గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’ రివ్యూ

First Published | May 24, 2024, 3:42 PM IST

రాజు యాదవ్ (గెటప్ శ్రీను) ఓ ప్రమాదం కారణంగా ఎప్పటికీ నవ్వుతున్నట్లు అతని ఫేస్ మారిపోతుంది. అక్కడ నుంచి ఏం జరుగుతుంది. 

Raju Yadav


పాపులర్ కమిడయన్స్ బ్రహ్మానందం, బాబు మోహన్, అలీ, వెన్నెల కిషోర్, వేణు మాధవ్,సునీల్ ఇలా చాలా మంది తమను తాము హీరోలుగా చూసుకున్నారు. అయితే వాళ్లలో సక్సెస్ అయ్యింది అలి,సునీల్ మాత్రమే కాస్త లాంగ్ స్టాండిగ్ ఉన్నారు. మిగతా వాళ్లు ఒకటి రెండు సినిమాలు చేసి మళ్లీ తమ పాత రూట్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే రూటులో జబర్దస్త్ లో వెలిగిన కమిడయన్స్ సుడిగాలి సుధీర్, ధన్ రాజు వంటివారు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. అదే ప్రేరణలతో అనుకుంటా గెటప్ శ్రీను సైతం హీరోగా ఓ సినిమా చేసారు. రాజు యాదవ్ టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది, కథేంటో చూద్దాం. 


స్టోరీ లైన్

మహబూబ్ నగర్ కు చెందిన రాజు యాదవ్ (గెటప్ శ్రీను) బేవార్స్ టైప్, ఓ రోజు క్రికెట్ ఆడుతూ ఆ బాల్ వచ్చి మొహానికి తగులుతుంది. వెంటనే హాస్పటిల్ కు వెళ్తే అక్కడ తెలిసీ తెలియని డాక్టర్ కుట్లు సరిగ్గా వేయకపోవటం మొహం  ఎప్పుడూ నవ్వే ఫేస్ లా ఉండిపోతుంది. దాన్ని సరిచేయాలంటే మళ్లీ ఆపరేషన్ చేయాలి నాలుగు లక్షలు అవసరం. కానీ అంత డబ్బు లేక దాంతో కంటిన్యూ అయ్యిపోతూంటాడు. దాంతో  ఎప్పుడూ నవ్వుతూ కనపడటంతో  కొన్నిసార్లు నవ్వులు పాలవుతూ కాలక్షేపం చేస్తూంటాడు. ఈ క్రమంలో అతను ఓ సారి  స్వీటీ (అంకితా కరాట్) అనే సాప్ట్ వేర్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. మొదటి ఆమె పట్టించుకోకపోయినా అతను సమస్య విని సానుభూతి చూపెడుతుంది. ప్రెండ్షిప్ చేస్తుంది. దాంతో ఆమెతో పూర్తిగా ప్రేమలో మునిగిపోతాడు. ఆమె కోసం దేనికైనా రెడీ అవుతాడు. అయితే ఆమెకు ఆల్రెడీ ఓ బోయ్ ప్రెండ్ ఉన్నాడు. ఆ విషయం తెలిసిన రాజు ఏం చేసాడు. తన ప్రేమను గెలుచుకున్నాడా..ఆపరేషన్ చేయించుకున్నా తన మొహాన్ని తిరిగి యధాతథంగా తెచ్చుకోగలిగాడా అనేది మిగతా కథ. 

Latest Videos


Get up Srinu

 ఎలా ఉంది

ఆ ఒక్కటి అడక్కు(రాజేంద్రప్రసాద్) సినిమాలో బ్రహ్మానందం ది ఓ డిఫరెంట్ క్యారక్టర్. గతంలో దూరదర్శ న్ లో న్యూస్ రీడర్ గా చేసి ఉంటాడు. ఆనందకరమైన విషయాలకు ఏడుపు మొహం, బాధాకరమైన విషయాలకు స్మైల్ ఫేస్ పెడుతూంటాడు.  అప్పట్లో ఆ క్యారక్టర్ తెగ నవ్వించింది. అలాగే ఈ సినిమాలోనూ హీరో ఎప్పుడూ నవ్వు ఫేస్ తో ఉండాల్సి రావటం అనేది మంచి ఐడియానే. అయితే ఐడియా అక్కడదాకానే ఆగిపోయింది. సరైన స్టోరీ విస్తరణ సరిగ్గా లేదు. ఆ పాయింట్ మీదే సినిమా తీస్తే సాగ తీసినట్లు ఉంటుందని ఫీల్ అయ్యారో ఏమే కానీ లవ్ స్టోరీ మీద కాన్సర్టేట్ చేసారు. అయితే ఇప్పుడు గెటప్ శ్రీను లవ్ స్టోరీ అంటే పెద్ద సీరియస్నెస్ అయితే అనిపించలేదు. క్యారక్టర్ లో ఎమోషన్ డెప్త్ మనకు కనిపించకపోతే ఆ ప్రేమ కథను మనం ఆమోదించలేము. అదే ఇక్కడా జరిగింది. సరైన సీన్స్ రాసుకోకపోవటంతో పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. కథకప కీలకమైన హీరోయిన్ క్యారక్టర్ కూడా గతంలో మనం చూసిన సినిమాలు గుర్తుకు తెస్తూ సాగుతుంది. 
 

 
ఎప్పుడూ నవ్వుతూ ఉండే మొహం వలన వచ్చే సమస్యలు  తీర్చిదిద్దిన స‌న్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్ కి ముందు చోటు చేసుకునే మ‌లుపు సెకండ్ హాఫ్ పై ఇంట్రస్ట్ ని పెంచుతుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత ఈ క‌థ‌, క‌థ‌నాలు పూర్తిగా పట్టుతప్పి ఎటు నుంచి ఎటు వెళ్తుందా అనిపిస్తుంది. హీరోయిన్ వెనక పడే సీన్స్ ఏ మాత్రం రక్తికట్టలేదు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే ఓవర్ డ్రామాగా అనిపిస్తాయి. కీ సీన్స్ గా నిలవాల్సిన హీరో,హీరోయిన్స్ మధ్య సీన్స్ ని  మరీ పేలవంగా చూపించారు. క్లైమాక్స్ కూడా తేలిపోయింది. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా సినిమా చేసారు అన్నారు కానీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కు  ఫిక్షన్ జోడించడం ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ ఇందులో సరిగ్గా కుదరలేదు.  

నటీనటులు నటన:
రాజు యాదవ్  పాత్రలో గెటప్ సీన్ ఒదిగిపోయారు. అంతసేపు ఒకే ఎక్సప్రెషన్ మెయింటైన్ చేయటం మామూలు విషయం కాదు. అలా చిత్రంగా డైలాగులు చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. ఆయన వాయిస్ పాత్రకు ప్లస్ అయ్యింది.  హీరోయిన్  పాత్ర జస్ట్ ఓకే అనిపిచింది.   హీరో తండ్రిగా ఆనంద చక్రపాణికి న్యాయం చేసారు.  కొన్ని సీన్స్  ఆయన నటన మిగతా మెయిన్ ఆర్టిస్ట్ లను కూడా డామినేట్ చేయగలిగారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన గుండె బరువెక్కించేలా చేసారు. 

Raju Yadav


టెక్నికల్ గా: 

సురేష్ బొబ్బిలి   నేప‌థ్య సంగీతం కొన్ని సీన్స్ కు బాగా ప్లస్ అయ్యింది.  హర్షవర్ధన్ రామేశ్వర్ పాటలు బావున్నాయి.   కొన్ని సీన్స్ లో కేవలం నేపధ్య సంగీతమే డామినేటింగ్ వినిపిస్తుంది.   కెమెరా ప‌నిత‌నం డీసెంట్ గా వుంది.   డైలాగులు సోసోగా ఉన్నాయి. దర్శకుడు మూర్తి ఫిక్షన్ ని జోడించే క్రమంలో ఇంకాస్త లాజికల్ గా క్రియేటివ్ గా వర్క్ చేయాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.  రన్ టైమ్ తగ్గించే భాధ్యత ఎడిటర్ తీసుకుంటే బాగుండేది. 
 

Get up Srinu


ప్లస్ పాయింట్స్ 
గెటప్ శ్రీను 
కొన్ని కామెడీ  సీన్స్ 


మైనస్ పాయింట్స్ 

కథ, కథనం 
సెకండ్ హాఫ్ బోర్ కొట్టే సీన్స్ 

క్లైమాక్స్

బేబీ సినిమాని గుర్తు చేయటం

ఫైనల్ థాట్:

స్క్రిప్టు బాగున్న సినిమానే పెద్ద సినిమా. స్క్రిప్టు వర్కవుట్ కాని విసుగెత్తించేదే చిన్న సినిమా. అంటే కథ,కథనం బాగుంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా థియేటర్ కాకపోయినా ఓటిటిలో అయినా సినిమాని ఆదరిస్తున్నారు జనం. లేకపోతే అన్నిచోట్లా ఒకటే రిజల్ట్.
Rating: 2/5
 

నటీనటులు: గెటప్ శ్రీను, అంఖితా కారట్, ఆనంద చక్రపాణి, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచర్ల తదితరులు.

దర్శకుడు: కృష్ణమాచారి. కె

నిర్మాత: రాజేష్ కల్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి

సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్

సినిమాటోగ్రఫీ: సాయి రామ్ ఉదయ్

ఎడిటింగ్: బొంతల నాగేశ్వర రెడ్డి

విడుదల తేదీ : మే 24, 2024

click me!