mattu vadalara review 'మత్తు వదలరా' మూవీ రివ్యూ!

First Published Dec 25, 2019, 12:53 PM IST

కొత్త దర్శకులు, కొత్త ఆలోచనలతో దూసుకు వస్తున్నారు. రెగ్యులర్ ఫార్మెట్ వదిలి కొత్త జానర్స్ ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాల ద్వారా పరిచయం అయ్యే ఈ దర్శకులు క్రైమ్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, హారర్ కామెడీ జానర్స్ ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. 

(Review by---సూర్య ప్రకాష్ జోశ్యుల) కొత్త దర్శకులు, కొత్త ఆలోచనలతో దూసుకు వస్తున్నారు. రెగ్యులర్ ఫార్మెట్ వదిలి కొత్త జానర్స్ ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాల ద్వారా పరిచయం అయ్యే ఈ దర్శకులు క్రైమ్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, హారర్ కామెడీ జానర్స్ ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ ని కంట్రోలులో పెట్టేవి ఈ జానర్సే. ఈ దర్శకుడు కూడా అదే రూటులో తన ప్రయాణం పెట్టుకున్నాడు. క్రైమ్ జానర్ తో సినీ ప్రయాణం ప్రారంబించాడు. అందుకు తోడుగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా తెచ్చుకున్నాడు.
undefined
మంచి ట్రైలర్ కట్ చేసి బజ్ క్రియేట్ చేసి ఓపినింగ్స్ తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. రాజమౌళి సైతం ఈ సినిమా గురించి మాట్లాడటంతో కొత్త వాళ్లు చేసిన సినిమా అయినా జనాల్లోకి వెళ్లింది. మరి ఈ ప్రమోషన్స్ ని, బజ్ ని ఈ కొత్త దర్శకుడు వినియోగించుకోగలిగాడా..తెలుగు సినిమాని మాస్ మత్తులోంచి లేపగలిగాడా...అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
undefined
మత్తు వెనక అసలు కథేంటి..? డెలవరీ బోయ్ బాబు(శ్రీసింహ‌)కి జీతం తక్కువ... ప్రస్టేషన్ ఎక్కువ. దాంతో ఓ రోజు ఉద్యోగానికి బై చెప్పి, మూటా ముల్లూ సర్దుకుని తన ఊరు వెళ్లిపోదామనుకుంటాడు. అప్పుడు ఆప్తమిత్రుడు యేసు(కమిడియన్ స‌త్య‌) ఆపి..డబ్బులు కావాలంటే కొద్దిపాటి కన్నింగ్ అవసరం అని చెప్పి ఒప్పించి..చిన్న ఛీటింగ్ ఐడియా ని భోదిస్తాడు. వస్తువులు డెలవరీ చేసాక, కష్టమర్స్ క్యాష్ ఇచ్చేటప్పుడు చిన్న ట్రిక్ ప్లే చేసి డబ్బు నొక్కేయాలి. అది విని అమలు చేసే ప్రాసెస్ లో బాబు అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దాని నుంచి బయిటపడేందుకు బాబు ప్రయత్నాలు మొదలెడతాడు. ఈ ప్రాసెస్ లో రకరకాల ట్విస్ట్ లు , టర్న్ లు ఎదురౌతాయి. అసలు తనను ఇలా మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు అనేది చివరకు ఎలా తెలుసుకుంటాడు. మధ్యలో జరిగే డ్రగ్స్ వ్యవహారం ఏమిటి, మత్తు వదలరా టైటిల్ కు కథకు సంభందం ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (క్రైమ్ కామెడీలో ఇంతకు మించి కథ రివీల్ చేస్తే సస్పెన్స్ మిస్సవుతుంది).
undefined
