Dacoit Movie Review: డెకాయిట్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ మూవీ ఎలా ఉందంటే ?

Published : Apr 10, 2026, 07:47 AM IST

అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్ కలిసి `డెకాయిట్‌` చిత్రంలో నటించారు. అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ వంటి వారు నటించిన ఈ మూవీ నేడు విడుదలైంది. మరి సినిమా ఆడియెన్స్ ని మెప్పించిందా? 

PREV
17
డెకాయిట్‌ మూవీ రివ్యూ

అడవి శేష్‌ సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అనే ఒక పేరు పడిపోయింది. ఆయన అలాంటి చిత్రాలతో మెప్పించారు. యాక్షన్‌, దేశభక్తి, థ్రిల్లర్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలతో ఆకట్టుకున్నారు, విజయాలు అందుకున్నారు. ఇప్పుడు లవ్‌, ఎమోషనల్‌, యాక్షన్‌ చిత్రం `డెకాయిట్‌`తో వచ్చాడు. ఇందులో ఆయనకు జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. శానిల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. వీరితోపాటు ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌ ఎస్‌ ప్రొడక్షన్స్, సునీల్‌ నారంగ్‌ ప్రొడక్షన్స్ పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌ సమర్పకులు. నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 10)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? అడివి శేష్‌ మెప్పించాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

27
డెకాయిట్‌ మూవీ కథ ఏంటంటే

ఇది హిందూపురంలో కరోనా సమయంలో జరిగే కథ. హరిదాస్‌ (అడివి శేష్‌).. ఓ బ్లడ్‌ క్యాంప్‌లో సరస్వతి అలియాస్‌ జూలియట్‌(మృణాల్‌ ఠాకూర్‌)ని చూసి ఇష్టపడతాడు. ఆమెతో డీప్‌గా ప్రేమలో పడతారు. వీరిద్దరు ప్రేమించుకుంటున్న విషయం సరస్వతి అన్నయ్యకి తెలుస్తుంది. వీరిది అగ్రకులం. దీంతో హరిదాస్‌కి షెల్టర్‌ ఇచ్చి సపోర్ట్ చేస్తున్న మల్లీ(కామాక్షి భాస్కర్ల)పై అఘాయిత్యానికి పాల్పడతారు. దీంతో అతన్ని చంపేస్తాడు హరిదాస్‌. ఈ కేసులో హరి జైలుకు వెళ్తాడు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో తన జూలియటే హరి నేరస్థుడు అని, మల్లీపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అడ్డు వచ్చిన తన అన్నయ్యని చంపేశాడని తప్పుడు సాక్ష్యం చెబుతుంది. దీంతో హరి గుండెబద్దలవుతుంది. ఆ కోపంతోనే 13ఏళ్లు జైల్లో మగ్గుతాడు. అప్పుడే కరోనా వస్తుంది. జైలు నుంచి తప్పించుకుని తన జూలియట్‌ వద్దకు రాగా, ఆమె అప్పటికే మరో పెళ్లి చేసుకుంటుంది. కూతురు కూడా ఉంటుంది. భర్త ఆసుపత్రిలో హార్ట్ సమస్యతో బాధపడుతుంటాడు. ఆయనకు గుండెమార్పిడి చేయాల్సి ఉంటుంది. అందుకు కోటి రూపాయల వరకు డబ్బులు కావాల్సి వస్తుంది. తన భర్తని బతికించుకోవడం కోసం స్ట్రగుల్‌ అవుతుంది సరస్వతి. ఆమె పరిస్థితి చూసి కరిగిపోతాడు హరిదాస్‌. కరుణ ఆసుపత్రిలో కరోనా పేరుతో జరుగుతున్న దోపిడిని ప్రత్యక్షంగా చూస్తాడు హరి. దీంతో సరస్వతితో కలిసి డబ్బు దొంగతనానికి ప్లాన్‌ చేస్తారు? మరి ఈ ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యిందా? దొరికిపోయారా? సరస్వతిని ఇరికించేందుకు హరి వేసిన స్కెచ్‌ ఏంటి? ఇందులో ప్రకాష్‌ రాజ్‌, అనురాగ్‌ కశ్యప్‌ల పాత్రేంటి? సరస్వతికి సంబంధించి హరిదాస్‌కి తెలిసిన నిజమేంటి? తనను మోసం చేసిన జూలియట్‌ కోసం హరి ఎలాంటి త్యాగం చేశాడనేది మిగిలిన సినిమా.

37
డెకాయిట్‌ మూవీ ఎలా ఉందంటే?

అడవిశేషు పూర్తి స్థాయిలో లవ్‌ స్టోరీ ఇప్పటి వరకు చేయలేదు. మొదటిసారి ఒక హై ఎమోషనల్‌ లవ్‌ స్టోరీని చేశాడు. అయితే ఇందులో కరోనా సమయంలో హాస్పిటల్స్ లు చేసిన దోపిడిని మెయిన్‌గా చూపించారు. అదే సమయంలో ఎక్కువ కులం, తక్కువ కులం మధ్య అంతరాలను టచ్‌ చేశారు. ప్రేమ, ఎమోషన్‌, ప్రేమ కోసం పోరాటం వంటి అంశాలను ప్రతిబింబిస్తూ యాక్షన్‌ ప్రధానంగా ఈ మూవీని రూపొందించారు. లవ్‌ స్టోరీస్‌లో ఇదొక కొత్త తరహా కథగా చెప్పొచ్చు. తనని మోసం చేసిన హీరోయిన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చి, ఆమె పరిస్థితి చూసి హెల్ప్ చేయాలనుకోవడం కొత్తగా ఉంది. మొదటి భాగంలో మెయిన్‌గా అడవిశేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ మధ్య ప్రేమని చూపించారు. అదే సమయంలో ఆమె చేసిన ద్రోహాన్ని ఆవిష్కరించారు. దీంతో జైల్లో ఉన్న ఆయన తన ప్రేమని, ఆమె చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ కథ సాగుతుంది. ఆ తర్వాత ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం జైలు నుంచి తప్పించుకోవడం వంటివి సీన్లు హైలైట్‌గా సాగుతాయి. ఈ సమయంలో  `కన్నెపెట్టరో కన్నుకొట్టరో` సాంగ్‌ని వాడిన తీరు బాగుంది. ఆయా సీన్లు హోరెత్తిస్తాయి. లవ్‌ స్టోరీ ఆకట్టుకుంటుంది. కొంత రొమాంటిక్‌గా ఉంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే సీన్లు కొంత వాహ్‌ ఫీలింగ్‌ ఇస్తాయి. సెకండాఫ్‌.. దొంగతనం నేపథ్యంలో సాగుతుంది. హీరోయిన్‌ని హీరో కలవడం, ఆమె పడే స్ట్రగుల్స్ ని చూపించారు. ఆమె కోసం, తన కోసం దొంగతనానికి పాల్పడటం,   పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది వెంటపడటం, వీళ్లు తప్పించుకొని పారిపోవడం, ఈ క్రమంలో రేసింగ్‌ ప్రధానంగా సాగుతుంది. ఆ సమయంలోనే ప్రకాష్‌ రాజ్‌, అనురాగ్ కశ్యప్‌, సునీల్‌ వంటి వారి పాత్రలు ఎంట్రీ ఉంటుంది. పోలీసుగా అనురాగ్‌ కశ్యప్‌.. జైలు నుంచి పారిపోయిన హీరోని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు.  హరి  గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వాళ్లు తెలుసుకుంటారు. ఇవి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. మృణాల్‌ గురించి ఓ షాకింగ్‌ విషయం తెలిశాక హీరోలో మార్పు వస్తుంది. ఆ తర్వాత పోరాటమే మారిపోతుంది. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ని హార్ట్ టచ్చింగా, హై ఎమోషనల్‌గా తీసుకెళ్లారు. అదే స్థాయిలో ముగింపు పలికారు. సెకండాఫ్‌లో మృణాల్ పాత్ర మెయిన్‌గా కథ సాగుతుంది. అదే సినిమాకి బ్యాక్‌ బోన్‌.

47
డెకాయిట్‌లో మైనస్‌లు

అయితే సినిమా ఫస్టాఫ్‌లో చాలా సీన్లు కట్‌ పేస్ట్ లా ఉంటాయి. ఒకదానికి మరోదానికి సంబంధం లేదన్నట్టుగా సాగుతాయి. కన్‌ ఫ్యూజ్‌ చేస్తాయి. లవ్‌ స్టోరీలో ఫీల్‌ మిస్‌ అయ్యింది. డైలాగ్ లు అర్థం కాని విధంగా ఉన్నాయి. స్క్రీన్‌ ప్లే కొంత గందరగోళంగా అనిపిస్తుంది. ఏం చెప్పాలనుకున్నారనే క్లారిటీ మిస్‌ అయ్యింది. చాలా సీన్లు లాజిక్‌ లేకుండా ఉన్నాయి. సెకండాఫ్‌ కొంత బెటర్‌. కానీ ప్రేమ కోసం హీరో చేసే త్యాగం, పోరాటం కూడా లాజిక్‌ లెస్‌గా ఉంది. దొంగతనం సీన్లలో ల్యాగ్‌ ఉంటుంది. లాజిక్‌ లెస్‌గానూ ఉంటాయి. ఇందులో ఎమోషన్స్ ఇంకా బలంగా రాసుకోవాల్సింది.  టెక్నీకల్‌గా సినిమా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ డబ్బింగ్‌ పరంగా లోపలున్నాయి. బిజీఎం సినిమాని నడిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా ఫస్టాఫ్‌ పరీక్షించినా, సెకండాఫ్‌, ముఖ్యంగా క్లైమాక్స్‌ మెప్పించిందని చెప్పొచ్చు.

57
డెకాయిట్‌లో ఆర్టిస్టులు ఎలా చేశారంటే?

హరిదాస్‌ పాత్రలో అడివి శేష్‌ బాగా నటించాడు. అదరగొట్టారు. ఆయన పాత్రలో విభిన్నమైన షేడ్స్ ఉంటాయి. చాలా సెటిల్డ్ గా చేశాడు. ఒక కొత్త శేష్‌ని చూడొచ్చు. సరస్వతి, అలియాస్‌ జూలియట్‌గా మృణాల్‌ ఠాకూర్‌ అదరగొట్టింది. చాలా చోట్ల శేష్‌ని డామినేట్‌ చేసింది. సెకండాఫ్‌ మెయిన్‌గా ఆమె పాత్ర చుట్టూనే సాగుతుంది. స్ట్రగులింగ్‌ సీన్లలో ఇరగదీసింది. మల్లీగా కామాక్షి భాస్కర్ల కాసేపు మెరిసినా తన ఇంపాక్ట్ చూపించింది. ఆసుపత్రి హెడ్‌గా ప్రకాష్‌ రాజ్‌ పాత్ర ఫర్వాలేదు. కాకపోతే అంత బలంగా లేదు. పోలీస్‌ ఆఫీసర్‌గా అనురాగ్‌ కశ్యప్‌ పాత్ర ఉన్నంత సేపు ఆకట్టుకుంటుంది. కానీ ఎక్కువగా లేదు. పోలీస్‌గా సునీల్‌ బాగా చేశాడు. మరో పోలీస్‌గా జైన్‌ మేరీ ఖాన్‌ తన ఇంపాక్ట్ చూపించింది. మృణాల్‌ కూతురుగా చేసిన పాప అదరగొట్టింది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

67
డెకాయిట్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

అడవి శేష్‌ కథ బాగుంది. అబ్బూరి రవి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు షానియల్‌ డియో మంచి కథని ఎంచుకున్నారు. కానీ దాన్ని అంతే ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే పరంగా లోపలున్నాయి. సెకండాఫ్‌ని బాగా డీల్‌ చేశారు. అదే సినిమాని నిలబెడుతుంది. టెక్నీకల్‌గా మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. విజువల్స్ గానూ ఆకట్టుకుంది. ఎడిటింగ్‌ పరంగా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇక మ్యూజిక్‌ బాగుంది. బీజీఎం అదిరిపోయింది. భీమ్స్ మెప్పించారు. గ్యానీ బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. మేజర్‌గా స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, డబ్బింగ్‌ పరంగా లోపాలు కనిపించాయి. అవి పక్కన పెడితే ఓవరాల్‌గా ఎంగేజ్‌ చేస్తూ ఆకట్టుకునే మూవీ అవుతుందని చెప్పొచ్చు.

77
ఫైనల్‌గా

 ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ, యాక్షన్‌ పరంగా ఆకట్టుకునే మూవీ డెకాయిట్‌. అడివి శేష్‌ చేసిన భిన్నమైన ప్రయత్నమని చెప్పొచ్చు.

రేటింగ్‌: 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories