#Bramayugam:మమ్ముట్టి 'భ్రమయుగం' (తెలుగు) రివ్యూ

First Published | Feb 23, 2024, 3:41 PM IST

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ సినిమా 'భ్రమయుగం'. 

bramayugam to be released in telugu tamil and kannada on february 23


ఈ సోషల్ మీడియా రోజుల్లో ప్రతీ విషయం వైరల్ అయ్యిపోతోంది. ఓ భాషలో ఫలానా  సినిమాకు హిట్ టాక్ వస్తే దేశం మొత్తం క్షణాల్లో తెలిసిపోతోంది. అలా మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హారర్ సినిమా 'భ్రమయుగం' బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది అనే విషయం అందరికీ తెలిసిపోయింది.   మమ్ముట్టి అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దాంతో మళయాళ వెర్షన్ చూడాలంటూ తెలుగు జనం క్యూలు కడుతున్నారు. దాంతో ఎక్కువ ఆలోచించకుండా డబ్బింగ్ చేసి మన ముందుకు తెచ్చేసారు ఈ సినిమాని. ఇంతకీ ఈ సినిమాలో అంతగా జనాలను ఆకట్టుకునే కంటెంట్ ఏముంది..మన వాళ్లకు నచ్చే మ్యాటరేనా..అసలేంటి కథ?

bramayugam


స్టోరీ లైన్

17 నాటి గాయకుడు తేవాన్ (అర్జున్ అశోక‌న్‌)  . మలబారు తీరంలో పోర్చుగీసు సేన‌లు త‌క్కువ కులం వారిని బానిస‌లుగా మార్చి అమ్మేస్తున్న టైమ్ అది.  వారికి దొర‌క్కుండా తేవాన్ త‌న ప్రెండ్ తో క‌లిసి అడ‌విలోకి పారిపోతాడు . అయితే అడ‌విలో తేవాన్ క‌ళ్ల ముందే ఓ దుష్ట‌శ‌క్తి బారిన ప‌డి అత‌డి ప్రెండ్  కోరా క‌న్నుమూస్తాడు. దాంతో భయంతో పారిపోయి....ఆ అడవిలో ఉన్న పాడుబడ్డ పెద్ద రాజ భవంతిలోకి వెళ్తాడు. ఆ భవంతిలో కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు యజమాని కొడుమోన్ పోటి (మమ్ముట్టి).. రెండోది వంటవాడు (సిద్ధార్ధ్ భరతన్). అక్కడ తేవన్ కు మంచి ఆహ్వానమే దొరుకుతుంది. 


Mammootty starrer Bramayugam


‘ఆశ్రయం కోరి ఇంటికి వచ్చిన అతిథిని ఆహ్వానించాలి.. అతను రాజైనా పేదైనా’.. అని తేవన్‌కి   ఆహ్వానించి.. అతనికి ఆశ్రయం కల్పిస్తాడు కోడుమోన్ పోటి. అక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. కొద్ది రోజులుకు ఆ ఇంటి వెన‌కాల చాలా మంది స‌మాధులు ఉండ‌టం తేవాన్ గ‌మ‌నిస్తాడు.  ఆ తరువాత ఆ భవంతిలో ఏదో మాయాశక్తి ఉందని అర్దం చేసుకుంటారు.  ఇంట్లో క్షుద్ర‌పూజ‌ల ఆన‌వాళ్లు. పారిపోదామనుకుంటాడు. కానీ అతని వల్ల కాదు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన ప్రతీ సారి కొడుమన్‌ తన తాంత్రిక విద్యలతో అతణ్ని మళ్లీ ఇంటికి వచ్చేలా చేస్తాడు.  అప్పుడు ఏమైంది? (Bramayugam Movie Review).

bramayugam

అసలు తేవాన్ ని అంత గౌరవంగా భవంతిలోకి ఆహ్వానించి వెళ్లనివ్వకుండా చేస్తున్న  కొడుమన్‌ పొట్టి ఎవరు? అతని ఫ్లాష్ బ్యాక్  ఏంటి? అతని గురించి అంతా తెలిసి కూడా వంటవాడు ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు? చివరకు తేవన్‌ ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది  ‘భ్రమయుగం’సినిమా చూసి తెలుసుకోవాలి.

bramayugam

ఎనాలిసిస్...

నిజానికి కథగా చూస్తే హాంటెడ్ హౌస్ థీమ్ తో వచ్చే సినిమాలు మనమేకీ కొత్తకాదు. మాయ‌లు, మంత్రాలు, క్షుద్ర‌పూజ‌ల థీమ్ లతో బోలెడు సినిమాలు ప్రతీ యేడు వస్తూంటాయి. అయితే ఇక్కడ బ్యూటీ అంతా 17 శతాబ్దంలో కథ నడపటం,అలాగే ముమ్మట్టి వంటి మెగాస్టార్ కథలో చేయటం, బ్లాక్ అండ్ వైట్ లో సినిమాని తీయటం ఇలా ప్రతీ విషయంలోనూ ప్రత్యేకతలు తీసుకుని తెరకెక్కించారు. ముఖ్యంగా ఓ పాత్రపై సానుభూతి క్రియేట్ చేయటం horror జానర్ లో కీ ఎలిమెంట్. అదే ఇక్కడా సమర్దవంతంగా చేసారు. తేవాన్ పాత్రను చూస్తూంటే అరే ఇతను ఈ భవంతి నుంచి, ముమ్మట్టి నుంచి తప్పించుకోలేడేమో అనిపిస్తూంటుంది. (Bramayugam Review)ఆ పాత్ర భయం,టెన్షన్ మనను వెంటాడుతుంది.  టైమ్ లూప్ సెంట్రల్ కాన్సెప్టు మనకు ఇండైరక్ట్ గా చరిత్ర రిపీట్ అవుతుందనే సత్యాన్ని చెప్తూంటుంది. 


