క్రైమ్ కామెడీ ‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ

First Published | Apr 19, 2024, 3:10 PM IST

ఈ వారం కూడా ఓ మూడు చిన్న సినిమాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. వాటిలో కొద్దో గొప్పో బజ్ ఉన్న  చిత్రం ‘పారిజాత ప‌ర్వం’. 

Paarijatha Parvam

పెద్ద సినిమాలు ఏమీ మార్కెట్ లో లేకపోవటంతో చిన్న సినిమాల రిలీజ్ లకు ఈ సీజన్ వరంగా మారింది. అయితే ఆ చిన్న సినిమాల్లో ఎన్ని జనాలకు తెలుస్తున్నాయి. ఎన్ని హిట్ అవుతున్నాయి. ఎన్ని థియేటర్ లో నిలబడుతున్నాయి అనేది చూస్తే మాత్రం నిరాశే.  ఈ వారం కూడా ఓ మూడు చిన్న సినిమాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. వాటిలో కొద్దో గొప్పో బజ్ ఉన్న  చిత్రం ‘పారిజాత ప‌ర్వం’. ‘కీడా కోలా’తో ప్రేక్ష‌కుల్ని మెప్పించిన చైత‌న్య రావు,  సునీల్, శ్ర‌ద్ధా దాస్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించటం చిత్రం కావటంతో ఇంట్రస్ట్ గానే అనిపించింది. అలాగే టీజ‌ర్‌, ట్రైల‌ర్లు కూడా బాగుండటంతో బాగుంటే ఓ లుక్కేద్దామనే ఇంట్రస్ట్ తో ఉన్నాయి. అయితే సినిమా ఎలా ఉంది..ఓటిటీలో చూద్దామనుకునేలా ఉందా..ఈ వీకెండ్ కు థియేటర్ కు వెళ్లి చూద్దామనుకునేలా ఉంది. అసలు  ఈ సినిమా క‌థేంటి? చూద్దాం.
 

Paarijatha Parvam

స్టోరీ లైన్

ఇంద్ర టైమ్ లో ఉత్సాహంగా భీమవరం నుంచి హీరో కావాలని హైదరాబాద్ వస్తాడు ఓ కుర్రాడు  శ్రీను (సునీల్). అయితే సినిమా ఆఫర్స్ పట్టుకోవటం అతని వల్ల కాదు. సినిమా వాళ్లు  కృష్ణా నగర్ ఓంకార్ బారులో పరిచయం అవుతారని అక్కడ బార్ వెయిటర్ గా జాబ్ లో జాయిన్ అవుతాడు.  అక్కడే కొరియోగ్రాఫర్ అవ్వాలని  వచ్చి కాలేక అదే బారులో డ్యాన్సర్‌గా చేస్తోంది పారు (శ్రద్ధా దాస్) పరిచయం అవుతుంది. ఓ టైమ్ లో  పారును ఓ సమస్య నుంచి కాపాడబోయి బార్ ఓనర్(టార్జాన్)ని చంపేస్తాడు శ్రీను. ఆ తర్వాత బార్ శ్రీనుగా మారి సినిమా లు మానేసి దందాలు చేయడం మొదలు పెడతాడు. ఈ కథ...డైరక్టర్ గా ఈ జనరేషన్ లో ట్రైల్స్ వేస్తున్న  చైతు (చైతన్య రావు) కు నచ్చి స్క్రిప్టు రాసుకుంటాడు.


Paarijatha Parvam

ఆ స్క్రిప్టుతో ఓ ప్రొడ్యూసర్ ని పట్టుకుంటాడు కూడా. అయితే తన ప్రెండ్  (హర్ష చెముడు) హీరో అని చెప్పడంతో ఎవరూ ఉత్సాహంగా ముందుకు రారు. అంతేకాకుండా  స్టార్ ప్రొడ్యూసర్ శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్)   అవమానిస్తాడు కూడా. దాంతో ఆఫర్స్ రాక విసుగెత్తిన చైతు..ఓ ప్లాన్ చేస్తాడు. నిర్మాత శెట్టి సెకండ్ సెటప్ (సురేఖా వాణి) ను కిడ్నాప్ చేసి వచ్చిన డబ్బుతో సినిమా తీయాలని అనుకుంటాడు. 

Paarijatha Parvam

అయితే చైతన్య ఈ  కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడే శ్రీను అతని బ్యాచ్  కూడా అదే శెట్టి భార్యను కిడ్నాప్ చేయడానికి వస్తారు. వాళ్ల ప్లాన్ ...శెట్టి దగ్గర నుంచి డబ్బులు గుంజాలని. అయితే వీళ్లిద్దరిలో ఎవరు శెట్టి భార్యను కిడ్నాప్ చేసారు. చివరకు ఏమైంది...ఆ గందరగోళం ఎలా ముగిసింది అనేది మిగతా కథ. 
 

Paarijatha Parvam

ఎలా ఉందంటే..

