Cobra Movie Review
అప్పట్లో కమల్ హాసన్ ..పది గెటప్ లలో కనపడటానికి ఓ కథ రాసుకుని దశావతారం అనే సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమాలో గెటప్స్, పాటలు జనాలకు బాగానే నచ్చాయి. ఇప్పుడు విక్రమ్ కూడా తనలోని నటుడుని ఆవిష్కరిస్తూ ...వెరైటి గెటప్స్ తో తన అభిమానులకు అలరించటానికి మన ముందుకు వచ్చారు. మరి ఈ విక్రమ్ దశావతారం జనాలకు నచ్చిందా.... ఈ చిత్రం కథేంటి, తెలుగువారికి నచ్చే సినిమాయేనా వంటి వివరాలు రివ్యూలో చూద్దాం.
కథ:
ఒరిస్సా ముఖ్యమంత్రి, స్కాట్లాండ్ యువరాజు, రష్యాలో ఒక మంత్రి... వరసపెట్టి వరల్డ్ టాప్ లీడర్స్ , ప్రముఖులు హత్యకు గురి అవుతూంటారు. ఇన్విస్టిగేట్ చేస్తున్న టర్కిష్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లాం (ఇర్ఫాన్ పఠాన్)కు ఈ హత్యలు నిద్ర పట్టనివ్వవు. చెన్నైకు చెందిన క్రిమిలాలిజీ స్టూడెంట్ జూడీ (మీనాక్షీ గోవింద్ రాజన్) సాయింతో కోబ్రా ఈ హత్యలు చేస్తున్నాడని తేలుతుంది. కానీ ఆ కోబ్రా ఎవరో మిస్టరిగా ఉండిపోతుంది. దాంతో చెన్నై వచ్చి లోకల్ పోలీస్ లు సాయింతో ఇక్కడ ఎంక్వైరీ మొదలెడతాడు. ఆ క్రమంలో అతను తన విచారణలో ఆ కోబ్రా ఓ మేధమెటీషయన్ అని తెలుస్తుంది. దాంతో సాధారణ లెక్కలు మాస్టర్ మది (విక్రమ్) పై అనుమానం వెళ్తుంది. ఇంతకి కోబ్రా ...మది ఒకరేనా? అదే నిజమైతే అతను ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు...హత్యలకు గురైన వారికీ మిలియనీర్ అయిన రిషి (రోషన్ మాథ్యూ)తో ఉన్న రిలేషన్ ఏమిటి... మదిని ప్రేమిస్తున్న భావన (శ్రీనిధి శెట్టి) కథేంటి... చివరకు, మదిని అరెస్ట్ చేసారా? చివరకు ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలిసిస్ ...
విక్రమ్ కు మొదటి నుంచి విభిన్నమైన గెటప్‌లు, వైవిధ్యమైన కథలు అంటే ఆసక్తి. అయితే అవేమీ అతనికి సక్సెస్ తీసుకురాలేదు. ఎప్పుడో ఒక అపరిచితుడు, ఒక శివపుత్రుడు తప్పిస్తే చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. అయినా తన దారి వదలలేదు. మరో సారి కొత్త గెటప్‌లు, కాన్సెప్ట్ బేస్డ్ కథ ఎంపిక చేసుకుని మన ముందుకు వచ్చాడు. అక్కడిదాకా సక్సెస్అయ్యాడు. కాకపోతే ఈ సినిమా ఎంతకీ పూర్తి కాని సినిమాగా మారింది. ఫస్టాఫ్ సినిమా స్పీడుగా నడిచి ఇంటర్వెల్ కూడా ఫెరఫెక్ట్ గా పడింది. అయితే సెకండాఫ్ లో ఆ స్పీడు కొనసాగించలేకపోయారు. చాలా కన్ఫూజ్ గా బోరింగ్ గా సీన్స్ తయారయ్యాయి. స్క్రీన్ ప్లే లో ఎక్కడా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ కనపడవు. ఇలాంటి కథలకు కావాల్సిన పంచ్ కనపడదు. దర్శకుడు స్క్రిప్టుని చాలా సంక్లిష్టంగా రాసుకుని తెరకెక్కించాడు. ఇక ప్రధాన పాత్రల మధ్య కాంప్లిక్ట్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. విలన్ పాత్రకు, విక్రమ్ కు కలిగే భ్రమలకు నాన్ సింక్ నడుస్తుంది. ఏదైమైనా సెకండాఫ్ ఇంకాస్త ఇంట్రస్టింగ్ గా రాసుకుని, ప్లాష్ బ్యాక్ కాస్త తగ్గించి , ఆ సీన్స్ మధ్య సమన్వయం ఉండి ఉంటే ఇంకా బాగుండేది. క్లైమాక్స్ పరిస్దితి కొంచెం అటూగా ఇదే. విక్రమ్ క్యారెక్టరైజేషన్ లో ఉన్న కాంప్లెక్స్ ... ఇన్వెస్టిగేషన్ జరిగే వరకూ ప్రేక్షకులకు తెలియదు. దాన్ని దాచి పెట్టకుండా ఉంటే బాగుండేదే.
chiyaan vikram in cobra
టెక్నికల్ గా ....
ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. 'అధీరా...' సాంగ్ హైలెట్.BGM సినిమా నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్ళింది. తెలుగు డబ్బింగ్ కూడా నీట్ గా బాగుంది. తెలుగు డైలాగులు కూడా బాగా సింక్ అయ్యాయి. ప్రొడక్షన్ డిజైన్ చాలా నీట్ గా ఉంది. కెమెరా వర్క్ కూడా సినిమా కు పెద్ద స్దాయిలో ప్లస్ అయ్యింది. ప్రొడక్షన్ వేల్యూస్ బాగా రిచ్‌గా ఉన్నాయి. డైరక్టర్ ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా ప్లాన్ చేసారు. దిలీప్ సుబ్బరామన్ స్టంట్స్ ఈ సినిమాలో గుర్తుండిపోతాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే మినిమం ఓ అరగంట తీసేస్తే సినిమా మరింత షార్ప్ గా ఉంటుంది.
నటీనటులు...
విక్రమ్ అభిమానులకు చాలా కాలం తర్వాత ఆయన నుంచి మంచి గెటప్స్ , నటన ఉన్న సినిమా చూసామనే ఫీలింగ్ వస్తుంది. శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరూ గుర్తుండిపోయే పాత్రలు చేసారు., కె.ఎస్. రవికుమార్, రోషన్ మాథ్యూ, మృణాళిని రవి పాత్రలు కూడా తమ పాత్రలకు ప్రాణం పోసారు. మిగతావాళ్లకు అలా నటించుకుంటూ పోయారు.
ఫైనల్ థాట్:
విక్రమ్ కోసం ఓ సారి చూడచ్చు...అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తే కష్టం అనిపించవచ్చు.
Rating : 2.5/5
నటీనటులు : విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కె.ఎస్. రవికుమార్, రోషన్ మాథ్యూ, మృణాళిని రవి, మియా జార్జ్, మీనాక్షీ గోవింద్ రాజన్, జాన్ విజయ్, 'రోబో' శంకర్ తదితరులు
సినిమాటోగ్రఫీ : హరీష్ కన్నన్
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాత : ఎస్ఎస్ లలిత్ కుమార్
తెలుగులో విడుదల: ఎన్వీ ప్రసాద్ (ఎన్వీఆర్ సినిమా)
రచన, దర్శకత్వం : ఆర్ అజయ్ జ్ఞానముత్తు
విడుదల తేదీ: ఆగస్టు 31, 2022