maestro
హిందీ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాధున్’కు అఫిషియల్ తెలుగు రీమేక్ 'మాస్ట్రో'. ఈ చిత్రం అఫిషియల్ గా ప్రకటించిన నాటి నుండీ ఇందులో టబూ పాత్రలో ఎవరు నటిస్తారు అనేదాని మీద భారి చర్చ జరిగింది. టబూ చేతే చేయించాలి అని ఎంత ప్రయత్నించినా అందుకు ఆమె ఒప్పుకోలేదు. చేసిన పాత్రే మళ్ళీ చెయ్యను అని తేల్చి చెప్పేయటంతో తమన్నాని సీన్ లోకి తెచ్చారు. ‘అంధాధున్’లో టబూ పాత్ర ఎంతో కీలకం. తన నటనతో విమర్శకుల ప్రశంసలను అమితంగా పొందడంతో పాటు ఫిల్మ్‌ఫేర్ సహా అనేక అవార్డులను గెలుచుకుంది. అయితే ఆ స్థాయిలో తమన్నా చేయలేదని… ఇది మంచి ఛాయస్ కాదని విమర్శలు వచ్చాయి. తమన్నా అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ అదరకొట్టిందా లేక సినిమానే తల క్రిందులు చేసేసిందా! అసులు తెలుగులో రీమేక్ చేసేటంత గొప్ప విషయం ఈ సినిమాలో ఏముంది,నితిన్ ఎందుకు ఈ సినిమా చేయటానికి ఆసక్తి చూపించాడు? తెలుగులో ఈ రీమేక్ కు చేసిన మార్పులు ఏమిటి
కథ
పియోనిస్ట్ అరుణ్(నితిన్) అంధుడుగా నటిస్తూంటాడు.పోగ్రామ్ లు చేస్తూంటాడు. పియోనో ప్రాక్టీస్ చేస్తూంటాడు. ఇళ్లకు వెళ్లి పోగ్రామ్ లు ఇస్తూంటాడు. ఆ క్రమంలో ఓ రోజు ఓ ఇంటికి పియానో వాయించటానికి వెళ్లి...ఓ అక్రమ సంభందానికి, ఓ హత్యకు సాక్ష్యం అవుతాడు. తాను అంధుడు కదా, తను చూసానన్న విషయం తెలియదు కదా, అవతలి వాళ్లు లైట్ తీసుకుంటారు అనుకుంటాడు. కానీ అవతలి ఉన్నది క్రూరత్వానికి బ్రాండ్ అంబాసిడర్స్ లాంటి జంట సిమ్రాన్(తమన్నా),బాబి( జిషు సేన్ గుప్త) వాళ్లు తాము చేసిన నేరం కప్పి పుచ్చుకునేందుకు ఎంతటి నేరం చేసేందుకైనా,ఎవర్ని లేపేయటానికైనా సై అంటారు. తమ తప్పుకి ఏ సాక్ష్యం ఉండకూదనుకుంటారు. వారిద్దరు బారి నుంచి అరుణ్ తప్పించుకున్నాడా..అరుణ్ అంధుడు కాదనే నిజం బయిటపడిందా. అతన్ని ప్రేమించిన సోఫీ (నభా నటేషా) పాత్ర కథలో ఏమిటి? అసలు అరుణ్ ఎందుకు అంధుడుగా నటిస్తున్నాడు. హత్యకు గురి అయ్యింది ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే సత్తా