“Dying is easy, comedy is hard,” అన్నారు మన సినిమా పెద్దలు. క్రైమ్ కామెడీ రాయటం ,తీయటం కామెడీ మాత్రం కాదు. సరిగ్గా తీయకపోతే చూసేవాడికి ట్రాజడీనే. ఇలా ఒకరు అనుకుని మరొకరుని కిడ్నాప్ చేయటం అనే కాన్సెప్టుతో బోలెడు కామెడీ సినిమాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలో ఏవి,ఏ మేరకు నవ్విచాయి అనే దానిపైనా వాటి సక్సెస్ అధారపడి ఉంటుంది. క్రైమ్ కథల్లో హ్యూమర్ ని చొప్పిటం అంటే జోక్ లు పేల్చటం కాదు. పంచ్ డైలాగులు రాయటం కాదు. సిట్యువేషన్ కామెడీ పుడితేనే ఆ బ్యూటీ..ఆ ఫన్. నిజానికి ఈ కథలో కన్ఫూజన్ కామెడీకి ప్లేస్ ఉంది. అది నమ్మే సినిమా చేసినట్లు ఉన్నారు. అయితే ఆ సీన్స్ ఏమీ అనుకున్న స్దాయిలో పండలేదు. ముఖ్యంగా  కీలకమైన  కిడ్నాప్ డ్రామా సినిమాను రక్తి కట్టించలేకపోయింది. ఇలాంటి కన్ఫూజన్ కిడ్నాప్ డ్రామా కథతో అప్పట్లో అల్లరి నరేష్ కెవ్వుకేక అనే సినిమా చేసారు. ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. 

Paarijatha Parvam


 సినిమాలో ఏ కామెడీ అయితే ప్లస్ అవుతుందని భావించి పెట్టాడో అది ఇదవరకు సినిమాల్లో ఆల్రెడీ చూసి చూసి విసిగిపోయారు జనం. ఫస్ట్ హాఫ్ స్లాప్ స్టిక్, డైలాగు కామెడీతో నడిపించినా కోనా సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి మరింత కామెడీ అవసరం అయ్యింది. అయితే అక్కడక్క  డైలాగులతో ప్రేక్షకులనైతే ఎంటర్టైన్ చేయగలిగాడు. కానీ అదే సరిపోదు కదా. స్క్రీన్ ప్లే లో మంచి పట్టు ఉంటేనే  ఇలాంటి సినిమాలకు అంత పకడ్బందీగా కథనం రాయగలుగుతారు. అది జరగలేదు. 

Paarijatha Parvam


మొదటి భాగం ప్రేక్షకులని సినిమాలో ఇన్వాల్వ్ చేయనీయదు సరికదా కాస్త బోర్ కొడుతుంది. ఇక ఇంటర్వల్ తర్వాత ముందు కాస్త పర్వాలేదనిపించినా మధ్యలో మళ్లీ ప్రేక్షకుల మైండ్ డైవర్ట్ అయ్యేలా చేస్తాడు.  ఉన్నంతలో వైవా హ‌ర్ష హీరో అనే బిల్డ‌ప్ కాస్త రిలీఫ్ ఇస్తుంది. రీసెంట్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో సత్య ..ఓ ప్రస్టేటెడ్ హీరోలా కనిపిస్తాడు. అదే సెటప్ ఇక్కడా కనిపిస్తుంది.  అలాగే హీరోయిన్ కారు డ్రైవింగ్ ఎపిసోడ్ నవ్విస్తుంది. సునీల్ పాత్ర క్లారిటీ ఉండదు. కమిడయనా లేక విలనా అనేది సినిమా అయ్యిపోయినా తేలదు. ఏదైమైనా ఇలాంటి సినిమాలకు అవసరమైన స్క్రిప్టు లేకపోవటమే దెబ్బ కొట్టింది. 

Paarijatha Parvam


ఫెరఫార్మెన్స్ వైజ్ చూస్తే..

చైతన్యారావు తనకు వచ్చిన ఇమేజ్ ని ఇలాంటి ఉడికీ ఉడకని కథలతో పాడుచేసుకుంటున్నాడనపిస్తోంది. చైతన్య రావు ప్రియురాలిగా నటించిన మాళవిక  సినిమాలో స్కోప్ ఉన్నంత వరకు పర్వాలేదనిపించింది.  సునీల్ ఉన్నాడు కాబట్టే ఆ కాసేపు చూడగలిగాము అనిపిస్తుంది. సురేఖా వాణికి ఉన్నంతలో బాగా చేసింది.   స‌మీర్‌, ముర‌ళీధ‌ర్ గౌడ్ త‌దిత‌రుల వంటి వాళ్లు  తమ తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనను కనబరిచి ఆకట్టుకున్నారు. వైవా హర్ష ఈ సినిమాలో కాస్తంత గుర్తుంచుకో దగ్గ పాత్ర చేసింది. 

 టెక్నికల్ టీం విషయానికి వస్తే పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి.  బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే  మాత్రం కష్టమే అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. ఎడిటింగ్ మరింత  క్రిస్పీగా ఉండాల్సిన అవసరం ఉంది. 

Paarijatha Parvam


ఫైనల్ థాట్

అక్కడక్కడా నవ్వుకోవటానికి అయితే ఓకే..కంటిన్యూగా నవ్వాలి.నిజంగానే కామెడీ సినిమాకు వచ్చాము అనుకోవాలంటే మాత్రం కష్టమే.

Rating:2
---సూర్య ప్రకాష్ జోశ్యుల

Paarijatha Parvam


 నటీనటులు: చైతన్యరావు, సునీల్‌, శ్రద్ధాదాస్‌, వైవా హర్ష తదితరులు;
 సంగీతం: రీ; ఎడిటింగ్‌:
 శశాంక్‌; సినిమాటోగ్రఫీ: బాల సరస్వతి; 
నిర్మాత: మహీందర్‌రెడ్డి, దేవేష్‌; 
రచన, దర్శకత్వం: సంతోష్‌ కంభంపాటి; 
విడుదల: 19-04-2024

Latest Videos

click me!