బాలకృష్ణ 'రూలర్' రివ్యూ..!

First Published | Dec 20, 2019, 2:42 PM IST

---సూర్య ప్రకాష్ జోశ్యుల

ఒక టైమ్ లో బాలయ్య సినిమాకు స్పెషల్ ఆడియన్స్ ఉండేవారు. ఆయన చెప్పే పంచ్ డైలాగ్స్ కు, తొడ కొట్టే సీన్స్  కు థియేటర్స్ దద్దరిల్లేవి. ఆ ఎరా ముగిసింది. కొత్త జనరేషన్ లో కొద్ది మంది మాత్రమే ఆయన వైపుకు టర్న్ అయ్యారు. మిగతావాళ్లు సినిమా బాగుంటేనే బాలయ్య అయినా మరొకరి సినిమా అయినా జై కొడుతున్నారు. అది జై సింహా కావచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ కావచ్చు. 

ఏదైమైనా నచ్చితే నాలుగు టిక్కెట్లు తెగుతున్నాయి. నచ్చకపోతే మార్నింగ్ షో కే బై చెప్పేస్తున్నారు. దాంతో బాలయ్య విభిన్నమైన కథాంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇటువంటి పరిస్దితుల్లో వచ్చిన రూలర్...ఈ తరాన్ని ఎంతవరకూ ఎంగేజ్ చేయగలిగాడు...అభిమానులకే పరిమితం అయ్యాడా..కథేంటి...కామన్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా వంటి విషయాలని రివ్యూలో చూద్దాం.
undefined
ధర్మా ది 'బాషా' (కథ) : గాయాలతో ఉన్న బాలయ్యను సరోజినీ ప్రసాద్ (జయసుధ) తీసుకెళ్లి హాస్పటిల్ లో జాయిన్ చేస్తుంది. బాలయ్యకు తనెవరో మర్చిపోతాడు. గత మేమిటో గుర్తు ఉండదు. అప్పుడు జయసుధ అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి..దత్తత చేసుకుని తమ సొంత సాఫ్ట్ వేర్ ఫర్మ్ కు సీఈఓ ని చేస్తుంది. పనిలో పనిగా అర్జున్ ప్రసాద్ అనే పేరు కూడా పెడుతుంది. రైవల్ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ సోనాలి చౌహాన్ తో ప్రేమలో పడి, ఆమె కోసం సాప్ట్ వేర్ ప్రాజెక్టుని కూడా త్యాగం చేసే స్దాయికి వెళ్తాడు. ఆమెతోనే మన బాలయ్య పెళ్లి నిశ్చయం చేస్తుంది సరోజిని.
undefined