కథ,కథనం ఎలా ఉన్నాయి..? స్టోరీలైన్ గా ఇది చాలా చిన్న ది. దాన్ని విస్తరించుకుంటూ థ్రిల్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు దర్శకుడు.అదే సమయంలో సినిమాని ఫక్తు థ్రిల్లర్ గా నడపకుండా సత్యతో కామెడీని పండించాడు. ఓ రకంగా సినిమాని అదే నిలబెట్టిందని చెప్పాలి. అలాగే ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే..ఇంటర్వెల్ దాకా కథలోకి వచ్చే రెగ్యులర్ తెలుగు సినిమాకు స్క్రీన్ ప్లేకు బ్రేక్ ఇచ్చి ..ఇరవై నిముషాల్లోనే అసలుకథలోకి వెళ్లిపోయాడు. సెటప్ కు టైమ్ తక్కువ తీసుకోవటానికి బోర్ కొట్టలేదు. లేకపోతే మనకు పరిచయం లేని కొత్త హీరో..చేసే విన్యాసాలకు విసుగొచ్చేది.
undefined
ల్లోనే అసలుకథలోకి వెళ్లిపోయాడు. సెటప్ కు టైమ్ తక్కువ తీసుకోవటానికి బోర్ కొట్టలేదు. లేకపోతే మనకు పరిచయం లేని కొత్త హీరో..చేసే విన్యాసాలకు విసుగొచ్చేది. అలాగే ఈ సినిమా మరో ప్లస్ ఏమిటి అంటే ...కథలో సబ్ ప్లాట్స్ తో సహా అన్ని ఒకే ప్లాట్ లో వెళ్తాయి. అలాగే హీరోయిన్ కావాలి, ప్రత్యేకమైన పాటలు కావాలి అని కమర్షియల్ హంగామా చెయ్యలేదు. క్లైమాక్స్ దాకా సస్పెన్స్ మెయింటైన్ చేసారు. స్లో నేరేషన్, డ్రాగ్ అయిన క్లైమాక్స్, ఊహించగలిగే ట్విస్ట్ లు తప్పిస్తే మిగతాదంతా బాగుంది. అయితే ఫస్టాఫ్ ఉన్నంత ఉన్నతంగా సెకండాఫ్ లేదనిపిస్తుంది.
undefined
సెకండాఫ్ ప్రారంభంలో ఇంటర్వెల్ ట్విస్ట్ ని ఓపెన్ చేయటం బాగున్నా..తర్వాత మిగతా ట్విస్ట్ లు రివీల్ అయిపోతూంటే కథ స్పీడు తగ్గిపోతూ వచ్చింది. అయితే దర్శకుడు తెలివిగా ...సత్య తో చేయించిన కామెడీతో దాన్ని అధిగమించే ప్రయత్నం చేసాడు. ఏదైమైనా కొత్త తరహా క్రైమ్ థ్రిల్లర్ కామెడీని చూసినట్లు అనిపించేలా చేయటంలో డైరక్టర్ సక్సెస్ అయ్యాడు.
undefined
దర్శకత్వం, మిగతా విభాగాలు : కొత్త దర్శకుడైనా ఆ తడబాటు ఎక్కడా కనపడకుండా రెండు గంటలు సేపు,ఏ విధమైన కమర్షియల్ హడావిడి లేకుండా ఎంగేజ్ చేయటం గొప్ప విషయం. ఇంట్రస్టింగ్ క్యారక్టర్స్, క్రైమ్ ప్లాట్, టైట్ గా ఉన్న స్క్రిప్టు ఈ సినిమాకు ప్లస్ లు. మిగతా క్రాప్ట్స్ నుంచి కూడా డైరక్టర్ మంచి అవుట్ ఫుట్ తీసుకున్నారు. ముఖ్యంగా కాలభైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫర్‌ కూడా మెచ్చుకోదగిన రీతిలో విజువల్స్ ని ప్రెజెంట్ చేసారు. ఎడిటింగ్‌, నిర్మాణవిలువలు బాగున్నాయి. చిన్న చిన్న సమస్యలను వదిలేస్తే... స్క్రిప్టు వర్క్ బాగా చేసారు.
undefined
నటీనటుల విషయానికి వస్తే....తొలి చిత్రమైనా శ్రీసింహ అనుభవం ఉన్నవాడిలా అదరకొట్టాడు. ఇక క‌మెడియ‌న్ స‌త్య కు ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇస్తుంది. అతను కెరీర్ లో ఇది బెస్ట్ యాక్టింగ్. మిగతా పాత్రల్లో న‌రేష్ అగ‌స్త్య క్యారక్టర్ ఇంట్రస్టింగ్ గా సాగింది.
undefined
ఫైనల్ థాట్ : అప్పుడప్పుడూ టాలీవుడ్ కు ఇలాంటి మత్తు వదిలించే సినిమాలు వస్తూండాలి
undefined
Rating:2.55
undefined
click me!