సుధీర్ బాబు 'హంట్' రివ్యూ

First Published Jan 26, 2023, 1:54 PM IST

పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన ముంబై పొలీస్ సినిమాను తెలుగులో హంట్‌గా తీశారు. ముగ్గురు పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరిగే ఓ మర్డర్ మిస్టరీ ఇది. ఫైనల్ గా ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది.   

Hunt Movie Review

మళయాళంలో డిఫరెంట్ థ్రిల్లర్స్ వస్తున్నాయి. వాటిని మనం ఓటిటిలో చూస్తున్నాము. వాటిలో కొన్ని అప్పుడప్పుడూ రీమేక్ అవుతున్నాయి.  అయితే  2013లో వచ్చిన థ్రిల్లర్ ముంబై పోలీస్ ని మాత్రం ఎందుకనో మనవాళ్లు కన్ను పడలేదు. ఇన్నాళ్లు ఇది మనకు అందుబాటులోకి రాలేదు. ఆ లోటుని తీర్చటానికి అన్నట్లు  ఇప్పుడు చిత్రం రైట్స్ తీసుకుని రీమేక్ చేసారు. కేరళలో ఈ సినిమా రిలీజైనప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ డిఫరెంట్ డైమన్షన్ లో కథ నడిచిందని డైరక్టర్ రోషన్ ఆండ్రూస్ ని అందరూ మెచ్చుకున్నారు. మరి తెలుగులోనూ ఆ స్దాయి అప్లాజ్ వస్తుందా...అసలు ఈ చిత్రం కథేంటి...విభిన్నమైన పాయింట్ ఈ సినిమాలో ఏముంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 


కథాంశం:

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అర్జున్ (సుధీర్ బాబు)  కమిషనర్ మోహన్ భార్గవ్ (శ్రీకాంత్)కి ఓ ఫోన్ కాల్ చేయటంతో సినిమా మొదలవుతుంది. ఆ కాల్ లో ... తాను ఐపీఎస్ ఆఫీసర్ ఆర్యన్ దేవ్ ('ప్రేమిస్తే' ఫేమ్ .భరత్) మర్డర్ కేసులో దోషి ఎవరనేది కనిపెట్టేసానని చెప్తాడు. ఆ మర్డర్ చేసింది అనేది చెప్పేలోగా ... యాక్సిడెంట్ అవుతుంది. దాంతో అర్జున్  తన జ్ఞాపక శక్తిని కోల్పోతోడా. దాంతో ..ఆ దోషి ఎవరు అతని పేరు ఏమిటనేది బయిటకు రాదు. యాక్సిడెంట్ నుంచి రికవరీ అయ్యినా గతం పూర్తిగా గుర్తు రాదు. అయినా కమీషనర్ సలహాపై డ్యూటీలో జాయిన్ అయ్యి...మర్డర్ ఎవరు చేసారు అనేది ఇన్విస్టిగేట్ చేయటం మొదలెడతాడు. భార్గవ్ సాయింతో  రకరకాల వ్యక్తులను కలుస్తూ, ప్లేస్ లు తిరుగుతూ గతం గుర్తు చేసుకుంటూ ఈ కేసుని ఇన్విస్టిగేట్ చేస్తూంటాడు అర్జున్. ఆ క్రమంలో  క్రిమినల్ రాయ్ (మైమ్ గోపీ), కల్నల్ విక్రమ్ (కబీర్ సింగ్), టెర్రరిస్ట్ గ్రూప్ హర్కతుల్ లను అర్జున్ సస్పెక్ట్ చేస్తాడు. అందుకు తగ్గ కారణాలు ఉంటాయి. అయితే వీళ్లలో ఆర్యన్ దేవ్ ని చంపిన వాళ్లు ఉన్నారా..లేక వేరే ఎవరైనా ఆ హత్య చేసారా... క్లైమాక్స్ లో ఊహించని షాక్ ఇచ్చే ఎలిమెంట్ ఉంటుంది..అదేమిటి...అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎనాలసిస్ :

`హంట్‌` ఓ ప్రయోగాత్మక మూవీ. అయితే ఇదేదో పెద్ద ట్రెజర్ హంట్ కు సంబంధించిన యాక్షన్ సినిమా అనిపిస్తుంది. సినిమా ప్రారంభమైన కాసేపటికి మన అంచనాలు తారు మారు అవుతాయి. ఇదేమీ ట్రైలర్ చూపించిన యాక్షన్ సినిమా కాదని, ఓ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ అని అర్దమవుతుంది.  అందులోనూ హీరోయిన్ లేని కథ ఇది. దాంతో సబ్ ప్లాట్ కూడా లేకుండా ఒకే పాయింట్ చుట్టూ తిరగటం..చాలా స్లో పేసెడ్ లో సీన్స్ నడవటం కాస్త ఇబ్బంది పెట్టే అంశం. అయితే మధ్య మధ్యలో కాస్త స్పీడ్ అందుకోవడం ఊరటనిస్తుంటుంది. ఎక్కడో క్లైమాక్స్ లో ట్విస్ట్ పెట్టుకుని అక్కడ దాకా చూసేవాళ్లను తరమాలనే ప్రయత్నం వ్యర్దమే.  దాన్ని ఇంకాస్త ఎంగేజింగ్‌గా చెబితే బాగుండేది. నిజానికి ఈ కథ చాలా కొత్త పాయింట్‌. తెలుగులో ఎవరూ టచ్‌  చేయలేదు. ఆ విషయంలో సుధీర్‌బాబు అటెంప్ట్ ని, భవ్య డేరింగ్‌ని అభినందించాల్సిందే.

మనం ఓటిటిల పుణ్యమా అని ఎంతో థ్రిల్లర్ సినిమాల నాలెడ్జ్ పోగుచేసుకుని..నెక్ట్స్ సీన్ ఏమిటా..క్లైమాక్స్ ఏమిటా అని ఊహించే స్దాయికు చేరుకున్నాం. అలాంటి మనకి ఇలాంటి కథలు ఇప్పటి కాలానికి తగినట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది.  స్క్రీన్ ప్లే కూడా మార్చలేదు. ఫస్టాఫ్ ఏదో జరగబోతోందని ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది.  మధ్యలో మధ్యలో కొంత టెంపో మిస్‌ అయిన ఫీలింగ్‌ కనిపిస్తుంది.  ఇంట్రవెల్ తర్వాత వచ్చే ట్విస్ట్ లు  పెంచితే కథ వేరేలా ఉండేది. కాకపోతే దాన్ని నడిపించిన తీరు బాగుంది. సీరియస్‌గా సాగకుండా ఫ్రెండ్స్ షిప్‌ ఎలిమెంట్స్ హార్ట్ టచ్చింగా ఉంటాయి.  పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ వేగం అవసరం. క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకి పెద్ద అసెట్‌. అది వాహ్‌ అనిపిస్తుంది. కాకపోతే ఎండింగ్‌ మాత్రం సస్పెన్స్ తోనే ముగిసిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇలాంటి సినిమాల్లో వేగం చాలా ముఖ్యం. ఆ విసయంలో దర్శకుడు కేర్‌ తీసుకోవాల్సి ఉంది. కొన్ని ట్విస్ట్ లు, టెన్షన్‌ క్రియేట్‌ చేసే అంశాలుంటే సినిమా ఫలితం ఇంకో స్థాయిలో ఉండేదని చెప్పొచ్చు.
 


టెక్నికల్ గా ...
ఇలాంటి సినిమాకు అవసమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగోలేదు. టాప్ టెక్నీషియన్ అయినా జిబ్రాన్ ఈ సబ్జెక్టుకు న్యాయం చేయలేదు.ఇక సినిమాటోగ్రఫీ బావుంది. విజువల్స్ బాగున్నాయి.  యాక్షన్ సీన్స్ తక్కువే అయినా నేచరుల్ గా అనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్సరారాణితో  ఒక్కటే పాట ..అది బాగుంది. దర్శకుడు ఇలాంటి సబ్జెక్టులను క్యాజువల్ గా డీల్ చేస్తే కలిసొచ్చేదేమీలేదు. మేకింగ్,టేకింగ్ లో కూడా టెన్షన్ క్రియేట్ చేయగలగాలి. అలాగే ఫైనల్ ట్విస్ట్ వచ్చేదాకా ప్రేక్షకుడుని ఖాళీగా కూర్చోబెట్టకూడదు. ఎంగేజ్ చేయాలి. మారిన ప్రేక్షకుడుని సెల్ ఫోన్ తీసుకుని వాట్సప్ లోకి వెళ్లనిచ్చేలా ఉండకూడదు.  ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంచి,సెకండాఫ్ స్పీడు పెంచితే బాగుండేది. మాటలు   బాగున్నాయి.ప్రొడక్షన్ వాల్యూస్  భవ్య క్రియేషన్స్‌ బ్యానర్ కు తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.
 


నటీనటుల్లో... : 

సుధీర్ బాబుకు పోలీస్ పాత్రలు కొత్తేమీ కాదు.  ఇంతకు ముందు ఇంద్రగంట మోహన్ కృష్ణ  'వి'లోనూ  చేశారు. ఇలాంటి పాత్రలకు కావాల్సిన  పర్ఫెక్ట్ ఫిజిక్ ఉంది. అయితే చొక్కా విప్పి పదే పదే చూపెట్టక్కర్లేదనిపిస్తుంది. అలాగే నటన కూడా గత సినిమాల కన్నా బాగుంది. గతం మర్చిపోయి, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక క్లూలెస్ గా కనిపించేలా బాగా చేసారు. . శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్, చిత్రా శుక్లా, కబీర్ సింగ్, మంజుల ఘట్టమనేని, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ ఉన్నంతలో బాగా చేశారు.


హైలెట్స్
కొత్త తరహా ట్విస్ట్ తో నడిచే కథనం
సుధీర్ బాబు నటన

క్లైమాక్స్..

మైనస్ లు  
స్లోగా సాగటం
సహనపరీక్ష పరీక్ష పెట్టే స్క్రీన్ ప్లే

 


ఫైనల్ థాట్
 ఇలాంటి షాకింగ్ ట్విస్ట్ ఉన్న కథని ఒప్పుకున్నందుకు సుధీర్ బాబు గట్స్ ని మెచ్చుకోవాల్సిందే.  అయితే ఆ గట్స్ ని అంతే గౌరవంగా తెరపైకి తీసుకురావాల్సింది. 

--సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2.5

నటీనటులు : సుధీర్ బాబు, భరత్ నివాస్, శ్రీకాంత్, చిత్రా శుక్లా, 'మైమ్' గోపి, కబీర్ దుహాన్ సింగ్, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ తదితరులు
కథ, కథనం : బాబీ - సంజయ్
ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్
సంగీతం : జిబ్రాన్  
నిర్మాత : వి. ఆనంద ప్రసాద్
రచన, దర్శకత్వం : మహేష్ 
విడుదల తేదీ: జనవరి 26, 2023

click me!