Latest Videos


ఇక అర్జున్ ప్రసాద్ (బాలయ్య) కష్టపడి ఆమె కంపెనీని నెంబర్ వన్ పోజిషన్ లో తీసుకెళ్తాడు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లో గతంలో తన కంపెనీ మొదలుపెట్టి ఆపేసిన ఓ ప్రాజెక్ట్ ను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అప్పుడు అతనికి తన తల్లికి (జయసుధ) జరిగిన అవమానం గురించి తెలుస్తుంది. దానితో అర్జున్ ప్రసాద్ తన తల్లిని అవమానించిన వారి అంతుచూడాలనుకుంటాడు. వాళ్లు మినిస్టర్ భవాని సింగ్ ఠాగూర్ మనుష్యులు అని తెలుస్తుంది.
undefined
బాలయ్య...సింగిల్ హ్యాండ్ తో వాళ్లని చితక్కొట్టేస్తూంటే అది చూస్తున్న వాళ్లలో కొందరు బాలయ్యని గుర్తు పడతారు. వాళ్లంతా రైతులు..వాళ్ల ముఖాల్లో తమ సేవియర్ ని మళ్లీ చూసిన ఆనందం కలుగుతుంది.అంతేకాదు మరో హీరోయిన్ వేదిక కూడా గుర్తు పట్టి ధర్మా అని పిలుస్తుంది. అంటే మెమరీ లాస్ కాకముందు ..బాలయ్య పేరు ధర్మా అన్నమాట.
undefined
ఇంతకీ ఈ ధర్మా ఎవరు..రైతులతో అనుబంధం ఏమిటి..అప్పట్లో ధర్మా ఏం చేసేవాడు...భవాని సింగ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన కూతురు కులాంతర వివాహానికి ధర్మా (బాలకృష్ణ) ఎలా సపోర్ట్ గా నిలిచాడు...అతని ఫ్లాష్ బ్యాక్ ఏమిటి..మధ్యలో వచ్చే భూమిక పాత్రేమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా సెకండాఫ్ లో వస్తాయి. వెళ్లి చూడాల్సిందే.
undefined
కథ,కథనం.. : బాషా, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర ఇలా ఏ కథ చూసుకున్నా..ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసిరి..అప్పటిదాకా ఓ ఐడెంటిటీతో బ్రతికిన వాడు...అసలు జీవితం వేరు అని రివీల్ అవటం..ఆ కథేంటో తెలియటం..ఇది అందరికీ బాగా తెలిసిన స్క్రీన్ ప్లే. ఎన్ని సార్లు ప్లే చేసినా పాసై పోతూ వస్తోంది. కలిసొస్తే పెద్ద హిట్ అవుతోంది. ఇదే ఫార్ములాను ఈ సినిమాకు వాడారు.
undefined
దానికి తోడు బాలయ్య సినిమా అంటే కొన్ని ప్రత్యేక మసాలాలు ఉంటూ వస్తున్నాయి. వాటిని పసిగట్టి....బాలయ్య సినిమా అంటే ఇలా ఉండాలి అనే ఫార్మెట్ తయారు చేసేసి, అందులో బాలయ్యని పంపినట్లు ఉంది కానీ , ఓ క్యారక్టర్ అనుకుని, దాన్ని బాలయ్య చేతే చేయించినట్లు కనపడదు. ఇంటర్వెల్ దాకా ఓ కథ రన్ చేసి...ఇంటర్వెల్ దగ్గర బాషా ఫార్మెట్ లోకి మారిపోవటమే స్క్రీన్ ప్లేతో నడుస్తూండటంతో... ఈ సినిమా పరమ రొటీన్ గా తయారు అయ్యింది. దర్శకుడు, బాలయ్య ఎంత కష్టపడి వర్కవుట్ చేసినా, అవుట్ డేటెడ్ కథ,కథనం ఆ కష్టాన్ని కాలరాసేసింది.
undefined
మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సీన్స్ చాలా చిత్రంగా , కాస్త అతిగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కు వెళ్లేసరి మరీ దారుణంగా అనిపిస్తాయి. ఫస్టాఫ్ ...మెమెరీ లాస్ బాలయ్య (విజియేంద్ర వర్మ గుర్తుకు వస్తోందా) బి,సి సెంటర్లలను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసినా, సెకండాఫ్ కు వచ్చేసరికి దర్శకుడు ఆ అవకాసం ఇవ్వలేదు. ధర్మా అనే పాత్రను పోలీస్ అధికారిగా పరిచయం చేసి, వరసపెట్టి ఫైట్స్, రైతులు కోసం రక్షకుడుగా మారటం, విలన్ భవానితో పోరాటం వంటివాటితో కాలక్షేపం చేసారు. ప్లాష్ బ్యాక్ అయ్యాక, విలన్ ని వెతుక్కుంటూ వెళ్లి చంపేయటంతో ముగించారు.
undefined
అంతేకానీ..అసలు కథ ప్లాష్ బ్యాక్ అయ్యాకే మొదలవుతుంది. ప్లాష్ బ్యాక్ లో వచ్చేదంతా అన్ని గతించి పోయిన కథ. రియల్ టైమ్ లో ఏం జరుగుతుందనే ముఖ్యం...విలన్ కు హీరోకు మధ్య జరిగే వార్ ని చూపెట్టకుండా సినిమా ముగిస్తున్నాం అనే విషయం చూసుకోలేదు. దాంతో ప్యాసివ్ క్యారక్టర్ గా హీరో మిగిలిపోయాడు. అధి బోర్ కు దారి తీసింది. ఇవన్నీ స్క్రిప్టు పరంగా పెద్ద మైనస్ గా మారి, చూసేవారికి మహా నసగా మార్చేసింది.
undefined
బాలయ్య విశ్వరూపమే కానీ.. : బాలయ్యే .. సినిమా మొత్తం కనిపిస్తూ వన్ మ్యాన్ షో లాగ నడిపించారు. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయి.... పంచ్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలలో అదరకొట్టాడు. ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో కేకలు, అరుపులు, యాక్షన్ తో రెచ్చిపోయారు. అది ఓ వర్గాన్ని అలరించి ఉండచ్చేమే కానీ ఆ పాత్రలో అంత దమ్ము లేకపోవటంతో ఆ సీన్స్ లో విషయం లోపించినట్లు అనిపించింది.
undefined
సెకండాఫ్ చీదేసింది.. : ఫస్టాఫ్ మాస్ మసాలాగా తెరకెక్కించిన దర్శకుడు సెకండాఫ్ లో చల్లబడిపోయాడు. సెంకడాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎంతకీ అవ్వకపోవటంతో ..బాలయ్య వీరాభిమానులు సైతం విసుగెత్తే పరిస్దితి వచ్చింది. సెకండాఫ్ లో రైతుల గురించి బాలకృష్ణ చెప్పే డైలాగులులు, దానికి తాలూకు సీన్స్ కొంత వరకూ సినిమాకి ప్లస్ అయ్యాయి మొత్తంమీద చూసుకుంటే ‘రూలర్’ ఫస్టాఫ్ కేక సెకండాఫ్ పూర్తిగా ఊక.
undefined
టెక్నికల్ గా.. : చిరంతన్ భట్ అందించిన సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. పరుచూరి మురళి అందించిన కథ, కథనాలు మరీ పురాతన కాలం నాటివి. వాటిని నమ్ముకుని బాలయ్య సినిమా చెయ్యటం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కెమెరావర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయానికి సెకండాఫ్ లో చాలా ఎడిట్ చెయ్యకుండా వదిలేసారనిపిస్తుంది. డైరక్టర్ కెఎస్ రవికుమార్ బాలకృష్ణ ఇమేజి ని దృష్టిలో పెట్టుకుని సీన్స్ ఎలివేట్ చేయటమే కనిపించింది. దాంతో సినిమా మొత్తం మూస ఫార్మాట్ లోనే నడిచింది.
undefined
ఫైనల్ థాట్ : బాక్సాఫీస్ కు 'రూలర్' గా మారాలంటే కొత్త 'రూల్స్' బాలయ్య పెట్టుకోవాల్సిందే..
undefined
రేటింగ్: 25
undefined
click me!