Missing Meghana Review: మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్యూ.. రామ్‌ కార్తీక్‌, అంకిత్‌ కొయ్య థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Published : Sep 18, 2026, 08:33 AM IST

Missing Meghana Movie: రామ్‌ కార్తీక్‌, అంకిత్ కొయ్య, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `మిస్సింగ్‌ మేఘన`. మేఘన కిడ్నాప్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందంటే?

PREV
16
మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్వ్యూ

యంగ్‌ హీరోలు రామ్ కార్తిక్‌, అంకిత్‌ కొయ్య, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `మిస్సింగ్‌ మేఘన`. గోపరాజు రమణ, వెంప కాశి, వైదిక సెంజాలియా, మహిపాల్‌, రుచిత, నళిని ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహించగా, ఫస్ట్ కాపి మూవీస్‌, కేడి అండ్‌ కో పతాకాలపై పంచుమర్తి నరేష్‌ బాబు నిర్మించారు. కథ, స్క్రీన్‌ ప్లే వనరాజ్‌. ఈ చిత్రం నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 18)న విడుదలైంది. టీజర్‌, ట్రైలర్‌తోపాటు పాటలు ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

26
మిస్సింగ్‌ మేఘన మూవీ కథ

మేఘన(అమ్ము అభిరామి) మిస్సింగ్‌ కేసుతో కథ ప్రారంభం అవుతుంది. రాత్రి పది దాటినా అమ్మాయి రాకపోవడంతో తండ్రి(గోపరాజు రమణ) టెన్షన్‌ పడుతుంటాడు. వెతుకుతూ వెళ్లగా ఆమె స్కూటి కనిపిస్తుంది. ఆ తర్వాత కొంత దూరంలో బ్యాగ్‌ ఉంటుంది. అది చూసి తమ అమ్మాయిని ఎవరో కిడ్నాప్‌ చేశారని అనుమానించి పోలీసులకు కంప్లెయింట్‌ చేస్తాడు తండ్రి. ఎస్‌ఐ ఈ కేసుని లైట్‌ తీసుకుంటాడు. కానీ ఏసీపి వచ్చి కేసుని విచారిస్తాడు. పోలీసులను అలర్ట్ చేస్తాడు. అనుమానితులను ఒక్కొక్కరిని విచారిస్తుంటారు. ఆమె వెంటపడ్డవాడు, మేఘన బేకరి సర్వెంట్‌ ని, అలాగే లోకల్‌ ఒక రౌడీని విచారిస్తారు. తన వెంటపడ్డ వ్యక్తిని విచారించే క్రమంలో మేఘన బాయ్‌ ఫ్రెండ్‌ గురించి తెలుస్తుంది. అతనే కార్తీక్‌( రామ్‌ కార్తీక్‌). అతనితోనే గత కొన్ని రోజులుగా కంటిన్యూగా మాట్లాడుతుంది. అతన్ని విచారించగా తన గతం లవ్‌ స్టోరీని చెబుతాడు. ఆ తర్వాత మేఘనతో ఉన్న పరిచయం గురించి రివీల్‌ చేస్తాడు. కానీ అప్పటికే మేఘనికి ఏసీపీతోనే పెళ్లి సెట్‌ అవుతుంది. మరి మ్యారేజ్‌ సెట్‌ అయ్యాక కార్తీక్‌తో మేఘన నిజంగానే ప్రేమలో పడిందా? వీరి పరిచయం ఎలా జరిగింది? కార్తీక్‌ పాత లవ్‌ స్టోరీ ఏంటి? ఇంతకి కార్తీక్‌ ఏం చేస్తుంటాడు? ఇందులో అంకిత్‌ కొయ్య పాత్రేంటి? మేఘన కిడ్నాప్‌ అయ్యిందా? మర్డర్‌ అయ్యిందా? అనే సస్పెన్స్ అంశాల సమాహారమే సినిమా.

