Martin Luther King Movie Review: `మార్టిన్‌ లూథర్‌ కింగ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Oct 26, 2023, 9:09 PM IST

`హృదయం కాలేయం`, `కొబ్బరి మట్ట`, `కాలీఫ్లవర్‌` వంటి చిత్రాలతో ఆకట్టుకున్న బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు ఇప్పుడు పొలిటికల్‌ సైటిరికల్‌ మూవీ `మార్టిన్‌ లూథర్‌ కింగ్‌` చిత్రంతో వస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతుంది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

సంపూర్ణేష్‌ బాబు.. కామెడీ చిత్రాలతో అలరించాడు. ఆయన సినిమాలపై పలు రకాల విమర్శలు వచ్చినా, బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించాయి. అయితే కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మరో క్రేజీ మూవీతో వస్తున్నారు సంపూర్ణేష్‌బాబు. `మార్టిన్‌ లూథర్‌ కింగ్‌` అనే చిత్రంలో నటించారు. నూతన దర్శకురాలు పూజ కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైనాట్‌ స్టూడియోస్‌, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో మహాయాన మోషన్‌ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ శశికాంత్‌, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. సంపూర్ణేష్‌బాబుతోపాటు సీనియర్‌ నరేష్‌, వెంకటేష్‌ మహా, శరణ్య ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం శుక్రవారం(అక్టోబర్‌ 27)న విడుదలవుతుంది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందని టీమ్‌ చెప్పింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో (Martin Luther King Movie Review) తెలుసుకుందాం. 

కథః
అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో ఉత్తరంలో ఒక కులం, దక్షిణాన ఒక కులం వాళ్లు ఉంటారు. ఈ రెండు కులాలకు ఎప్పుడూ పడదు. గొడవలు జరుగుతుంటాయి. దీంతో ఊరి పెద్దాయన సర్పంచ్‌ ఇద్దరు కులాల నుంచి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకుని ఉత్తరం వాళ్లకి, దక్షిణం వాళ్లకి సమ ప్రాధాన్యతనిస్తుంటాడు. ఆయన పెద్ద భార్యకి జగ్గి(నరేష్‌), చిన్న భార్యకి లోకి(వెంకటేష్‌ మహా) ఇద్దరు కొడుకులుంటారు. వీళ్ల మధ్య ఎప్పుడూ గొడవలే జరుగుతుంటాయి. అందుకు ఊరు బలవుతుంటుంది. గొడవల కారణంగా రోడ్డు, మరుగుదొండ్లు, స్కూల్‌ని సైతం డ్యామేజ్‌ చేస్తారు. అదే ఊర్లో అనాథ అయిన ఎడ్డోడు(సంపూర్ణేష్‌బాబు) తనతోపాటు ఉండే చిన్నోడితో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇద్దరు కలిసి ఊర్లో తిరిగి పాత చెప్పులు సేకరిస్తూ, ఊర్లో వారికి సాయం చేస్తూ వారిచ్చే చిల్లర పైసలు, బియ్యపు గింజలు తీసుకుని జీవిస్తుంటారు. అప్పుడే వసంత(శరణ్య) ఆ ఊర్లో కొత్తగా పోస్టాఫీసు ఉద్యోగంలో చేరుతుంది. డబ్బులు దాచుకోవడానికి అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి ఆమె వద్దకి వెళితే తనకు `మార్టిన్‌ లూథర్‌ కింగ్‌`(సంపూర్నేష్‌బాబుకి) అని పెడుతుంది. ఆ పేరుతో గుర్తింపు కార్డ్ లు తీసి ఓటర్‌ కార్డ్ కూడా వచ్చేలా చేస్తుంది. అదే సమయంలో ఆ ఊర్లో సర్పంచ్‌ ఎన్నికలు వస్తాయి. అంతేకాదు ఊరికి (Martin Luther King Movie Review)  కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ కూడా వస్తుంది. దీంతో ఆ ఫ్యాక్టరీ కమీషన్‌ కోట్లల్లో ఉండటంతో.. పెద్దాయన ఇద్దరు కొడుకులు సర్పంచ్‌ బరిలోకి దిగాలని నిర్ణయించుకుంటారు. ఓట్ల లెక్క తీస్తే ఊర్లో ఉత్తరం వాళ్లు, దక్షిణం వాళ్లు సమానంగా ఉంటారు. దీంతో కొత్తగా ఓటు హక్కు వచ్చిన మార్టిన్ లూథర్‌ కింగ్‌ వారికి కీలకంగా మారుతాడు. అతను ఎవరికి ఓటేస్తే వారిదే గెలుపు. దీంతో కింగ్‌ని కాకపడుతుంటారు. ఆయనకు కావాల్సినవన్నీ పోటీ పడి మరీ ఇస్తుంటారు. మరి కింగ్‌ తన ఓటుని అడ్డు పెట్టుకుని ఎలాంటి కోరికలు కోరాడు? వాళ్లేం ఇచ్చారు? ఈ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనలేంటి? ఊరు కోసం కింగ్ తన ఓటుని ఎలా వాడుకున్నాడు? చివరికి తన ఓటుని ఎవరికి వేశాడనేది మిగిలిన కథ. 


విశ్లేషణః
ఎన్నికలపై సెటైరికల్‌గా చాలా సినిమాలు వచ్చాయి. ఎన్నికల్లో రాజకీయ నాయకుల అసలు స్వరూపాలను, మోసాలను, ఓటర్ల అమాయకత్వాలను ఆవిష్కరిస్తూ సినిమాలొచ్చాయి. ఓటు ప్రాధాన్యతని చెప్పే సినిమాలు కూడా అడపాదడపా అక్కడక్కడ వచ్చాయి. కానీ గ్రౌండ్‌ లెవల్‌లో, విలేజ్‌లో ఓటు కోసం జరిగే పాలిటిక్స్ ని ఆవిష్కరించిన చిత్రం `మార్టిన్‌ లూథర్‌ కింగ్‌`. ఒక్క ఓటు ఇరు వర్గాల రాజకీయ నాయకులకు ఎలాంటి చుక్కలు చూపించింది నూతన దర్శకురాలు పూజ కొల్లూరు. అయితే వాస్తవానికి ఇది తమిళంలో వచ్చిన `మండేలా` చిత్రానికి రీమేక్‌. అక్కడ యోగిబాబు నటించగా రెండేళ్ల క్రితం వచ్చి మంచి విజయాన్ని సాధించింది. దీంతో తెలుగులో దీన్ని `మార్టిన్‌ లూథర్‌ కింగ్‌`గా రీమేక్‌ చేశారు. 

ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. మన రాజకీయాలకు దగ్గరగా, అంతే కనెక్ట్ అయ్యేలా తీయడం మరో విశేషం. సినిమా ఆద్యంతం సెటైరికల్‌గా సాగుతుంది. ఊర్లో రెండు వర్గాల ప్రజలు కొట్టుకోవడం, దానికోసం ఊరు అసెట్‌ని ధ్వంసం చేయడం ప్రత్యక్ష స్వార్థ రాజకీయాలను (Martin Luther King Movie Review) ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో జనం అమాయకత్వాన్ని, ఎడ్డితనాన్ని ఆవిష్కరిస్తుంది. ఎక్కువ కులం, తక్కువ కులం అని, ఉత్తరం వాళ్లు, దక్షిణం వాళ్లు అనే తేడా, దాని కారణంగా జరిగే గొడవలతో ఆ ఊరు ప్రజలు పడే ఇబ్బందులను, ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్లు, వృద్ధులు పడే ఇబ్బందులను కళ్లకి కట్టినట్టు చూపించారు. తమ స్వార్థం కోసం ఊరి జనం మధ్య గొడవలు పెట్టి, వారి ఎమోషన్స్ తో ఆడుకుంటూ తమ వ్యాపారాలను పెంచుకుంటున్న రాజకీయ నాయకుల నిజస్వారూపాలను ఆవిష్కరించింది.