అంథాధున్ స్క్రిప్టుని డైరక్టర్ శ్రీరామ్ రాఘవన్ ఎంత ఫెరఫెక్ట్ గా రాసాడంటే దాన్ని మార్చటం చాలా కష్టం అనిపించేలా. మారిస్తే రీమేక్ ఫేట్ మారిపోతుందేమో అని భయపడేలా. ఆ విషయం మేర్లపాక మురళి అర్దం చేసుకన్నారు. మాగ్జిమం యాజటీజ్ ఒరిజనల్ ని ఫాలో అయ్యిపోయారు. అయితే ఒరిజనల్ లో ఉన్న క్రూరత్వాన్ని, హింస, శృంగార పాళ్లను డోస్ తగ్గించాడు. ఆడియన్స్ మారినప్పుడు బీట్ మార్చాలి కదా. అలాగే రీమేక్ చేస్తున్నాం..మన సొంత సీన్స్ కలపకపోతే ఏం బావుంటుంది అని భావించకుండా మార్పులు చేయకపోవటమే బాగుంది. అందుకే తెలుగులోనే అంతే టైట్‌గా ఉంది స్క్రీన్‌ప్లే. ఏ మాత్రం మార్చినా మనని ఏమార్చేస్తుంది. ఫస్ట్ సీన్ తీసేస్తే క్లైమాక్స్ లో సీన్ లింక్ తెగిపోతుంది. మరో సీన్ లేపేస్టే వేరే చోట లింక్ నలగిపోతుంది. ఇలాంటి స్క్రిప్టులు,స్క్రీన్ ప్లేలు మక్కీకి మక్కీ అనిపించుకున్నా మార్చలేరు. మరీ కాదనుకుంటే మార్చర్చు కానీ అందుకు నిర్మాత, దర్శకుడు,హీరో అందరికీ ఏమైపోయినా ఫర్వాలేదు..మనకు తోచినట్లు చేద్దాం అనిపించే ధైర్యం ఉండాలి.
ఏదైమైనా అంధాధున్ సినిమాకు బలం ఊహించని ట్విస్ట్‌లు.. కథలో ని ప్రతి క్యారక్టర్ కూ అర్దవంతమైన కంటిన్యూటీ. ఒక క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి ఇంకో క్రైమ్.. దాని నుంచి బయటపడడానికి ఇంకో పెద్ద క్రైమ్. తమకు ఎదురయ్యే ప్రతి సిట్యువేషన్ ని ఒక పరిస్థితిని ఎవరికి వాళ్లు ఉపయోగించుకోవడం.. అవతలి వాడి ఇబ్బందులను, కష్టాలని తమకు లాభంగా వాడుకోవాలనుకోవడం.. వీటిన్నటినీ ఈ స్క్రిప్టులో చూపినట్లు వేరే సినిమాలో చూడం. అయితే అవన్నీ యాజటీజ్ క్యారీ ఫార్వర్డ్ అయ్యాయా తెలుగులో అంటే అయ్యాయి..అవ్వలేదు అని చెప్పాలి. కథగా,సీన్స్ గా,ట్విస్ట్ లుగా అన్ని తెలుగులోకు వచ్చేసాయి. కానీ ఆ వైల్డ్ నెస్ తెలుగులో చూడం. ఆ రానెస్ తెలుగులో కనిపించదు. చాలా స్మూత్ గా సంఘటనలు చెప్తున్నట్లు అనిపిస్తాయి. అంటే జేవీ సోమయాజులు అర్జున్ రెడ్డి సినిమాని వివరిస్తున్నట్లు అనిపిస్తుంది. హిందీ డైరక్టర్ చేసిన మ్యాజిక్ మాత్రం మిస్సైంది.
Maestro
దాంతో హిందీలో ఆల్రెడీ ఈ సినిమా చూసినవాళ్లకు తెలుగులో చూసినప్పుడు ఏమీ మారనప్పుడు ఏమీ రుచించకపోవచ్చు కూడా. అది వేరే విషయం. అయితే హిందీలో చేసింది ఆయుష్మాన్ ఖురానా కాబట్టి ఆ పాత్ర అలా మాగ్జిమం ప్యాసివ్ గా ఉన్నా ఇబ్బంది అనిపించలేదు. కానీ ఇక్కడ మనకు ఫైట్స్,పాటలు జోరుగా చేసే నితిన్ హీరో అవటంతో కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. హీరో ఏమి చేయటం లేదేంటి అనిపిస్తుంది. అయితే అందుకు నితిన్ ఇమేజ్ ని తప్పు పట్టాలే కానీ నితిన్ నటనను ఏమీ అనలేం. అరుణ్ గా నితిన్ ఫెరఫెక్ట్ గా క్యారక్టర్ లోకి పరాకయ ప్రవేశం చేసాడు.