36
మిస్సింగ్‌ మేఘన విశ్లేషణ

సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్‌ ప్రధానంగా సాగిన చిత్రమిది. ఇందులో లవ్‌ ట్రాక్‌ కూడా ఉంది. అయితే అదొక డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ కావడం విశేషం. పెళ్లి సెట్‌ అయిన అమ్మాయి ఆ తర్వాత వేరే వ్యక్తితో ప్రేమలో పడటమనే కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ అందులోనూ ఇది కొంత భిన్నంగా ఉంటుంది. ఇక మేఘన మిస్సింగ్‌ అనేది ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఆమె మిస్సింగ్‌ వెనుక అనేక ట్విస్ట్ లు, ఊహించని టర్న్ లు ఉన్నాయి. సినిమా ప్రారంభమైన కాసేపటి నుంచే ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంది. అవి ఊహించని విధంగా ఉంటాయి. కథ మేఘన మిస్సింగ్‌ తో ప్రారంభమవుతుంది. అనుమానితులను విచారించే క్రమంలో కొత్త అంశాలు రివీల్‌ అవుతుంటాయి. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా మేఘన, కార్తిక్ ల పరిచయం రివీల్‌ అవుతుంది. అది ప్రేమగా మారిన తీరు కొత్తగా ఉంటుంది. అయితే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంటుంది. అంకిత్‌ కొయ్య పాత్రలోని ట్విస్ట్ కూడా అదిరిపోయింది. కాకపోతే ఓ దశలో ఆడియెన్స్ ఊహించేలా ఉంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనేది ప్రెడిక్ట్ చేసేలా ఉంటుంది. దీంతో కొన్ని చోట్ల కిక్‌ పోయింది. సినిమా ప్రారంభంలో వేగంగా సాగుతుంది. ఒక్కో సీన్‌ వెంట వెంటనే వచ్చిపోతుంటాయి. ఫాస్ట్ స్క్రీన్‌ ప్లే ఏం జరుగుతుందనే అయోమయం క్రియేట్‌ చేస్తుంది. సినిమా అర్థం కావడానికి టైమ్‌ పడుతుంది. ఫస్టాఫ్‌ చాలా వేగంగా పూర్తవుతుంది. కానీ సెకండాఫ్‌ లెంన్తీగా అనిపిస్తుంది. కార్తీక్‌ లవ్‌ ట్రాక్‌, మేఘనతో ఆయన పరిచయం రివీల్‌ కావడానికి టైమ్‌ తీసుకున్నారు. ఆ లవ్‌ ట్రాక్‌ కొత్తగా ప్రారంభమైనా, ఆ తర్వాత కొంత రొటీన్‌గా, మరికొంత బోరింగ్‌గా అనిపిస్తుంది. సినిమాలో మెయిన్‌ ఎమోషన్‌ మిస్‌ అయ్యింది. చాలా సీన్లు అలా వచ్చి ఇలా పోతుంటాయి. ట్విస్ట్ లు కూడా గొప్పగా వర్కౌట్‌ కాలేదు. తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్‌ కనెక్ట్ కాలేదు. అసలు తాత వయసున్న గోపరాజుని తండ్రిగా చెప్పడం కన్విన్సింగ్‌గా లేదు. క్లైమాక్స్ కూడా ఇంకా బాగా చేయాల్సింది. అయితే సినిమా నిడివి తక్కువగా ఉంటుంది. సినిమా ఫాస్ట్ గా అయిపోతుంది. దీనికితోడు కొన్ని ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియెన్స్ కి ఒక మంచి టైమ్‌ పాస్ సినిమాగా చెప్పొచ్చు.

46
మిస్సింగ్‌ మేఘనలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

కార్తీక్‌ పాత్రలో రామ్‌ కార్తీక్‌ నటించాడు. ఆయన లవ్‌ ఫెయిల్యూర్‌ కుర్రాడిగా బాగా చేశాడు. ఆ తర్వాత మేఘనతో లవ్‌ ట్రాక్‌ పరంగానూ ఆకట్టుకున్నాడు. చాలా సెటిల్డ్ గా చేసి మెప్పించారు. ఆయనకు మంచి కమ్‌ బ్యాక్‌ మూవీ అవుతుందని చెప్పొచ్చు. అంకిత్‌ కొయ్య పాత్ర కూడా బాగుంది. అతను కూడా అదరగొట్టాడు. ఆయన పాత్రలోని ట్విస్ట్ అదిరిపోతుంది. మేఘన పాత్రలో అమ్ము అభిరామి బాగా చేసింది. పాత్రలో ఒదిగిపోయింది. ఉన్నంత సేపు మెప్పించింది. తండ్రి పాత్రలో గోపరాజు రమణ తనదైన స్టయిల్‌ చేసి మెప్పించారు. ఏసీపీగా వెంప కాశి పాత్ర బాగుంది. ఆయన కూడా చాలా బాగా చేశాడు. సినిమాలో ఈ పాత్ర కూడా హైలైట్‌గా నిలుస్తుంది. బేకరీ అబ్బాయిగా మహిపాల్‌ మెప్పించాడు. తనకు మరో మంచి పేరు తెచ్చే పాత్ర అవుతుంది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

56
మిస్సింగ్‌ మేఘన టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమాకి ఆర్‌ఆర్‌ ధృవన్‌ పాటలు బ్యాక్‌ బోన్‌గా నిలుస్తాయి. మూడు పాటలు అదిరిపోయాయి. రెండు మెలోడీ సాంగ్స్, ఒక బ్రేకప్‌ సాంగ్‌ ఆకట్టుకుంటాయి. బీజీఎం కూడా బాగుంది. కానీ కొన్ని చోట్ల పాత సినిమాల ఆర్‌ఆర్‌ని తలపిస్తుంది. శ్యామ్‌ కే నాయుడు కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌గా గ్రాండియర్‌గా ఉంది. బసవా ఎడిటింగ్‌ షార్ప్ గా ఉంది. కొన్ని చోట్ల కంటిన్యూటీ మిస్ అయిన ఫీలింగ్‌ కలిగింది. ఇక వనరాజ్‌ కథ, స్క్రీన్‌ ప్లే బాగుంది. దర్శకుడు వాచస్పతి టేకింగ్‌ చాలా చోట్ల మెప్పించింది. ట్విస్ట్ లు, టర్న్ లను బాగానే డీల్‌ చేశారు. కాకపోతే ఇంకా బాగా చేయాల్సింది. వాహ్‌ ఫ్యాక్టర్‌ విషయంలో, క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలో మరింత కేర్‌ తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది.

66
ఫైనల్‌గా..

కొంత వరకు ఎంగేజ్‌ చేసి, ట్విస్ట్, టర్న్ లతో ఆకట్టుకునే మూవీ `మిస్సింగ్‌ మేఘన`. మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.

రేటింగ్‌: 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories