Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?

Published : Oct 09, 2026, 07:01 AM IST

ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలిచిన శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా మూవీ `కామ్రేడ్‌ కళ్యాణ్‌`. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో, బ్యాక్‌ డ్రాప్‌తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? శ్రీవిష్ణు మరో హిట్‌ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం.

PREV
16
శ్రీవిష్ణు కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ

కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాగ్‌ తో రాణిస్తున్నాడు యంగ్‌ హీరో శ్రీవిష్ణు. ఒకప్పుడు కింగ్‌ ఆఫ్‌ కంటెంట్‌ ట్యాగ్‌తో రాణించారు. ఇప్పుడు దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌కి మార్చారు. అందులో భాగంగా తాజాగా ఆయన `కామ్రేడ్‌ కళ్యాణ్‌` అనే చిత్రంలో నటించాడు. దీనికి జానకీరామ్‌ మారెళ్ల దర్శకత్వం వహించారు. కోన వెంకట్‌ సమర్పణలో స్కంధ వాహన మోషన్‌ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్‌ పతాకాలపై వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు. ఇందులో మహిమా నంబియర్‌ హీరోయిన్‌గా నటించగా, రాధికా శరత్‌ కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమయే, సత్య, సుదర్శన్‌, వెన్నెల కిశోర్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, సాయి చంద్‌, శత్రు కీలక పాత్రలు పోషించారు. నేడు శుక్రవారం(అక్టోబర్‌ 9)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణు నవ్వించాడా? నక్సల్‌ నేపథ్య కథకి కామెడీ సెట్‌ అయ్యిందా? సినిమా హిట్టా ఫట్టా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
కామ్రేడ్‌ కళ్యాణ్ మూవీ కథ

నక్సల్‌ ప్రభావం ఉన్న ఆంధ్రా ఒరిస్సా బార్డర్‌లోని ఒక విలేజ్‌లో కళ్యాణ్‌(శ్రీవిష్ణు) అలంకార్‌ థియేటర్‌ని నిర్వహిస్తుంటాడు. అక్కడ ఎక్కువగా ఆర్‌ నారాయణమూర్తి సినిమాలు ఆడిస్తుంటాడు. వాటి కోసం కళ్యాణ్‌ చిన్న చిన్న మోసాలకు పాల్పడతుంటాడు. వాళ్లమ్మ(రాధికా శరత్‌ కుమార్‌) అల్లరి పనులు చేస్తుండటంతో పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. ఆమెని పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చే క్రమంలో మధ్యలో బ్రీతింగ్‌ సమస్య వస్తుంది. అటుగా వస్తున్న సితార(మహిమా నంబియార్‌) ఆమెని రక్షిస్తుంది. దీంతో ఆమెకి ఫిదా అవుతాడు కళ్యాణ్‌. అయితే వాళ్లది ఒరిస్సా, తెలుగు రాదు. కళ్యాణ్‌ ఆమెకి సపోర్ట్ చేస్తుంటాడు. అయితే ఉన్నట్టుండి సితార ఫ్యామిలీ బండారం బయటపడుతుంది. ఓ సేట్‌(ఉపేంద్ర లిమయే) వద్ద అప్పు తీసుకొని వేరే ఊరు నుంచి పారిపోయి వస్తారు. దీంతో ఆ సేట్‌ అందరిలోనూ సితార ఫ్యామిలీ పరువుతీస్తారు. బాండ్‌ పేపర్‌ ప్రకారం సితారని పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తుంటాడు. దీంతో అమ్మాయి ఫ్యామిలీ కోసం కళ్యాణ్‌ తాను అప్పు తీరుస్తానని సవాల్‌ విసురుతాడు. ఆ తర్వాత డబ్బు కోసం ఒక స్కీమ్‌లో చేరి నక్సల్‌గా మారతాడు. మరి కళ్యాణ్‌ చేరిన ఆ స్కీమ్‌ ఏంటి? తన ప్రేమ కోసం కళ్యాణ్‌ తిరిగి వచ్చాడా? నక్సల్స్ లో కలిసిపోయాడా? ప్రేమకి, నక్సలైట్‌ కథకి ఎలా సింక్‌ కుదిరింది? ఈ సినిమా ద్వారా శ్రీవిష్ణు, దర్శకుడు ఏం చెప్పాలనుకున్నారేనేది మిగిలిన సినిమా.

36
కామ్రేడ్‌ కళ్యాణ్‌ సినిమా ఎలా ఉందంటే?

నక్సల్‌ బ్యాక్‌ డ్రాప్‌కి ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి, అందులోని హ్యూమర్‌ ప్రధానంగా చేసుకొని రూపొందిన చిత్రమిది. అదే సమయంలో చిన్నపాటి సందేశాన్ని కూడా ఇందులో మేళవించారు. అలాగే నక్సల్‌ పేరుతో పోలీసులు చేస్తున్న మోసాలను కూడా చూపించారు. సినిమా ప్రారంభం ఆర్‌ నారాయణ మూర్తి నటించిన `ఎర్రసైన్యం` మూవీతో ప్రారంభమవుతుంది. ఆ విప్లవాన్ని ఆడియెన్స్ ని రగిల్చి తన థియేటర్లో జనాలు సినిమా చూసేలా చేస్తాడు హీరో. ప్రారంభంలో వచ్చే పాట అదిరిపోయింది. పూనకాలు తెప్పించింది. కానీ ఆ తర్వాత శ్రీవిష్ణు ఫన్‌ ట్రాక్‌ ఎత్తుకున్నారు. దీనికితోడు సుదర్శన్‌ యాడ్‌ అవుతాడు. ఈ ఇద్దరు ఇన్నోసెంట్‌గా ప్రవర్తించే అంశాలు ఆకట్టుకుంటాయి.

ఆ తర్వాత అమ్మాయి తన అమ్మకి హెల్ప్ చేయడంతో ఆమెకి హీరో పడిపోవడం, వాళ్లు ఒరియాకి చెందిన వాళ్లు కావడంతో లాంగ్వేజ్‌ కి సంబంధించిన సమస్య రావడం, ఈ క్రమంలో హీరో చెప్పే డైలాగ్‌లు నవ్వించేలా ఉంటాయి. ఆమె వెంటపడుతుండగా, చివరికి తను కష్టాల్లో ఉందని తెలిసి, ఆమె కుటుంబం పరువుని కాపాడటం కోసం, హీరోయిన్‌ని సేట్‌ పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు హీరో డబ్బులు తెస్తాననడం వరకు సరదాగా సాగుతుంది. సత్య పాత్ర ఎంట్రీ తర్వాత మరింత ఫన్నీగా మారుతుంది. ఆ తర్వాత హీరోయిన్‌ కోసం హీరో నక్సలైట్‌ స్కీమ్‌లోకి చేరడం, దీని కారణంగా పూర్తిగా నక్సల్స్ తో వెళ్లిపోవడం అనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సినిమా ఎలా వెళ్తుందనే ఉత్కంఠ క్రియేట్‌ అవుతుంది.

సెకండాఫ్‌లో.. తాను నక్సల్‌ కాదని నిరూపించుకునే ప్రయత్నం చుట్టూ సాగుతుంది. అటు నక్సల్స్ కి, ఇటు పోలీసులకు మధ్య శ్రీవిష్ణు, సత్య నలిగిపోతూ వారిని మ్యానేజ్‌ చేసే ప్రయత్నం కొంత ఉత్కంఠభరితంగా, మరికొంత ఫన్నీగా ఉంటుంది. అక్కడ సత్య కామెడీ వర్కౌట్‌ అయ్యింది. అడవిలో నక్సల్స్ చేసే పనులు, దానికి వీరిద్దరు చేసే వెదవ పనులు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ మాత్రం ఉత్కంఠ భరితంగా మారుతుంది. అటు నక్సల్స్ కి, ఇటు పోలీసులకు ఇచ్చిన సందేశం బాగుంది. అయితే సినిమా ఫస్టాఫ్‌ కొంత స్లోగా సాగుతుంది. అలాగే సెకండాఫ్‌లోనూ అదే ఫీలింగ్‌. మెయిన్‌గా ఫన్‌ వర్కౌట్ కాలేదు. ఇరికించినట్టుగా ఉంది. సత్య, సుదర్శన్‌, శ్రీవిష్ణు చేసే ఫన్‌ కొన్ని ఎపిసోడ్లలోనే వర్కౌట్‌ అయ్యింది. ఉపేంద్ర పాత్ర, వెన్నెల కిశోర్‌ పాత్ర హిలేరియస్‌గా ఉంటాయి. కానీ ఆ స్థాయిలో కామెడీ మాత్రం జనరేట్‌ కాలేదు.

చాలా వరకు బలవంతపు కామెడీ కనిపించింది. అదే సమయంలో నక్సల్స్ బ్యాక్‌ డ్రాప్‌ తీసుకొని దాన్ని కామెడీగా చూపించడం కనెక్టింగ్‌గా లేదు. ఇది రాంగ్‌ ఛాయిస్‌లా ఉంది. ఇక డ్రామా కూడా కొంత వరకు ఓకే, కానీ చాలా వరకు రొటీన్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. ఈ అంశాలు పక్కన పెడితే మాత్రం ఇదొక మంచి సందేశాత్మక, అదే సమయంలో నక్సల్స్ పేరుతో జరిగే మోసాలకు సంబంధించి అవగాహన కలిగించే మూవీ. కొన్ని మైనస్‌లు ఉన్నప్పటికీ, టైమ్‌ పాస్‌కి సరదాగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు.

46
కామ్రేడ్‌ కళ్యాణ్‌ లో నటీనటుల నటన ఎలా ఉందంటే?

కళ్యాణ్‌ పాత్రలో శ్రీవిష్ణు ఇరగదీశాడు. తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. అటు పోలీసులు, ఇటు నక్సల్స్ మధ్య నలిగిపోయే పాత్ర, కథనం సీరియస్‌గా ఉంటే కళ్యాణ్‌గా శ్రీవిష్ణు చేసే రచ్చ అదరిపోతుంది. కానీ తన నుంచి ఇలాంటి సినిమాని మాత్రం ఊహించలేదు. ఇక సితారగా మహిమా నంబియార్‌ చాలా బాగా చేసింది. అలాగే కళ్యాణ్‌ అమ్మగా రాధికా శరత్‌ కుమార్‌ అదరగొట్టింది. దుమ్మురేపింది. శ్రీవిష్ణు ఫ్రెండ్స్ గా సుదర్శన్‌, సత్య దుమ్ములేపారు. సత్య కామెడీ ఆశించిన స్థాయిలో వర్కైట్ కాలేదు.. కొన్ని చోట్ల మాత్రం బాగా పేలాయి. పోలీస్‌ అధికారికి షైన్‌ టామ్ చాకో సైతం మెప్పించాడు. పోలీస్‌ పాత్రలో బ్రహ్మాజీ మెప్పించాడు. నక్సల్స్ గా సాయిచంద్‌, శత్రు ఫర్వాలేదనిపించారు. అప్పులిచ్చే సేట్‌గా ఉపేంద్ర నవ్వించే ప్రయత్నంచేశాడు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

56
టెక్నీకల్‌గా కామ్రేడ్‌ కళ్యాణ్‌ ఎలా ఉందంటే?

విజయ్ బుల్గానిన్‌ మ్యూజిక్‌ బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆర్‌ఆర్‌ కూడా ప్లస్ అయ్యింది. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ విజువల్ గా కనువిందు చేస్తుంది. చోట కె ప్రసాద్‌ ఎడిటింగ్‌ మాత్రం కొంత పనిచెప్పాల్సింది. కొంత ట్రిమ్‌ చేయోచ్చు. కోన వెంకట్‌, వెంకట కృష్ణ కర్నాటి నిర్మాణ విలువలకు కొదవ లేదు. ఇక దర్శకుడు జానకీరామ్‌ మారెళ్ల కొత్త బ్యాక్‌ డ్రాప్‌ని ఎంచుకున్నాడు. నక్సల్స్ అనేది సీరియస్‌ బ్యాక్‌ డ్రాప్‌. దానికి కొంత ఫన్‌ యాడ్‌ చేయడమనేది సాహసమనే చెప్పాలి. ఆ విషయంలో పూర్తిగా సక్సెస్‌ కాలేకపోయినా, చాలా వరకు మెప్పించే ప్రయత్నం చేశాడు. బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఫన్‌ జనరేట్‌ చేయడంలో ఇంకా ఫోకస్‌ చేయాల్సింది. కానీ చాలా వరకు మెప్పించాడు. కామెడీని ఇంకా గ్రిప్పింగ్‌గా రాసుకుంటే సినిమా అదిరిపోయేది.

66
ఫైనల్‌గా

సరదాగా నవ్వులు పూయించే కామ్రేడ్‌ కళ్యాణ్‌. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఎంజాయ్ చేయోచ్చు.

రేటింగ్‌: 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories