అనన్య నాగళ్ల ‘తంత్ర’రివ్యూ

First Published | Mar 15, 2024, 2:46 PM IST

దేముళ్లు,దెయ్యాలు సినిమాలపై మళ్లీ భాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో టీజర్ ,ట్రైలర్ లతో ఉత్సాహపరుస్తూ..

Tantra movie review


ఆ మధ్య కాలంలో వరసపెట్టి హారర్ సినిమాలు వచ్చి పడిపోయాయి. హారర్ సినిమా అనేసరికి ఒకే సెటప్ లో కధలని చుట్టేసే ప్రయత్నం జరిగింది. ఒక పాడు బడ్డ బంగ్లా.. అందులో ఆత్మ లేదా దెయ్యమో.. ఏ సినిమా చూసినా ఇదే తంతే.  ప్రేక్షుకులు కూడా రొటీన్ గా ఫీలయ్యారు.  హారర్ కి కామెడీ లు అయితే  ఇంకా దారుణం వెకిలిగా హారర్ ని చూపించే దిశగా సినిమాలు తయారుచేసి వదిలారు. దీంతో ఈ సినిమాలపై ఆశక్తి తగ్గిపోయింది. ఇలాంటి టైమ్ లో మళ్లీ హారర్ సినిమాలు మొదలయ్యాయి. అన్ని భాషల్లోనూ హారర్ సినిమాలకు మంచి ఆదరణే లభిస్తోంది. దేముళ్లు,దెయ్యాలు సినిమాలపై మళ్లీ భాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో టీజర్ ,ట్రైలర్ లతో ఉత్సాహపరుస్తూ తంత్ర అంటూ ఈ చిత్రం మన ముందుకు వచ్చింది. ఈ సినిమా ఏ మేమరకు మనకు నచ్చే అవకాసం ఉంది. అసలు ఈ తంత్రం కథఏంటి వంటి విషయాలు చూద్దాం. 

స్టోరీ లైన్ 

తల్లిని చిన్నతనంలో కోల్పోయిన  రేఖ (అనన్యా నాగళ్ల)కి దెయ్యాలు కనిపిస్తూంటాయి.  . తండ్రి ఆదరణ సైతం లేని ఆమెకు చిన్ననాటి స్నేహితుడు తేజా (ధనుష్ రఘుముద్రి) అంటే రేఖకు ఇష్టం. అతడూ ఆమెను ప్రేమిస్తాడు. అయితే...ఈలోగా ఎవరో  రేఖ క్షుద్ర ప్రయోగం చేశారని తేజాకు  తెలుస్తుంది. తను ఇష్టపడిన అమ్మాయిని ఆ క్షుద్ర ప్రయోగం బారి నుంచి తేజా కాపాడాడా..అసలు రేఖకు క్షుద్ర ప్రయోగం చేసిందెవరు..వజ్రోలి రతి అంటే ఏమిటి...దాన్ని  ఎవరు ఎవరి మీద ప్రయోగించారు? చివరకు రేఖను తేజా కాపాడుకోగలిగాడా...ఈ కథలో  రాజేశ్వరి (సలోని) పాత్ర ఏమిటి.. చాలా కాలం తర్వాత విగతి (టెంపర్ వంశీ) ఆ ఊరుకి ఎందుకు వచ్చాడు...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Latest Videos


Tantra movie review

ఎలా ఉంది 

తంత్రం అనగానే మనకు చేతబడులు, క్షద్ర శక్తులు గుర్తు వస్తాయి. అలాగే ఓ రకమైన భయం కలగచేస్తాయి. అది ఎంతదాకా వెళ్లిందంటే ఎక్కడైనా ముగ్గు గానీ, నిమ్మకాయలు కానీ చూస్తేనే భయపడే స్దితికి చేరుకున్నాము. కానీ తంత్రం కూడా ఓ  శాస్త్రం అని, అదీ ఓ పూజ విధానమే అని ఈ సినిమాద్వారా  అవగాహన కలిగించేందుకు దర్శకుడు చేసిన  ప్రయత్నం కొంత కనిపిస్తుంది. అయితే  దర్శకుడు భయపెట్టడం కన్నా తన దగ్గర ఉన్న కంటెంట్ ని ఎక్కువగా ప్రజెంట్ చేయటం మీదే దృష్టి పెట్టారు. రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, ఛిన్నామస్తా దేవి...ఇలా ఈ 'తంత్ర'ని  అధ్యయాలు గా చూపించాడు.  దైవీ పూజల్లో దక్షిణాచారం, వామాచారం అనే రెండు పూజలను ప్రస్తావించాడు.  అయితే వాటిన్నటి ద్వారా పూర్తిగా కథా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. 
 