Maestro
సంగీతం,మిగతా విభాగాలు
ఇలాంటి సినిమాలకు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే సెట్ అయ్యింది. కానీ మహతి స్వర సాగర్ ఆల్బమ్ మాత్రం వర్కవుట్ కాలేదనిపిస్తుంది. అయితే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పియోనో థీమ్ మ్యూజిక్ మాత్రం హాంటింగ్ ఉంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. ఎస్.ఆర్.శేఖర్ ఎడిటింగ్ జస్ట్ ఓకే.సెకండాఫ్ ని ఇంకాస్త ట్రిమ్ చేయచ్చేమో.
Maestro
డైరక్టర్ గా మేర్లపాక గాంధీ ‘అంధాదున్’ను రీమేక్ చేయాలనుకోవటం ఓ సాహసమే. మార్చటానికి, మార్చేందుకు , తన ముద్ర వేసేందుకు ఏమీ లేదు. అయినా మాగ్జిమం ఎక్కడా ఏమీ చెడకుండా అందించాడు. తెలుగుకు అని తీసుకున్న జాగ్రత్తలే సినిమా ఇంటెన్స్ ని తగ్గించాయనిపించింది. నటీనటుల నుంచి మంచి నటన,టెక్నీషియన్స్ నుంచి మంచి అవుట్ ఫుట్ రాబట్టుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా రాజీపడలేదు. థియేటర్ రిలీజ్ స్దాయిలో సినిమా ఉంది!
Maestro
నటీనటుల్లో...ఆయుష్మాన్ తో పోటీ పడ్డాడు అనలేం కానీ నితిన్ మాగ్జిమం మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. అతని కెరీర్లో ‘మాస్ట్రో’ ఓ విభిన్న చిత్రంగా నిలుస్తుంది. ఇక ఈ సినిమాలో మొదట చెప్పుకోవాల్సింది సిమ్రన్ గా చేసిన తమన్నా గురించి. అసలు ఆమె నుంచి అలాంటి నటనను ఊహించం. మిగతా పాత్రల్లో జిషు సేన్ గుప్త, నభా నటేశ్, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, అనన్య నాగళ్ల, అలా చేసుకుంటూ వెళ్లిపోయారు. హర్ష వర్దన్ చాలా కాలం తర్వాత గుర్తుండిపోయే డాక్టర్ పాత్రలో కనిపించారు.
Maestro
బాగున్నవి:
తమన్నా నటన
అదిరిపోయే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్
బాగోలేనవి:
మరీ అంధాదున్ కు జెరాక్స్ లా ఉండటం
ఎమోషనల్ జర్నీ పెద్దగా లేకపోవటం
నితిన్ వంటి హీరో చేయదగ్గ సినిమా కాదనిపించటం
బ్లాక్ కామెడీ అన్నారు కానీ అంత కామెడీ కనపడకపోవటం
Maestro
ఫైనల్ థాట్
ఇది తమన్నా 'మాస్ట్రో'క్
హిందీలో టబు ఈ రోల్ చేశారు. తెలుగులో తమన్నా కూడా చక్కగా నటించింది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
Maestro
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్;
నటీనటులు: నితిన్, తమన్నా, నభా నటేశ్, జిషు సేన్ గుప్త, నరేశ్, శ్రీముఖి తదితరులు;
సంగీతం: మహతి స్వర సాగర్;
సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్;
ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్;
నిర్మాత: సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి;
దర్శకత్వం: మేర్లపాక గాంధీ;
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్;
విడుదల తేదీ:
రన్ టైమ్ :2 గంటల 15 నిముషాలు
ఓటీటి డీస్నీ+హాట్‌స్టార్ :17,సెప్టెంబర్ 2021.