#Malik:ఫహద్‌ ఫాజిల్‌ ‘మాలిక్‌’(తెలుగు) రివ్యూ

First Published Aug 15, 2022, 4:20 PM IST

 ‘పుష్ప’, ‘విక్రమ్‌’ సినిమాలు చూసిన వారు  ఫహద్‌ ఫాజిల్‌ ని మర్చిపోవటం కష్టమే. ఆ స్దాయి ఫెరఫార్మెన్స్ ఇస్తారు ఆయన. గతేడాది ఆయన నటించిన మలయాళ చిత్రం ‘మాలిక్‌’ని తెలుగులో డబ్బింగ్ చేసి ఆహాలో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. అక్కడ హిట్టైన ఈ  చిత్రం కథేంటి? తెలుగు వాళ్లకు నచ్చేదేనా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Fahadh Faasil Malik

కథాంశం:

కేరళ...తిరువనంతపురంలోని సముద్రతీరం దగ్గర ఓ గ్రామం రామదాపల్లి . ఆ ఊరి ప్రజలు పెద్ద దిక్కుగా, ఓ గాడ్ ఫాధర్ గా చూసుకునే గ్యాంగస్టర్ అహమ్మద్ అలీ సులేమాన్ మాలిక్ (ఫహద్ ఫాజిల్) . అతను మక్కా యాత్రకు సిద్దపడుతూంటాడు. అయితే అదే సమయంలో అతన్ని పాత మర్డర్  కేసులో అరెస్ట్ చేస్తారు. అంతేకాకుండా అతన్ని జైల్లోనే వేసేయటానికి రంగం సిద్దం చేస్తూంటారు పోలీస్ డిపార్టమెంట్ లో కొందరు అధికారులు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్దపడుతుంది అతని తల్లి. అలాగే అలీ ను బయటకు తీసుకురావడానికి భార్య రోజెలిన్ (నిమిషా సజయన్) ప్రయత్నిసూ ఉంటుంది. 
 

Fahadh Faasil Malik


ఊరంతా మాలిక్ కు సపోర్ట్ గా ఉంటుంది. ఇది గమనించి మరో ప్రక్క ఓ రాజకీయ నాయుడుకు గేమ్ ఆడుతూటాడు. అసలు ఈ మాలిక్ ఎవరు...అతను ఆ ఊరి జనాలకు ఎందుకు అంత ప్రీతి పాత్రుడయ్యాడు. పోలీస్ ల దృష్టిలో బడా డాన్‌గా, మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ గా ఎందుకు అనిపించుకున్నాడు. అసలు మాలిక్ నిజ స్వరూపం ఏమిటి... తల్లే అతనికి ఎందుకు రివర్స్ అయ్యి...వ్యతిరేక సాక్ష్యం చెప్పబోతోంది. చివరకు మాలిక్ జీవితం ఏమైంది.. తను జైలు నుంచి బయటకు వచ్చాడా? రాజకీయ కుట్రల నడుమ మాలిక్‌ కథ ఎలా ముగుస్తుందనే వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Fahadh Faasil Malik

విశ్లేషణ:

ఈ కథ ...సులేమాన్ అనే సామాన్యుడు..అసమాన్య పరిస్దుతుల్లో ..  మాలిక్ గా మారే క్రమం. ఓ రకంగా ఈ సినిమా మనకు ప్రపంచ ప్రసిద్ది చిత్రం గాఢ్ ఫాధర్ ని గుర్తు చేస్తుంది. సినిమాలో బీట్స్ అలాగే ఉన్నా నేటివిటి మనకు ఓ కొత్త సినిమాని చూస్తున్న ఫీల్ కలగచేస్తుంది. ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా స్క్రీన్ ప్లే పరుగెడుతుంది. మొదటి పదినిముషాలు ముస్లిం ప్రపంచం, సీరియస్ డ్రామా,పరిచయం లేని ఆర్టిస్ట్ లు కాస్త ఇబ్బంది పెడతారు. కానీ మెల్లిగా కథలోకి వెళ్లిపోయాక..తర్వాత ఏం జరుగుతుంనే ఆసక్తి మనని వేరే వైపు దృష్టి పోనివ్వదు. భూముల ఆక్రమణలు-దాడులు, బతుకు దెరువు కోసం అక్రమ వ్యాపారాలు.. ఇలా కొన్ని వాస్తవ ఘటనలను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. డైరక్టర్ మహేష్ నారాయణ్...మల్టిలేయర్స్ తో ఈ మాస్ ఎంటర్టైనర్ ని రూపొందించారు. ముఖ్యంగా క్యారక్టర్ డ్రైవన్ కథ కావటం.. ఆ పాత్ర కూడా చాలా బలమైనది కావటం,ఆర్క్ కలిగి ఉండటంతో పాటు , ఆ పాత్రను పోషించిన ఫహద్ ఫాజిల్ ఇచ్చిన క్లాస్ టచ్ నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. 

Fahadh Faasil Malik


ఏదో నిజ జీవిత పాత్రను, బయోపిక్ ని తెరపై చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ప్రారంభంలో తండ్రి లేని,భయం భక్తిలేని పిల్లాడుగా మాలిక్ పరిచయం , ఆ తర్వాత తమ ముస్లి లొకాలిటీలో సమస్యలను పరిష్కరించే తీరు. తెలియకుండా చెడు మార్గంలోకి వెళ్లటం...ప్రేయసి, టీచర్ తల్లి, తనతో తిరిగే మేకవన్నె పులి లాంటి పొలిటీషన్స్. పిరికివాడుగా ఉన్న ఓ ముస్లి లీడర్ ...మెల్లిగా తన చుట్టూ జరుగుతున్న సిట్యువేషన్స్ ని తన చేతుల్లోకి తీసుకోవటం...తనకు అనుకూలంగా మార్చుకుని, స్ల్మగ్రల్ గా మారి తను, తన చుట్టూ ఉన్న వారి ఎదుగుదలుకు కారణం అవటం. తనకు సపోర్ట్ గా ఓ పెద్ద గుంపుని సంపాదించటం...ఇవన్ని చకచకా చిన్నపాటి డ్రామాతో జరిగిపోతాయి. ఎక్కడా మనకు డ్రామా డ్రైగా అనిపించదు. అందుకు కారణం సినిమా స్క్రిప్టు మాత్రమే కాకుండా డైరక్షన్..అందుకు సహకరించిన ఇతన టెక్నిషియన్స్ పనితనం. ఇదంతా ఓ మ్యాజిక్ లా అనిపిస్తుంది. 

Fahadh Faasil Malik

టెక్నికల్ గా ...

ఈ సినిమాకు రైటింగ్ పెద్ద ఎస్సెట్. కేరళ సముద్రం తీర ప్రాతంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన పోలీస్ కాల్పులు, అక్కడ జరిగే స్మగ్మింగ్ వెనుక ఉన్న రాజకీయాలు కథకు నేపధ్యంగా తీసుకోవటంతో ప్రెష్ ఫీల్ వచ్చింది. అలాగే రియల్ లైఫ్ నేరేటివ్ విధానంలో కథను స్క్రీన్ పై ప్రెజెంట్ చేసారు. ఎక్కడా ఓవర్ బిల్డప్ లు, సినిమాటెక్ లకు డైరక్టర్ వెళ్లలేదు. వెట్రిమారన్ వడ చెన్నై వంటి సినిమాలు గుర్తు చేసినా సినిమా ప్లాష్ బ్యాక్ లో ఆనాటి రోజుల్లోకి తీసుకెళ్లి వదిలటం కలిసొచ్చింది. ఎక్కడక్కడి డ్రామా పట్టుకుని చివరిదాకా మనని కుర్చోబెడుతుంది. ఇక  సుషిన్‌ శ్యామ్‌ సంగీతం బాగుంది. డబ్బింగ్ కూడా నీట్ గా స్పష్టంగా ఉంది. అయితే పాటల్లో లిరిక్సే బాగోలేదు.  బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సైతం సినిమాకు వెన్నుముక. మేకప్‌..కాస్టూమ్స్‌ 60వ దశకం నుంచి 2000 వరకు టైం లైన్‌ లో ఈ కథని తీసుకెళ్లటానికి సపోర్ట్ చేసింది. . కథ, దర్శకత్వం  పాటు  తానే ఎడిటింగ్‌ చేసుకుని ‘మాలిక్‌’కు ప్రాణం పోసాడు దర్శకుడు మహేష్‌ నారాయణన్‌.  

Malik


నటీనటుల్లో ...

ఫహద్‌ ఫాజిల్‌, అతని భార్యగా  నిమిషా..  పోటీ నటించారు.  ఎక్కువ కామెడీ క్యారక్టర్స్  లో కనపడే వినయ్‌.. డేవిడ్‌ పాత్రలో  తో అలరించాడు.  మేనల్లుడు ఫ్రెడ్డీ క్యారెక్టర్‌లో సనల్‌ అమన్‌, డాక్టర్‌ షెర్మిన్‌గా పార్వతీ కృష్ణన్‌లు జీవించారు.ఇక  కలెక్టర్‌గా జోజూ జార్జ్‌ అయితే మామూలుగా చేయలేదు. మాలిక్‌ తల్లిగా జమీల, మాలిక్‌ గురువుగా సలీం కుమార్‌, పార్టీ నేతగా దిలీష్‌ పోతన్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారని చెప్పాలి. 
 

Malik


ఫైనల్ థాట్

ఆహా ఓటిటిలో మలయాళ చిత్రాలది ఓ ప్రత్యేక రికార్డ్ ..ఒరవడి. దాన్ని ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్లిందనే చెప్పాలి. 
Rating:3

---సూర్య ప్రకాష్ జోశ్యుల 
  

Malik

నటీనటులు: ఫహద్‌ ఫాజిల్‌, నిమిషా సజయన్‌, వినయ్‌ ఫోర్ట్‌‌, జోజీ జార్జ్‌, దిలీష్‌ పోథన్‌, తదితరులు; 
సంగీతం: సుషిన్‌ శ్యామ్‌; 
సినిమాటోగ్రఫీ: సాను జాన్‌ వర్గీస్‌; 
ఎడిటింగ్‌: మహేశ్‌ నారాయణన్‌; 
నిర్మాత: అనిల్‌ కె.రెడ్డి, కిషోర్‌ రెడ్డి; 

పాటలు, మాటలు: సామ్రాట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :శ్రీనివాస మూర్తి నిడదవోలు
సహా నిర్మాత: వి. జయప్రకాష్
నిర్మాతలు: అనీల్. కె. రెడ్డి, కిషోర్ రెడ్డి

నిర్మాణ సంస్థ‌: యాంట్స్‌ టు ఎలిఫెంట్స్‌ సినిమాస్‌; 
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేశ్‌ నారాయణన్;
 విడుదల: ఆహా; 
తేదీ: 12-08-2021

click me!