The Ghost Movie Review: కింగ్ నాగార్జున ది ఘోస్ట్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆ ఒక్క పాయింట్ దెబ్బకొట్టిందట..!

First Published | Oct 5, 2022, 6:32 AM IST

టాలీవుడ్ కింగ్ నాగార్జున ‌‌‌- సోనాల్ చౌహాన్ జంటగా నటించిన సినిమా ది ఘోస్ట్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈమూవీ ఈరోజు ప్రపంచ వ్యప్తంగా రిలీస్ అవుతోంది. ఇక అంత కంటే ముందు యూఎస్ లో ప్రిమియర్స్ పడ్డాయి. మరి ఆ ప్రీమియర్ చూసిన ఆడియన్స్ ట్వీట్టర్ లో ఎలా స్పందిస్తున్నారో చూద్దాం. 
 

The Ghost

టాలీవుడ్ లో మన్మథుడిగా పేరున్న హీరో నాగర్జున. శరీరానికే వయస్సు.. మనసుకు కాదు అని నిరూపించిన హీరో. అరవై ఏళ్లు దాటి మూడేళ్ళు  దాటుతున్నా.. ఇంకా కుర్రాడిలా మెరిసిపోతున్నాడు. కుర్ర హీరోలకు...ముఖ్యంగా తన కొడుకులిద్దరికీ పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు నాగార్జున. ఇక ఈ సీనియర్ హీరో నటించిన ఘోస్ట్ ఈరోజురిలీజ్ అవుతోంది. ఇక ఈమూవీ ప్రీమియర్ చూసిన   ఆడియన్స్ ఏమని ట్వీట్ చేస్తున్నారో చూద్దాం. 

నాగార్జున ది ఘోస్ట్ మూవీపై మిశ్రమ స్పందన వస్తోంది. సినినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఆకర్షిస్తుంటే.. మరికొన్ని ఎలిమెంట్స్ నిరాశపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ గా సినిమా కనెక్ట్ అవ్వదు అంటున్నారు ట్విట్టర్ జనాలు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ సోనాల్ కు సంబంధించిన ఏ సీన్ పండలేదట.  సాంగ్స్ కూడా అంతత మాత్రమే అంటున్నారు. 


the ghost movie

కాని ఈ సీనిమా ప్రీ ఇంట్రవెల్ 20 నిమిషాలు మాత్రం ఎలివేషన్ అంద్భుతంగా ఉంది అంటున్నారు ట్విట్టర్ పీపుల్. అంతే కాదు సినిమాలో ట్విస్ట్ లు కూడా ఆడియన్స్  తెలియకుండా సినిమాలో లీనం అయ్యేలా చేస్తాయట. 

మరికొంత మంది ఆడియన్స్ మాత్రం సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందంటూ ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్స్ ఎక్కడినుంచో తెచ్చిపెట్టుకున్నట్టు ఉన్నాయంటున్నారు. బలవంతంగా ఏడుపు తెచ్చుకుని ఏడ్చినట్టు ఉంది అంటున్నారు. ఇక చాలా మంది మాత్రం ఇంట్రవెల్ బ్యాంగ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 

మరికొంత మందికి ఈసినిమాల్ యాక్షన్ ఎపిసోడ్స్ విపరీతంగా నచ్చాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ ట్వీట్ చేస్తున్నారు. వీటితో పాటు విజ్యువల్స్ ను చాలా రిచ్ గా ప్లాన్ చేశారు.. కాని వాటిని ఎమోషన్ సీన్స్ తో పాడు చేసుకున్నారు. అది కూడా ఫోర్స్డ్ ఎమోషన్ సీన్స్ తో కరాబు చేసుకున్నారంటూ విమర్షిస్తున్నారు ప్రేక్షకులు 
 

ఇక కొంత మంది మాత్రం ఇది డబుల్ డిజాస్టర్ అంటూ షాకింగ్ కామెంట్స్ పెడుతుంటే.. మరికొంత మంది మాత్రం దసరాకు మంచి సినిమా ఇచ్చారు అంటూ.. బలవంతంగా చెప్పేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం సినిమా బాగుంది అంటూ హడావిడి చేస్తున్నారు. మరికొంద మంది మాత్రం ఇకాస్త జాగ్రత్త పడితే బాగుండేదేమో అంటున్నారు.
 

ఏది ఏమైనా చాలా కాలం తరువాత మంచి యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాగార్జునకు ది ఘోస్ట్ సినిమాతో మిశ్రమ స్పందన వచ్చిందని చెప్పుకోవాలి. దాదాపు అందరికి ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా నచ్చింది. ఆల్ మోస్ట్ అందరికి తెచ్చి పెట్టుకున్న సెంటిమెంట్ సీన్స్ వెగటు పుట్టాయి. ఇక హీరోయిన్ వాడకంపై అక్కినేని ఫ్యాన్స్ కూడా మేకర్స్ పై గరంగా ఉన్నారు. చూడాలి రిలీజ్ తరువాత టాక్ ఎలా ఉంటుందో..?

Latest Videos

click me!