Tantra movie review


మన ఆలోచన క్షుద్రమైతే ఈ తాంత్రిక పూజ క్షుద్రపూజ అయిపోతుంది అంటూ తాంత్రికం వెనక ఉన్న విషయాలను తెలియచేసే ప్రయత్నం చేసారు. చాలా రీసెర్చ్ చేసి మరీ ఈ సినిమా లో కంటెంట్ రాసుకున్నట్లు   సీన్స్ చూస్తుంటే అర్దమవుతుంది. అలాగే కేవలం భయపెట్టడం అనే కార్యక్రమం పెట్టుకోకుండా ఓ ఎమోషన్ ని సైతం సినిమాలో ఉండేలా చూసుకున్నాడు. ఇదంతా పాజిటివ్ సైడ్. అయితే ఇవన్నీ ప్రేక్షకుడుకి అవసరమా అనిపిస్తుంది. ఇలాంటి రీసెర్చ్ కంటెంట్ పుస్తకంలో చదవుకోవటానికి బాగుంటుంది. కానీ కథలో టెన్షన్, ఇంటెన్సిటీ పుట్టించటానికి పెద్దగా సాయపడలేదు. ప్రతీ పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తోందనేది కథలో కొంతవరకూ ఆసక్తి రేపినా చివరి వరకూ కొనసాగించలేకపోయింది. అలాగే రొమాంటిక్ ట్రాక్ కూడా అంతంత మాత్రంగా ఉంది. తనకు తెలిసున్న విషయాలు మొత్తం చెప్పటం కాకుండా ఎంతవరకూ చెప్పి కథని పరుగెట్టిస్తే బాగుండేది,హారర్ ఎలిమెంట్స్ ని ఇంకెంత సమర్దవంతంగా వాడుకోవాలి  అన్న విషయంపై దృష్టి పెడితే బాగుండేది.

Tantra movie review


టెక్నికల్ గా చూస్తే..

ఓ హార‌ర్ సినిమాకు టెక్నికల్ సరంజామా ఫెరఫెక్ట్ గా  కుదిరితే.. ఆ ప్రాడెక్ట్ స్థాయి వేరేలా ఉంటుంది.  దర్శకుడు కొత్తవాడైనా కొన్ని చోట్ల టెక్నికల్ గా మంచి ఎక్సలెన్సీ కనపరిచాడు. అలాగే ఏదో కథ రాసుకున్నాం అంటే రాసుకున్నాం అన్నట్లు కాకుండా ఈ సబ్జెక్టుపై కాస్త డీప్ గానే రీసెర్చ్ వర్క్ లాంటిది చేసారు.  అలాగే అనన్య నాగళ్ల  పాత్ర ఒక ఎమోష‌న్‌తో సాగుతుంది. అది ప్రేక్ష‌కుల్ని  తనతో ప్రయాణం చేసేలా చేసేలా ప్లాన్ చేసుకోవటం కలిసి వచ్చింది.  సాంకేతికంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. చాలా చోట్ల  ఆ సంగీత‌మే లీడ్ చేస్తూ అక్కడ  ఏదో ఉందేమో,జరగబోతోందేమో అన్న అనుభూతిని అందిస్తుంది. హారర్ జానర్ కదా అని   భయపెట్టే సౌండ్స్ తో కాకకుండా కంటెంట్ పరంగానే ఈ స్కోర్ ఇచ్చారు. కెమరాపనితనం కూడా వుంది.  కెమెరావర్క్ బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. నటీనటుల్లో అనన్య బాగా చేసింది. హీరోగా చేసిన ఆ కొత్త కుర్రాడు ,లక్ష్మణ్,సలోని సాధ్యమైన మేరకు మంచి ఫెరపెర్మాన్స్ ఇచ్చారు.

Tantra movie review


ప్లస్ లు 

అనన్య నాగళ్ల
తంత్రానికి సంభందించిన కొత్త విషయాల పరిచయం

మైనస్ లు

స్లో నేరేషన్ లో కథ నడపటం
ఐడియా బాగున్న కథని అదే స్దాయిలో విస్తరించలేకపోవటం
రొమాంటిక్ ట్రాక్

Tantra movie review


ఫైనల్ థాట్

ఈ సినిమా చూస్తు   భయపడాలి అని కాకుండా తంత్ర విద్యలకు సంభందించిన కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అనే యాంగిల్ లో ఈ సినిమాని ఎంకరేజ్ చేయచ్చు. అయితే తంత్ర విద్యలు నేర్చుకుని ఏం చేయాలి అనే ప్రశ్న మాత్రం మమ్మల్ని  అడగొద్దు.

Rating:2.25

Tantra movie review

బ్యానర్స్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నటీనటులు: అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల, భువన్ సాలూరు తదితరులు
 సినిమాటోగ్రఫి: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల
ఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణ
ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్
మ్యూజిక్: ఆర్ ఆర్ ధృవన్
సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా
సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్
VFX: ఎ నవీన్
DI కలరిస్ట్: పివిబి భూషణ్
కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : శ్రీనివాస్ గోపిశెట్టి
కో-ప్రొడ్యూసర్: తేజ్ పల్లి
 నిర్మాతలు: నరేష్ బాబు పి, రవి చైతన్య
విడుదల తేదీ: 15,మార్చి 2024. 
 

click me!