Game On
బ్లూ వేల్ లాంటి గేమ్స్ ఆడి విదేశాల్లో చాలా మంది ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా అలాంటి ఘటనలు ఒకట్రెండు జరిగాయి. అయితే ఇలాంటివాటి చుట్టూ కథలు రెడీ చేసి తెరకెక్కించిన వాళ్లు మాత్రం లేరు. ఇదిగో ఇప్పుడు ఇంతకాలాని ఓ ఆన్ లైన్ గేమ్ చుట్టూ కథ అల్లారు. అయితే ఆ గేమ్ మంచిదా చెడుదా అనేది మనకు సినిమా చూస్తే కానీ తెలియని ఓ సైక్లాజికల్ థ్రిల్లర్ గా తీర్చి దిద్దారు. ఇంతకీ ఆ సినిమా స్టోరీ లైన్ ఏంటి, మన వాళ్లకు నచ్చే కథాంశమేనా వంటి వివరాలు చూద్దాం.
Game On
స్టోరీ లైన్
ఓ గేమింగ్ కంపెనీలో పని చేసే గౌతమ్ సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు(గీతానంద్) కొద్దిగా డిఫరెంట్ పర్శన్. తన వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో ఉంటుంది. టార్గెట్ రీచ్ కాకపోవటంతో జాబ్ పోతుంది. తన గర్ల్ ప్రెండ్ మోక్ష(వాసంతి) కూడా బ్రేకప్ చెప్పేసి ప్రెండ్ రాహుల్(కిరీటీ)తో జంప్ అయ్యిపోతుంది. కష్టాలు,మోసం చుట్టుముట్టిన స్దితిలో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. అయితే అప్పుడే అతనికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. అదీ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి. ఇది ఓ గేమ్ అని ‘నీ ముందు ఉన్న ఈగను చంపేస్తే లక్ష రూపాలయను అకౌంట్‌లో వేస్తాం’అని చెబుతాడు. మొదట ఇవన్నీ జరిగేవి కాదులే అని లైట్ తీసుకున్నా సరే ఈగను అయినా చంపలేకపోయాను అని గిల్టుతో చావడం ఎందుకని దాన్ని చంపితాడు.సిద్ధు ఈగను చంపగానే..అకౌంట్‌లోకి రూ.లక్ష క్రెడిట్ అవుతుంది. దీంతో షాక్ సిద్ధు ఆత్మహత్య ను ప్రక్కన పెట్టి ఇంటికెళ్తాడు.
Game On
అతనికి ఆ గేమ్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాతి మళ్లీ ఇంకో కాల్ వస్తుంది..‘మాది ఒక సైకలాజికల్ గేమ్ షో అని, చిన్న పిల్లను ఏడిపిస్తే..రూ.మూడు లక్షలు నీ ఎక్కౌంట్ లో వేస్తామని చెబుతారు. అలా వరుసగా చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తూ డబ్బులు క్రెడిట్ చేయటంతో సిద్ధు జీవితమే మారిపోతుంది. ఇప్పుడు అతని జీవితంలోకి తార(నేహా సోలంకి) వస్తుంది.ఫైనల్ గా ...అసలు టాస్క్ వస్తుంది. గేమ్‌లో భాగంగా ఓ వ్యక్తిని చంపాలని ఫోన్ కాల్ వస్తుంది. సిద్ధు ఆ టాస్క్‌ని పూర్తి చేయలేనని చెబుతాడు. అప్పుడు ఏం జరిగింది? అసలు మన హీరో కి టాస్క్‌లు ఇస్తున్నదెవరు? ఎందుకు ఇస్తున్నారు? సైకాలజిస్ట్ మదన్ మోహన్(ఆదిత్య మీనన్)కు ఈ గేమ్‌తో ఉన్న సంబంధం ఏంటి? సిద్ధు గతమేంటి? టాస్కులు పేరుతో హత్యలు చేయించడానికి కూడా ఎందుకు ప్రయత్నాలు చేశారు? అతని జీవితంలోకి వచ్చిన తార వల్లభనేని వల్ల గౌతమ్ తెలుసుకున్నదేంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Game On
ఎలా ఉందంటే..
ఈ సినిమాలో జనాలకు ఇంట్రస్ట్ గా కూర్చోబెట్టే పాయింట్ అయితే ఉంది. ద్రోహం, క్రైమ్, లవ్ అన్నీ ఇమిడ్చారు. అయితే వాటిన్నటినీ బాలెన్స్ చేయలేకపోయారనిపించింది. మొదట్లో స్లోగా ఉన్నా ..మెల్లిమెల్లిగా గేమ్ లోకి వెళ్లాకి కథ బాగుందే అనిపిస్తుంది. చనిపోవటం తప్పించి వేరే దారి లేదు అనుకున్న సమయంలో ఒక చిన్న ఈగని చంపితే లక్ష రూపాయలు రావడంతో ఇంట్రస్ట్ క్రియేట్ అవుతుంది. మెల్లిగా కథలో లీనం చేస్తూ ముందుకు తీసుకు వెళ్లిన దర్శకుడు ఒక్కొక్క టాస్క్ ఇస్తూ సినిమా మీద ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని టాస్కుల వరకు బాగానే ఉన్నా కొంతదూరం వెళ్లాక వాట్ నెక్ట్స్ అనిపించింది.
Game On
ఈ గేమ్ లో డబ్బులు వెయ్యటం అనే అంశం ఇంట్రస్ట్ గా ఉన్నా..ఎందుకు ఎవరు వేస్తున్నారు..లాజికల్ గా ఉంటుందా ఆ ఆన్సర్ అనేది ఎదురుచూసేలా చేసింది. అయితే ఆ సీక్వెన్స్ లు మాత్రం ఫెరఫెక్ట్ గా రాసుకున్నారు. అలాగే ఈ టాస్క్ లు ఇవ్వటం వెనక కథ, హీరో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దగ్గరకు వచ్చేసరికి జస్ట్ ఓకే అనిపిస్తాయి. టాస్క్ లు నుంచి పుట్టే ఇంట్రస్ట్ తప్పించి సినిమాల్లో ఇంకో చెప్పుకోదగ్గ కిక్ ఇచ్చే ఎలిమెంట్ అయితే లేదు. ఇలాంటి కథలు వర్కవుట్ అవ్వాలంటే స్టోరీ టెల్లింగ్ లోనే ఓ కొత్తదనం ఉండాలి. అలాగే ఎమోషనల్ గ్రావిటీ కూడా ఫెరఫెక్ట్ గా సింక్ అవ్వాలి. ఏదైమైనా ఇంకాస్త టైట్ గా స్క్రీన్ ప్లే ఉంటే ఖచ్చితంగా బాగుండేది.
Game On
ప్లస్ లు
స్టోరీ లైన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కెమెరా వర్క్
మైనస్ లు
స్క్రీన్ ప్లే
ఎమోషనల్ కనెక్టవిటీ లేకపోవటం
మధుబాల
Game On
టెక్నికల్ గా ..
అద్బుతం కాదు కానీ థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెరఫెక్ట్ గా కుదిరింది. కెమెరా వర్క్ లో కొన్ని యాంగిల్స్ కథలో డెప్త్ ని ఎలివేట్ చేసాయి. ఇంకా ఏదో ఉందేమో అన్న ఫీల్ తెచ్చింది. లైట్స్, షాడో లను బాగా వాడుకున్నారు. అలాగే ఓ గమ్మత్తైన ఎట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసారు. డైరక్టర్ మాత్రం విజువల్ స్టోరీ టెల్లింగ్ ని పెదద్గా నమ్ముకున్నట్లు లేరు. నేరేషన్ ఇంకాస్త ఇంపాక్ట్ గా ఉండుంటే మరింత ఎలివేట్ అయ్యేవి. టెన్షన్, డార్కనెస్ కథలో ఉన్నట్లుగా తెరమీదకు రాలేదేమో అనిపించింది.ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది.
Game On
నటీనటుల్లో ..
ప్రధాన పాత్రలో పాత్రలో గీతానంద్ బాగా చేసారు. యాక్షన్ సీన్స్ బాగానే మేనేజ్ చేసారు. కొత్తదనం పెద్దగా కనపడలేదు. తారగా నేహా సొలంకి తెరపై కాస్త హాట్‌గా కనిపించింది గీతానంద్, నేహ సొలంకిల కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యింది. సీనియర్ హీరోయిన్ మధుబాల జస్ట్ ఓకే. సైకాలజిస్ట్ మదన్ మోహన్‌గా ఆదిత్య మీనన్ బాగా చేశాడు. శుభలేఖ సుధాకర్, వాసంతి, కిరిటీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చేసుకుంటూ వెళ్లారు.
Game On
ఫైనల్ థాట్
ఈ గేమ్ ...ఓటిటి గేమ్ లాగ అనిపించింది. కాన్సెప్టు కొత్తగా ఉంది. ఎగ్జిక్యూషన్ లో ఇంకాస్త బాగా చేయల్సింది.
Rating: 2.5
Game On
నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరీటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు
నిర్మాత: రవి కస్తూరి
దర్శకత్వం: దయానంద్
సంగీతం: అభిషేక్ ఏఆర్(బీజీఎం), నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్(పాటలు)
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్: వంశీ అట్లూరి
విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024