సినిమా ప్రారంభం నుంచి ఫన్నీ వేలో తీసుకెళ్లారు. ఊరి జనం మధ్య గొడవలను, వారి వ్యవహార శైలిలను సెటైరికల్‌గా చూపించారు. మరోవైపు చెప్పులు సేకరిస్తూ, ఊర్లో జనాలకు సహాయం చేస్తూ చెప్పులు కుట్టుకుంటున్న కింగ్‌ పాత్రతో అనేక భావోద్వేగాలను ఆవిష్కరించారు. అదే సమయంలో ఆ పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన (Martin Luther King Movie Review)  తీరు బాగుంది. ఇరు వర్గాల మధ్య గొడవ కారణంగా వాటర్‌ ట్యాంకులు ధ్వంసం చేసి అదే గొడవ పెట్టిన సర్పంచ్‌ కొడుకు వద్ద నీళ్లు కొనుక్కోవడం, ఊర్లో ఉన్న స్కూల్‌ ధ్వంసం చేసి పక్క ఊరికి బడికి వెళ్లడం, మరికొందరు చదువులు మానేయడం వంటి సన్నివేశాలు రాజకీయ నాయకుల వల్ల అమాయక ప్రజలు ఎంతగా బలవుతున్నారనేది ఈ చిత్రంలో చూపించారు. 

అయితే `మండేలా` చిత్రం పూర్తి ఫన్నీ వేలో వెళ్లి చివర్లో ఎమోషనల్‌గా ముగుస్తుంది. అక్కడ బాగా వర్కౌట్‌ అయ్యింది. కానీ ఇందులో ఆ స్థాయి ఫన్‌ మిస్‌ అయ్యింది. కామెడీ సీన్లు ఆశించిన స్థాయిలో పేలలేదు. దీంతో కొంత వరకు ఓకేగానీ, చాలా వరకు బలవంతపు కామెడీలా మారిపోయింది. ఫస్టాఫ్‌ అంతా ఇలా ఊర్లో గొడవలు, కింగ్‌ పాత్ర జర్నీని చూపించారు. దాన్ని ఫన్నీవేలో చెప్పారు. కానీ సెకండాఫ్‌ మొత్తం సీరియస్‌ సైడ్‌ తీసుకున్నారు. కింగ్‌కి ఓటు హక్కు రావడంతో ఆ ఓటు కోసం ఇద్దరు నాయకులు పడే తంటాలు, కొంత వరకు కామెడీగా అనిపిస్తాయి. కానీ సినిమా సీరియస్ సాగుతుంది. పైగా నాకేస్తావా? నాకేస్తావా? అంటూ సాగే సీన్లు సాగదీతగా అనిపిస్తాయి, చూపించినవే పదే పదే చూపించడం, ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. మరోవైపు కింగ్‌ బాధలో (Martin Luther King Movie Review)  ఎమోషన్‌ అంతగా పండలేదు. మరోవైపు సినిమా ద్వారా దర్శకురాలు ఏం చెప్పాలనుకునేది క్లారిటీ మిస్‌ అయ్యింది. ఓటు ప్రాధాన్యత చెప్పాలనుకున్నారా? రాజకీయ నాయకులపై సెటైర్‌ వేయాలనుకున్నారా? అనేది చిన్న లైన్‌ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది? అదే సమయంలో కన్‌ క్లూజన్‌ మిస్‌ అయ్యింది. ఆడియెన్స్ చాలా తెలివైన వాళ్లు.. వారే అర్థం చేసుకుంటారులే అని వదిలేసినట్టుగా ఉంది. కామెడీ, ఎమోషన్స్, కన్‌క్లూజన్‌పై మరింత దృష్టి పెడితే సినిమా ఇంకా బాగుండేది. 

నటీనటులుః 

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ పాత్రలో సంపూర్ణేష్‌బాబు యాప్ట్ గా నిలిచాడు. తనదైన అమాయకమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. గత చిత్రాల్లో ఆయన లౌడ్‌గా ఉండేవాడు, కానీ ఇందులో చాలా సెటిల్డ్ గా చేశాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని సంపూ నిరూపించుకున్నాడు. యాక్టర్‌గా నెక్ట్స్ లెవల్‌ పర్ ఫర్మెన్స్ చూపించాడు. తనతోపాటు ఉన్న చిన్నోడు కూడా చాలా బాగా చేశాడు. అతనికి నటుడిగా ఫ్యూచర్‌ ఉంది. ఇక సర్పంచ్‌ అభ్యర్థులుగా వెంకటేష్‌ మహా, నరేష్‌ ఇరగదీశారు. పాత్రలో జీవించారు. నిజంగా ఊర్లో (Martin Luther King Movie Review)  పరిస్థితులను ప్రతిబింబించారు. పోటీపడి చేశారని చెప్పొచ్చు. వీరి నటన మరో హైలైట్‌. పోస్టాఫీసు ఉద్యోగిగా, సంపూకి అండగా నిలిచే అమ్మాయిగా శరణ్య బాగా చేసింది. పాత్రకి యాప్ట్ గా నిలిచింది. పెద్దాయన పాత్రలో నటించిన రాఘవన్‌ కూడా బాగా చేశారు. ఇతర పాత్రలు పరిధి మేరకు, సహజంగా నటించారు. నిజమైన ఊరు వాతావరణాన్ని తలపించేలా చేశారు. 

టెక్నీషియన్లుః 
పూజ కొల్లూరు దర్శకురాలిగా తొలి చిత్రమైనా చాలా బాగా చేసింది. చాలా అనుభవం ఉన్న డైరెక్టర్‌ లా చేసింది. ఈ విషయంలో వెంకటేష్‌ మహా సపోర్ట్ ఉంటుందని చెప్పొచ్చు. కానీ తన ప్రతిభని నిరూపించుకుంది. రూట్‌ లెవల్‌లో రాజకీయాలను, జనాల పరిస్థితులను అర్థం చేసుకుని వెండితెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. కాకపోతే కామెడీ, ఎమోషనల్‌ సీన్లపై మరింత వర్క్ చేయాల్సింది. కన్‌క్లూజన్‌లో చిన్న మ్యాజిక్‌ చేస్తే బాగుండేది. స్మరణ్‌ సాయి సంగీతం బాగుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ లో వచ్చే (Martin Luther King Movie Review)  పాటలు ఆకట్టుకుంటూ, సినిమాని ఎలివేట్‌ చేసేలా ఉన్నాయి. ఈ సినిమాకి దర్శకురాలే ఎడిటర్‌ కావడం విశేషం. అయితే కొంత ట్రిమ్ చేయాల్సింది. సాగదీత సీన్లు కట్‌ చేస్తే బాగుండేది. దీపక్‌ యరగెరా కెమెరా వర్క్ బాగుంది. ప్రత్యక్షంగా ఊర్లో ఉన్న ఫీలింగ్‌ కలిగింది. ఇందులో ప్రొడక్షన్‌ డిజైనర్‌ రోహన్‌ సింగ్‌ వర్క్‌ సైతం అభినందనీయం. 

ఫైనల్‌గాః `మార్టిన్‌ లూథర్‌ కింగ్‌` కొంత వరకు మెప్పిస్తాడు. 
రేటింగ్‌ః 2.5

తారాగణం: సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా
దర్శకత్వం: పూజ కొల్లూరు
నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
క్రియేటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ మహా
కథ: మడోన్ అశ్విన్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకటేష్ మహా
డీఓపీ: దీపక్ యరగెరా
ఎడిటర్: పూజ కొల్లూరు
సంగీతం: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
కాస్ట్యూమ్ డిజైనర్: జి.ఎన్.ఎస్. శిల్ప

Latest Videos

click me!