తక్కువ కులం, ఎక్కువ కులం అనేది పోదు. ఎంత మారుద్దామని, దాన్నుంచి తప్పించుకుందామని ప్రయత్నించినా గానిగెద్దులా అక్కడక్కడే తిరుగుతూంటుంది అని ఈ చిత్రం సబ్ టెక్ట్స్ లో మనకు చెప్తూంటుంది.  కథ కన్నా స్క్రీన్ ప్లే కి,విజువలైజేషన్ కు  ప్రయారిటీ ఇచ్చిన సినిమా ఇది. మొదట్లో స్లోగా అనిపించినా మెల్లిగా ఎక్కేస్తుంది. అది బుర్రల్లోంచి పోవటానికి టైమ్ తీసుకుంటుంది. అక్కడే డైరక్టర్ సక్సెస్ అ్యయారు. ముఖ్యంగా హిచ్ కాక్ సినిమాల్లో కనిపించే విజువల్ స్టైల్,ఇన్ఫూలియెన్స్ ఈ సినిమాలోని షాట్స్, సీన్ ఎత్తుగడలో కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ లో కథ చెప్పటంలోనే హారర్ ఎలిమెంట్స్ ని అతను డోస్ పెంచేసాడని అర్దమవుతుంది. ఏదో రెట్రో క్లాసిక్ ని చూసిన ఫీల్ తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. అలాగే కేవలం ఓ హారర్ ఫిల్మ్ గా ఈ సినిమాని చేసి ఉంటే అంత అప్లాజ్ వచ్చేది కాదు. దానికి పొలిటికల్ సినేరియో అద్దటంలోనే ఉంది డైరక్టర్ తెలివి అంతా. అయితే కొడుమోన్ పొట్టి  ఫ్యామిలీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ జస్ట్ ఓకే అన్నట్లు అనిపిస్తుంది. అయితే తేవాన్ పారిపోకుండా పొట్టి చేసే మాయ‌లు మాత్రం థ్రిల్లింగ్‌ను పంచి సినిమాని చివరిదాకా కూర్చోబెడతాయి.

టెక్నికల్ గా...

కెమెరాను అటు ఊపి,ఇటు ఊపి, లేదా ఏదో కీ హోల్ లోంచి లేదా గాల్లోంచి చూపెట్టడం వంటివి కాకుండా కొన్ని ప్రత్యేకమైన కట్స్ తో షాట్ మేకింగ్ తో హారర్ ని క్రియేట్ చేసాడు కెమెరామెన్. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ ప్రాణం అంటే అతియోశక్తి కాదు. అలాగే ప్రొడక్షన్ డిజైన్ కూడా మామూలుగా లేదు.  Christo Xavier బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటూంటే కొన్ని సార్లు మనం కూడా ఆ భవంతిలో ఇరుక్కుపోయామేమో అనిపిస్తుంది. లైటింగ్ తో కొత్త యాంబియన్స్ క్రియేట్ చేసారు. కాకపోతే సినిమా స్లోగా ఉండటం స్పీడు అలవాటుపడిన మనకు ఇబ్బందిగా ఉ ంటుంది. ఎడిటింగ్ వర్క్ కూడా ఎక్కడా జర్క్ లు లేకుండా స్మూత్ గా సాగుతుంది. డబ్బింగ్ కూడా బాగుంది. ఆర్ట్ డిపార్టమెంట్ పనితనాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి.  
 

mamootty movie Bramayugam

నటీనటుల్లో ...

కేవలం మూడు పాత్రలతో రెండున్నర గంటల పాటు నడిచిన   సినిమా ఇది.  తను మెగా స్టార్ అనే హోదాను పక్కన పెట్టి ఇలాంటి పాత్రను చేయడం చూసి ఆశ్చర్యపోతాం. సినిమా మొత్తం ఒక్కటే కాస్ట్యూమ్‌లో కనిపించారు మమ్ముట్టి.  మ‌మ్ముట్టి త‌ర్వాత గాయకుడు తేవాన్ గా అర్జున్ అశోక‌న్ న‌ట‌న బాగుంది.  వంట‌వాడిగా సిద్ధార్థ్ భ‌ర‌త‌న్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్ల‌స్‌. 


ఫైనల్ థాట్

భయపడటానికి కాకుండా భయం అనే ఎమోషన్ ని ఎక్సపీరియన్స్  చేయటానికి ఈ సినిమాకు వెళ్లచ్చు. కొన్ని భ్రమలు మనని చాలా కాలం వెంటాడుతాయి.

--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:3

bramayugam


నటీనటులు: మమ్ముట్టి, అర్జున్‌ అశోకన్, సిద్ధార్థ్‌ భరతన్, అమల్డా లిజ్, మణికందన్‌ ఆర్‌.ఆచారి; 
సంగీతం: క్రిస్టో జేవియర్‌;
 ఛాయాగ్రహణం: షెహనాద్‌ జలాల్‌; 
రచన, దర్శకత్వం: రాహుల్‌ సదాశివన్‌; 
నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్‌.శశికాంత్‌; 
విడుదల తేదీ: 23-02-2024
 

Latest Videos

click me!