితం తెలుగులో వచ్చిన ఇంటిగుట్టు సినిమాని గుట్టు బయిటకుండా ఆర్డర్ వేసి, బయిటపడాలనుకోవటం ఏమిటి...ఈ రోజుల్లో ఇలా పిల్లల మార్పిడి మీద కథ రాయాలనుకోవటం ఏమిటి.. రాసారో అనుకోండి...ఆ స్టోరీ లైన్ బలంగా ట్రీట్మెంట్ చేసుకోవాలనే ఆలోచన రాకపోవటం ఏమిటి...ఎంతసేపూ ఒకే ఇంట్లో కథను తిప్పేయాలనే తాపత్రయమే తప్ప ఆ సీన్స్ లో ఎంత విషయం ఉందని చూసుకోరా. ఇంకా ఈ రోజుల్లో గోడ వెనక ఉండి నిజాలు వినేసే కీలకమైన సీన్స్ ఏమిటి. త్రివిక్రమ్ వంటి టాలెంట్ ఉన్న దర్శకుడు చేయదగ్గ సినిమా కాదనిపించింది.
undefined
ఆయన డైలాగులు ఎంత బాగున్నాయో..కథనం అంత విసుగెత్తించింది. నవ్వులు లేవు అని కాదు..కానీ పగలబడి నవ్వేటంత సీన్ లేదు. కథే కృత్రిమంగా అనిపించటంతో డెప్త్ గా ఎక్కగా అనిపించలేదు. అయినా మిడిల్ క్లాస్ మనుష్యులను విలన్ గా చూపెట్టి వాళ్ల సానుభూతి కోల్పోవటం తప్ప.ఇక కథ ప్రెడిక్టబుల్ గా ఉన్నా క్లీన్ గా, క్లాస్ గా ప్రెజెంట్ చేయటంతో డీసెంట్ గా సినిమా నడిచిపోయింది.  ఇంట్లో దీపం పెడితే అది ఒక్క ఆ ఇంటికే , అదే గుడిలో పెడితే ఊరంతటికి ‘ ‘ చేతిలో చిల్లర లేదు , పెద్ద నోటు ఏమో ఇవ్వలేను ‘ వంటి డైలాగులతో సినిమాని త్రివిక్రమ్ లాగేసే ప్రయత్నమైతే చేసారు.
undefined
అయితే సెకండాఫ్ లో అసలు విషయం ఏమీ లేకపోవటం, విలన్ కు హీరోకు మధ్య కాంప్లిక్ట్ సరిగ్గా లేకపోవటం..విలన్ కు ఫలానా వాడే హీరో అని తెలిసే సరికే సినిమా క్లైమాక్స్ కు వచ్చేయటం వంటివి నీరస పరిచారు.అల్లు అర్జున్ ని ప్యాసివ్ హీరోగా ప్రెజెంట్ చేయటంతో చాలా సీన్స్ చప్పగా సాగాయి.
undefined
బన్నీ , మిగతావాళ్లు ఎలా చేసారంటే.. అల్లు అర్జున్ తన యాటిట్యూడ్, స్టైల్, కామెడీతో పాత కథ అనే విషయాన్ని చాలా వరకూ దాయగలిగాడు. పూజ హెడ్గే ని కేవలం గ్లామర్ కే ఉపయోగించుకున్నారు. టబుకు పెద్దగా పాత్ర లేదు. సుశాంత్ సినిమా అంతా కనిపిస్తూనే ఉంటాడు కానీ డైలాగులు,నటన తక్కువ. జయరామ్ ఓకే. సునీల్ పాపం మరోసారి కలిసిరాని పాత్రలో కనిపించారు. మురళి శర్మ బ్రిలియెంట్ గా చేసారు. ఎ, మల్టిఫ్లెక్స్ సెంటర్లలలో బాగా నడిచేటట్లు ఉన్న ఈ సినిమా బి,సిలలో ఏ విధంగా వర్కవుట్ అవుతుందో చూడాలి.
undefined
మ్యూజిక్ మిగతా డిపార్టమెంట్ ? ఈ సినిమా రిలీజ్ కు ముందే పాటలు సూపర్ హిట్. రాములో రాముల‌, బుట్ట‌బొమ్మ సాంగ్స్ విన‌డానికే కాదు.. చూడ‌టానికి కూడా చక్కగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్. టెక్నికల్ గా బ్రిలియెంట్. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. ఎడిటింగ్ మరింత క్రిస్పుగా చేయచ్చేమో. డైలాగుల్లో కనపడ్డ బ్యూటీ స్క్రిప్టు లో మిస్సైంది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా డిఫరెంట్ గా ఉంది. సామజవరగమన పాట ఇంకొంచెం బాగా తీసి ఉండాల్సింది. మిగతా డిపార్టమెంట్స్ కూడా అప్ టుది మార్క్ ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అధ్బుతం కాదు కానీ బాగున్నాయి.
undefined
హిట్లు : అల్లు అర్జున్, పాటలు, త్రివిక్రమ్ డైలాగులు
undefined
ఫట్ లు: పాతకాలం కథ, సినిమా లెంగ్త్, ప్లాట్ గా సాగిన స్క్రీన్ ప్లే
undefined
ఫైనల్ థాట్..అలనాటి పాత సినిమాలు చూస్తూంటే అలవోకగా ఈ నాటి కొత్త సినిమాలకి కథలు పుడతాయి
undefined
Rating:3
undefined
click me!