మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనుపమ పరమేశ్వరన్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ దక్కించుకుంది. ఆమె మొదటి చిత్రం ప్రేమమ్ మలయాళంలో సంచలన విజయం సాధించింది.
ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం అ ఆ.. దర్శకుడు త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ గా ఆమెకు ఆ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే అనుపమ చుటే లుక్స్, యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
అ ఆ సూపర్ హిట్ కాగా, అనుపమకు వరుస ఆఫర్స్ దక్కాయి. శతమానం భవతి మూవీతో సోలో హీరోయిన్ గా సూపర్ హిట్ కొట్టి, ఇక్కడ తన స్థానం సుస్థిరం చేసుకుంది. శతమానం భవతి చిత్రం తరువాత ఆమెకు సరైన హిట్ తగల్లేదు.
ఉన్నది ఒకటే జిందగీ, తేజ్, కృష్ణార్జునయుద్ధం, హలో గురూ ప్రేమకోసమే వంటి చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేదు. దీనితో అనుపమ కెరీర్ నెమ్మదించింది.
2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు చిత్రంలో అనుపమ నటించారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నిఖిల్ కి జంటగా 18పేజెస్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
కెరీర్ బిగినింగ్ నుండి చూస్తే అనుపమ గ్లామర్ రోల్స్ చేసిన దాఖలాలు లేవు. అది ఆమెకు మైనస్ కూడా అని చెప్పాలి. అనుపమ అంటే కేవలం ఓ తరహా రోల్స్ కి మాత్రమే పనికి వస్తుందన్న బ్రాండ్ ఇమేజ్ పడింది.
దీనితో గ్లామర్ రోల్స్ అనుపమకు దర్శకులు ఆఫర్ చేయడం లేదు. తాను గ్లామర్ రోల్స్ కూడా చేయగలనని, హాట్ నెస్ నాలో కూడా ఉందని అనుపమ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.
హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ... స్కిన్ షోకి సిద్ధం అంటూ హింట్ ఇస్తున్నారు. గత కొంత కాలంగా అనుపమ ఇంస్టాగ్రామ్ అకౌంట్ పరిశీలిస్తే ఈ విషయం ఖచ్చితంగా అర్థం అవుతుంది.