Karate Kalyani
కకరాటే కళ్యాణి పలుమార్లు వివాదాలతో వార్తల్లో నిలిచారు. ఆమెకు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. చేసింది తక్కువ చిత్రాలు అయినా గొడవల కారణంగా పాప్యులర్ అయ్యారు. అయితే సమాజం తనను తప్పుడు దృష్టితో చూస్తుందన్న కరాటే కళ్యాణి వ్యక్తిగత జీవితం గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కరాటే కళ్యాణి మాట్లాడుతూ... వైవాహిక జీవితంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. తాగుబోతు భర్త నరకం చూపించాడు. తిట్టడం, కొట్టడం చేశాడు. అయినా భర్త కాబట్టి భరించాను. అర్ధరాత్రి తాగొచ్చి వండి పెట్టమంటే చేశాను. వివాహ బంధం నాకు కలిసి రాలేదు. అందుకే విడాకులు తీసుకున్నాను.
అమ్మ మరో వివాహం చేసుకో అంటుంది. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం. నాన్న మరణం తర్వాత అమ్మ, చిన్న తమ్ముడితో ఉంటున్నాను. తమ్ముడి వయసు 22 ఏళ్ళు. వాడికి పెళ్ళైతే, నేను చనిపోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. ఇంకా నీకు వయసుంది. వివాహం చేసుకో అని అమ్మ అంటుంది. సంబంధాలు చూస్తున్నాము. కానీ ఏం జరుగుతుందో చెప్పలేను. నాకు పెళ్లి మీద అంత ఆసక్తి లేదు. నిజంగా ప్రేమించే వాడైతే ఓకే.
జనాల మాటలు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సినిమాల్లో నేనే చేసే పాత్రలు చూసి అలానే ట్రీట్ చేస్తున్నారు. సమాజం నన్ను వ్యభిచారిగా చూస్తుంది. నిజానికి నేను అలంటి దాన్ని కాదు. ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. నా వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఈజీగా మాటలు అనేస్తారు.
నేను కష్టపడి పైకి వచ్చాను. నన్ను నేనే పోషించుకోలేని స్థాయి నుండి ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదిగాను. కానీ సమాజం సూటి పోటి మాటలు విన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఒంటరిని అనే భావన కలుగుతుంది, అంటూ కరాటే కళ్యాణి కన్నీరు పెట్టుకున్నారు. ఈ అంశాలతో కూడిన కరాటే కళ్యాణి లేటెస్ట్ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది.
ఇటీవల కరాటే కళ్యాణ్ ఓ వివాదంతో వార్తలకు ఎక్కారు. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని ఆమె రోడ్డుపై పరుగెత్తించి కొట్టారు. అర్ధరాత్రి అది పెద్ద న్యూసెన్స్ అయ్యింది. ఎస్ ఆర్ నగర్ పోలీసులు ఇద్దరిపై కేసులు పెట్టారు. అలాగే సరైన పత్రాలు లేకుండా ఒక పాప తన వద్ద పెరుగుతుందని తెలిసి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు చేశారు.